ఢిల్లీ, సామాజిక స్పందన
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది. ఈనెల 31వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి..
వివరాల ప్రకారం.. ఈనెల 31వతేదీ నుంచి ఫిబ్రవరి తొమ్మిదో తేదీ వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈనెల 31న రాష్ట్రపతి ప్రసంగం ఉండనుంది. ఫిబ్రవరి ఒకటో తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వంలో ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ సమావేశాల అనంతరం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది..
@@@@@@ మరిన్ని వార్తలు చదవండి@@@@@@
రైతు భరోసా పెన్షన్లు పై అపోహలు వద్దు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ , సామాజిక స్పందన
రైతు భరోసా పెన్షన్లపై అపో హలకు తావులేదని పాత లబ్ధిదారులకు యథా విధిగా ఈ పథకాలు అంది స్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
గతంలో లబ్ధి పొందని వారు కొత్తగా కావాల నుకునే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ప్రజాపాలన దరఖాస్తుల సరళి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ముఖ్య కార్యదర్శి విశేషాద్రితో రేవంత్ సమీక్ష నిర్వహించారు.
ప్రజాపాలన దరఖాస్తులో కుటుంబ వివరాలతో పాటు అభయ హస్తం గ్యారంటీ పథకాల వివరాలు కూడా ఇచ్చారు పథకాలు కావాల్సిన వారు టిక్ చేయడంతో పాటు ఈ వివరాలు కూడా నింపాల్సి ఉంది.
రైతు భరోసా వృద్ధాప్య పెన్షన్ వితంతు చేనేత బీడీ కార్మికులకు దివ్యాంగ పెన్షన్లు పాత వారికి యథా విదిగా ఇస్తామని వెల్లడించారు కొత్త వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ప్రజాపాలన దరఖాస్తులు అమ్మకాలపై ఆయన రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు దరఖాస్తులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ప్రజాపాలన కార్యక్రమానికి హాజరవుతున్న ప్రజలకు తాగునీరు అందించడంతో పాటు నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
అర్జీదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసు కోవాలన్నారు పాత పథకాల విషయంలో ఎలాంటి గంగరగోళానికి గురి కావొద్దన్నారు.











0 Comments