అమరావతి, సామాజిక స్పందన
సీఎం జగన్‌ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా భూమన తన నియోజకవర్గలోని పలు సమస్యలపై చర్చించారు..
వచ్చే నెల 12తో తితిదే ఛైర్మన్, పాలకమండలి పదవీకాలం ముగియనుంది. ప్రస్తుతం తితిదే పాలక మండలి సభ్యుడిగా ఉన్న భూమన.. తితిదే ఛైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎంతో కరుణాకర్‌రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తితిదే ఛైర్మన్ సహా పాలకమండలి సభ్యుల నియామకాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయనని ఇప్పటికే స్పష్టం చేసిన భూమన.. తన కుమారుడికి తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ అంశంపైనా సమావేశంలో చర్చించినట్టు సమాచారం..










0 Comments