వెంకటగిరి, సామాజిక స్పందన
పథకాల పేరుతో రాష్ట్ర ప్రజలకు ఇచ్చినట్లే ఇచ్చి డబ్బులు కాజేస్తున్నారని జగన్ సర్కార్‌పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు..
జగన్ ఒక కట్టింగ్, ఫిట్టింగ్ మాస్టర్ అంటూ విమర్శలు గుప్పించారు. యువగళం పాదయాత్రలో భాగంగా తిరుపతి జిల్లా
వెంకటగిరిలో ఆయన మాట్లాడారు. జగన్ వద్ద రెండు బటన్లు ఉన్నాయన్నారు. బల్లపైన గ్రీన్ బటన్ నొక్కితే ఖాతాలో రూ.10 జమ అవుతుందని.. బల్ల కింద ఎర్ర బటన్ నొక్కితే ఖాతాల్లోంచి రూ.100 ఖాళీ అవుతుందని లోకేశ్ అన్నారు.
''వైకాపా పాలనలో పెట్రోల్, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు ఇష్టారీతిన పెంచారు. అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా, పింఛన్లు కోత పెట్టారు. వంద సంక్షేమ కార్యక్రమాలకు కోత పెట్టిన ఏకైక సీఎం.. జగన్. ఏటా జాబ్ క్యాలెండర్ పేరిట చేస్తామన్న ఉద్యోగాల భర్తీ హామీ ఏమైంది?'' అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెదేపా అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ భృతి కింద యువతకు రూ.3వేలు అందజేస్తామన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తామన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర అందిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు..










0 Comments