అమరావతిని శ్మశానమని, ఇప్పుడు ఎకరా ₹10 కోట్లకు అమ్ముతారా అంటూ ప్రశ్నిస్తున్న చంద్రబాబు

  


అమరావతి: సామాజిక స్పందన

రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక పెట్టని సీఎం జగన్‌కు ఆ ప్రాంత భూమలు విక్రయించే హక్కు ఎక్కడిదని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు.అమరావతిని శ్మశానమని చెప్పిన ఈ ప్రభుత్వం.. ఇప్పుడు ఎకరా రూ.10 కోట్లకు ఎలా అమ్మకానికి పెడుతుందని నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను మూడేళ్లుగా పూర్తి చేయకుండా ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇచ్చే యత్నాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలతో వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించిన చంద్రబాబు వైకాపా విధానాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

''ఆత్మకూరు ఉపఎన్నికలో డబ్బులు పంచినా, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ పోటీలో లేకపోయినా వైకాపాకు ఓట్లు పెరగలేదు. దీనికి ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకతే ప్రధాన కారణం. గత ఎన్నికలతో ఉప ఎన్నికను పోల్చి చూస్తే వైకాపాకు కనీసం 10 వేల ఓట్లు కూడా అదనంగా పడలేదు. పన్నులతో వాతలు.. పథకాలకు కోతలు.. అనేలా జగన్ పాలన సాగుతోంది. ప్రజలకు అందే పథకాల్లో రకరకాల నిబంధనల పేరుతో కోతలు పెట్టి డబ్బులు మిగుల్చుకుంటున్నారు. చెత్త దగ్గర నుంచి మొదలు అన్నింటిపైనా పన్నులు వేసి వాతలు పెడుతున్నారు. పలు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు కొత్త కొత్త నిబంధనలతో కోతలు వేస్తోందని దుయ్యబట్టారు. అమ్మఒడి పథకంలో 52 వేల మంది లబ్ధిదారులు తగ్గడాన్ని ప్రస్తావించారు. ఒంటరి మహిళల పెన్షన్ వయసు నింబంధనను 50 ఏళ్లకు పెంచి లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో తగ్గించడం అమానవీయం'' అని చంద్రబాబు మండిపడ్డారు.

@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@@


 ఎన్టీఆర్ విగ్రహానికి వైకాపా రంగులు.. బొమ్ములూరులో ఉద్రిక్తత!

గుడివాడ: సామాజిక స్పందన:

 కృష్ణా జిల్లా గుడివాడ మండలం బొమ్ములూరులో తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ విగ్రహం దిమ్మెకు వైకాపా రంగులు వేయడం ఘర్షణకు దారితీసింది.మినీ మహానాడు జరిగే అంగులూరుకు కి.మీ దూరంలోనే ఈ ఘటన జరిగింది. తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకొని నిరసన తెలిపారు. తెదేపా కార్యకర్తలు వైకాపా రంగులపై పసుపు రంగు వేసి.. ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కొడాలి నానికి వ్యతిరేకంగా తెదేపా కార్యకర్తలు నినాదాలు చేశారు. నాని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, మహానాడు బ్యానర్లపై వైకాపా బ్యానర్లు వేసుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ తెదేపా నేతలు మండిపడ్డారు.మరోవైపు, అక్కడి నుంచి తెదేపా నేతలు వెళ్లాక ఆ పార్టీ శ్రేణులపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. దీంతో బొమ్ములూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.