ఆంధ్రప్రదేశ్, సామాజిక స్పందన :
అంతరిక్ష పరిశోధనల్ ఎంతో పురోగతి సాధిస్తోన్న భారత్.. తక్కువ ఖర్చుతోనే ప్రయోగాలను చేపడుతూ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది..
ఓ హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ వ్యయంతోనే అంగారక మిషన్ చేపట్టి తన సత్తా చాటుకుంది. ఇలా అంతరిక్ష పరిశోధనల్లో పొదుపు మంత్రంతో దూసుకెళ్తున్నా.. భవిష్యత్తులో భారీ రాకెట్లు అవసరమని ఇస్రో మాజీ ఛైర్మన్ కే శివన్ అభిప్రాయపడ్డారు. జాబిల్లిపై దిగేందుకు చంద్రయాన్-3 సిద్ధమవుతోన్న నేపథ్యంలో.. ఓ జాతీయ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇస్రో శాస్త్రవేత్త ఈ విధంగా మాట్లాడారు..
'మనకు భారీ సామర్థ్యం కలిగిన రాకెట్లతో పాటు పెద్ద వ్యవస్థలు అవసరం. కేవలం పొదుపు ఇంజినీరింగ్‌తో మనుగడ సాధించలేం. అత్యాధునిక సాంకేతికతతోపాటు అత్యంత శక్తిమంతమైన రాకెట్లు అవసరం. ఇందుకోసం ప్రభుత్వం ఇటీవల ఓ మంచి పనిచేసింది. అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇచ్చింది' అని కే శివన్ పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే ప్రైవేటు రంగం ఆసక్తి చూపుతోందని.. ఫలితాలు కూడా కనిపిస్తున్నాయని అన్నారు. త్వరలోనే అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నానని చెప్పారు..
తొలిసారి మనిషిని అంతరిక్షంలోకి తీసుకెళ్లే 'గగన్‌యాన్ మిషన్'తో భారత అంతరిక్ష ఆశయాలు మరింత ఊపందుకుంటాయని ఇస్రో మాజీ చీఫ్ శివన్ పేర్కొన్నారు. ఈ సాంకేతికత నిరూపితమైన తర్వాత.. స్పేస్ స్టేషన్ నిర్మాణం, చంద్రుడిపై శాశ్వత ఆవాసం, ఇతర అంశాల గురించి ఆలోచించవచ్చన్నారు. భారత్ ఇప్పటికే అత్యంత శక్తిమంతమైన క్రయోజెనిక్ ఇంజిన్లను తయారు చేసిందని.. అవి అద్భుతంగా పనిచేస్తున్నాయని అన్నారు. స్పేస్ ఎక్స్ మాదిరిగా పునర్వినియోగ రాకెట్లపై భారత్ ప్రయత్నాలు చేస్తుందా..? అన్న ప్రశ్నకు కే శివన్ బదులిచ్చారు. ప్రస్తుతం నిట్టనిలువు ల్యాండింగ్ ప్రక్రియపై ప్రయోగాలు జరుగుతున్నాయని చెప్పారు..
@@@@@@ మరిన్ని వార్తలు చదవండి@@@@@@
జగన్, చంద్రబాబు ఒకే చోట ఉత్కంఠగా ఏపీ రాజకీయం
ఆంధ్రప్రదేశ్, సామాజిక స్పందన
ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. వైసీపీ వర్సస్ టీడీపీ రాజకీయం ఉత్కంఠగా మారుతోంది. ఈ సమయంలో సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరూ ఒకే నియోజకవర్గంలో పర్యటనకు ఒకే రోజున రానున్నారు..
ఇద్దరూ ఒకే ప్రాంతంలో బస చేయనున్నారు. దీంతో..ఇప్పుడు ఈ ఇద్దరి నేతల పర్యటనల పైన రాజకీయంగా ఆసక్తి పెరుగుతోంది. ఇందుకు రాజమహేంద్రవరం వేదిక కానుంది..
పోలవరంలో ఇద్దరు నేతలు:సీఎం జగన్, చంద్రబాబు ఇద్దరూ ఈ రోజు (సోమవారం) పోలవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాజమహేంద్ర వరంలో బస చేయనున్నారు. 'సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' పేరిట కొద్ది రోజులుగా ప్రాజెక్టులను సందర్శిస్తున్న ఆయన ఆదివారం రాత్రికి ఏలూరు చేరుకున్నారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం పరిధిలో ఉన్న కూనవరం మండలం(అల్లూరి సీతారామరాజు జిల్లా)లో సీఎం.. చింతలపూడి, పట్టిసీమ మీదుగా పోలవరం వెళ్లి ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించనున్నారు. సోమవారం ఉదయం పది గంటలకు చింతలపూడి చేరుకుని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30కు పోలవరం మండలం పట్టిసీమకు చేరుకుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం ఎత్తిపోతలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి పోలవరం వెళ్లి ప్రాజెక్టును, పనుల తీరును పరిశీలిస్తారు..










0 Comments