మరో 24 గంటల పాటు అసని తుఫాన్ ప్రభావం వుంటుంది అంటున్న వాతావరణ శాఖ

 


సామాజిక స్పందన: విశాఖపట్నం

బంగాళాఖాతంలో 'అసని' తీవ్రతుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 25 కి.మీ వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదులుతుంది, ప్రస్తుతం కాకినాడకు 210 కి.మీ., విశాఖపట్నంకు 310 కి.మీ., గోపాలపూర్ కు 530 కి.మీ., పూరీకు 630 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది, ఇది వాయువ్య దిశగా పయనించి రేపు ఉదయంకు కాకినాడ -విశాఖపట్నం తీరాలకు దగ్గరగా చేరుకునే అవకాశం ఉంది, అసిని తుఫాన్ హెచ్చరిక, రేపటిలోగా తీరం దాటే అవకాశం..

అసిని తుఫాన్ రేపు సాయంత్రంలోగా మచిలీపట్నం వద్ద తీరం దాటవచ్చని విశాఖపట్నం వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద తెలియజేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 45 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలు విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విజయవాడ, గుంటూరు జిల్లాలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చని తెలియజేశారు.

అనంతరం దిశమార్చుకుని ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర మరియు ఒడిశా తీరాలకు దూరంగా వాయువ్య బంగాళాఖాతంలోకి వెళ్ళే అవకాశం

తదుపరి 12గంటల్లో క్రమంగా తీవ్రతుపాను నుంచి తుపానుగా బలహీనపడే అవకాశం

ఈ రోజురాత్రి నుంచి ఉమ్మడి కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం

రేపు ఉత్తరాంధ్రలో వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు, ఒకటి రెండు చోట్ల అతిభారీ వర్షాలు పడే అవకాశం

కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75-95 కిమీ వేగంతో ఈదురగాలులు వీస్తాయి

సహాయక చర్యలకు SDRF, NDRF బృందాలు సిద్ధం

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

తుపాను నేపధ్యంలో కోస్తాంధ్ర జిల్లా యాత్రాంగాలని అప్రమత్తం చేసిన విపత్తుల సంస్థ

సముద్రం అలజడిగా ఉండటంతో గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లదించింది.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.