కాకినాడ జిల్లా, సామాజిక స్పందన
తన ఎంపీ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కాకినాడ పార్లమెంటు అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుని,మాజీ మంత్రి ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పను,మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ను,నవీన్ మర్యాద పూర్వకంగా కలిశారు.తనకు తన తండ్రి 35సంవత్సరాల రాజకీయంతో పాటు ఎదుగుతూ వచ్చానని అలాగే తమ ప్రభుత్వ హయాంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా జిల్లాపై తనకు పూర్తి అవగాహన ఉందని, జిల్లాలో ఏమేమి సమస్యలు ఉన్నాయో పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన నాటి నుంచి తాను జిల్లాలో ప్రతి రోజు ఏదోఒక గ్రామంలో పార్టీని నమ్ముకున్న కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపుతు గతేడాది జగ్గంపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేసి పార్టీలోను కార్యకర్తల్లో రానున్నది తెలుగుదేశం ప్రభుత్వం అని ఎవ్వరూ అధైర్యం పడవద్దని చెప్పి నియోజకవర్గం అంత తిరిగానని అన్నారు.తాను గుర్తించిన ప్రతి సమస్యను పార్టీ సీనియర్ నాయకులతో కలిసి ప్రయాణం చేస్తూ విద్యా, వైద్యం,యువతకు,ఉపాధి అవకాశాలు,బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తానని ఆ ధైర్యం మీదే తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,లోకేష్ పై ఉన్న నమ్మకంతో ఇప్పటి నుంచే అన్ని వర్గాల ప్రజలను కలుసుకుని తన అభిప్రాయాన్ని వారి ముందు పెడుతూ ముందుకు సాగుతున్నాని అన్నారు,నవీన్ వెంట జగ్గంపేట,కాకినాడ జిల్లా నాయకులు పాల్గొన్నారు.










0 Comments