సామాజిక స్పందన: నర్సీపట్నం
గోడ కూల్చివేయడంపై ఆయన కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు,అన్ని అనుమతులు తీసుకునే నిర్మించాం అంటున్న అయ్యన్నపాత్రుడు కుమారుడు రాజేశ్
నర్సీపట్నంలో మున్సిపల్ సిబ్బంది తీరును అయ్యన్నపాత్రుడు రెండో కుమారుడు చింతకాయల రాజేశ్ ఖండించారు. మున్సిపల్ కమిషనర్ నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మించామని చెప్పారు. ల్యాండ్ పర్మిషన్ ఇచ్చాకే కట్టామని రాజేశ్ తెలిపారు. న్యాయంగా ఇల్లు కట్టుకున్నామని.. ఇలా ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్? అని ఆయన నిలదీశారు. పోలీసులు ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేశారని రాజేశ్ ఆరోపించారు. అధికారులు మాత్రం ఆక్రమణలో ఉన్నందునే కూల్చివేశామని చెబుతున్నారు.
మరోవైపు అయ్యన్న ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన కుమారుడు రాజేశ్‌ను అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్నారు. దీంతో పోలీసులు, అధికారులతో కుటుంబసభ్యులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.పంట కాల్వను ఆక్రమించి నిర్మించారంటూ నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను అర్ధరాత్రి మున్సిపల్ సిబ్బంది జేసీబీలతో కూల్చివేశారు. ప్రభుత్వ భూమిలో రెండు సెంట్లు ఆక్రమించారంటూ మున్సిపల్ కమిషనర్ పేరిట ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు.










0 Comments