పెద్దాపురం మండలం, సామాజిక స్పందన
గొదావరి బయెా వేస్ట్ మేనేజ్ మెంట్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న 6 గ్రామాల ప్రజలకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందని సిపిఎం జిల్లా కన్వీనర్ ఎమ్.రాజశేఖర్ తెలిపారు. సిపిఎం మండల విస్తృత సమావేశం కేదారి నాగు అధ్యక్షతన పెద్దాపురం యాసలపు సూర్యారావు భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా రాజశేఖర్ హాజరయ్యారు. ఒక పరిశ్రమ పెడితే ప్రజలకు ఉపయోగం ఉండాలని, పది మందికి ఉద్యోగాలు రావాలని, ప్రజల ఆరోగ్యాలు మెరుగుపరచేదిగా ఉండాలని, ఉపాదిని మరింత మెరుగుపరచేదిగా ఉండాలని, కానీ అలా కాకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడడం, నీరు, గాలి, పంటలు నాశనం చేసే విధంగా ఉండకూడదన్నారు. గోదావరి బయోమేనేజ్మెంట్ పేరుతో మర్రిపూడి, చినబ్రహ్మదేవం ప్రాంతాల్లో నిర్మిస్తున్న పరిశ్రమ కాలుష్య కారకమైందని దీనిని నిర్మించడం తగదన్నారు. 28.07.2017 న అప్పటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందని, ఆ ప్రజా అభిప్రాయ సేకరణలో, ప్రజలు గోదావరి బయో మెడికల్ వేస్టేజ్ ఫ్యాక్టరీని నిర్మించవద్దని ముక్త కంఠంతో ప్రజలు తిరస్కరించారన్నారు. తరువాత 2020 ఆగష్టు 12న ప్రజాభిప్రాయసేకరణ చేసారన్నారు. రెండింటిలోనూ ప్రజలు ప్యాక్టరీని వ్యతిరేకించారని అయినా అక్కడే కడతామంటూ కూర్చోవటం అంటే ఇది దుర్మార్గమైనదని అన్నారు. వెంటనే నిర్మాణ పనులు ఆపాలని, లేనిపక్షంలో ప్రజలతో కలసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కరణం ప్రసాదరావు, మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు, సిరిపురపు శ్రీనివాస్, కుంచుమర్తి కాటంరాజు, డి.క్రాంతి కుమార్ పాల్గోన్నారు.










0 Comments