కాకినాడ జిల్లా, పెద్దాపురం, సామాజిక స్పందన
కాకినాడ జిల్లా, పెద్దాపురంలో పండుగ వేళ కూడా అంగన్‌వాడీల సమ్మె శిభిరం కొనసాగుతుంది. రాష్ట్రంలో ఎ.పి. అంగన్ వాడీ వర్కర్స్ &హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె 36వ రోజుకు చేరురుంది. జగన్‌మోహన్‌రెడ్డి పండుగను సినిమా సెట్టింగ్‌లు వేసి జరుపుకుంటూ అంగన్‌వాడీలను రోడ్డున పడేసారంటూ నినాదాలు చేసారు. సెట్టింగ్‌లకోసం డబ్బులు ఉండే జగన్‌మోహన్ రెడ్డికి అంగన్‌వాడీల వేతనాల పెంపుకు మాత్రం డబ్బులు కనపడడం లేదా అని ప్రశ్నించారు. పండుగలో కూడా అంగన్‌వాడీలను రోడ్డున పడేసిన ప్రభుత్వం భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. జగన్‌మోహన్ రెడ్డికి పొగడ్తలు తప్ప ప్రజల బాధలు పట్టవా అని ప్రశ్నించారు. సమస్య పరిష్కారం కోసం ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమానికి సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి ఒ. అప్పారావు మద్దతు తెలుపుతూ మాట్లాడారు. సిఐటియు నాయకులు డి. క్రాంతికుమార్, సూరిబాబు, దాడి బేబి, అమలా, ఎస్తేరుపాణి, టిఎల్ పద్మ, లోవతల్లి, వరలక్ష్మీ, వెంకట లక్ష్మీ, భవానీ, పద్మ, దేవి, తులసి, జె.కుమారి, సత్యనారాయణమ్మ, నాగరత్నం తదితరులు పాల్గోన్నారు.
@@@@@@@ మరిన్ని వార్తలు చదవండి @@@@@@
ఉత్సాహంగా సంక్రాంతి ఆటల పోటీలు, నువ్వులగుంటవీధి, వరహాలయ్యపేటల్లో బహుమతి ప్రదానోత్సవ సభ.
కాకినాడ జిల్లా, పెద్దాపురం, సామాజిక స్పందన
డివైఎఫ్.ఐ, సిఐటియు, ఐద్వా, పిఎన్ఎమ్, ఎస్ఎఫ్ఐ, ఆధ్వర్యంలో నువ్వుల గుంటవీధి, వరహాలయ్యపేటల్లో ఉత్సాహభరిత వాతావరణంలో సంక్రాంతి ఆటలపోటీలు జరిగాయి. నువ్వులగుంటవీధిలో కూనిరెడ్డి రవి కుమార్, వరహాలయ్యపేటలో రొంగల అరుణ్ అధ్యక్షతన సభలు జరిగాయి. వరహాలయ్యపేటలో పెద్దాపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్ బొడ్డుతులసి మంగతాయారు, నువ్వులగుంటవీధిలో 18వ వార్డు కౌన్సిలర్ నీలంశెట్టి అమ్మాజీ ముఖ్యఅతిధులుగా హాజరై బహుమతులు అందజేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా యువతను ఒక చోట చేర్చి ఆటలపోటీలు నిర్వహించడం చాలా సంతోషం అన్నారు. నేటి బిజీ ప్రపంచంలో ఇంతమంది ఒకచోట చేరి పండగని పండగలా జరుపుకోవడం చాలా ఆనందరించదగ్గ విషయం అన్నారు. యువజన, కార్మిక సంఘాలు చేస్తున్న కృషి అభినందనీయం అని అన్నారు.
స్ధానికి పెద్దలు గండి తాతారావు, తమనారి సత్యనారాయణ, ముర్రి వీర్రాజు, త్రిమూర్తులు, బళ్ళమూడి సూర్యనారాయణ, షేక్ నాగూర్, గూనూరి రమణలు పాల్గోన్నారు. ప్రజానాట్యమండలి డి. కృష్ణ, సత్యానారాయణ, బంగార్రాజు, ఐద్వా కె. అరుణ, కె. సుబ్బలక్ష్మీ, సిఐటియు క్రాంతి కుమార్, అప్పన్న, శ్రీనివాస్‌లు, ఎస్ఎప్ ఐ నుండి అమృత, నమ్రత, కె. పవన్, నేహాలక్ష్మీ, తదితరలు పాల్గోన్నారు.
ఆటల పోటీలో విజేతలు..
ముగ్గుల పోటీలో నువ్వులగుంటవీధిలో మమతశ్రీ (ప్రధమ) నేహాలక్ష్మీ (ద్వితియ) కె. లక్ష్మీ(తృతీయ), జి. లత (కన్షలేషన్ ), సుందరయ్య కాలనీలో కె. రామలక్ష్మీ, ఎన్.మౌనికా, బి. సత్యవేణి, ప్రధమ, ద్వితియ, తృతియ స్ధానాలు సత్తెమపేటలో కె. రమ్యశ్రీ, కె. అంజలి, బి. అమృత వర్షిణి ప్రధమ, ద్వితియ, తృతియ స్ధానాలు, వరహాలయ్యపేటలో ఎమ్. కావ్య, యు.ప్రియ, ఎస్.ఆదిలక్ష్మీ ప్రధమ, ద్వితియ, తృతియ స్ధానాలు, కృష్ణుడి గుడి సెంటర్‌లో పి.లక్ష్మీ, డి. లక్ష్మీ, జె. అపర్ణ ప్రధమ, ద్వితియ, తృతియ స్ధానాలు, శోభాదియోటర్ వద్ద ఎ. దుర్గాదేవి, ఎ. అమరావతి, ఎ. శ్రీలతలు ప్రధమ, ద్వితియ, తృతియ స్ధానాలు గెలుపొందారు.
స్లో సైక్లింగ్‌లో నువ్వులగుంటవీధిలో దీపక్ , డి. అఖిల, ప్రధమ ద్వితియ స్ధానాలు. వరహలయ్యపేటలో బాలుర విభాగంలో ఎస్.కె సాకీర్, డి.మనోజ్, బాలికలల విభాగంలో ఎమ్. లావణ్య, పి. కీర్తి ప్రధమ ద్వితియ స్ధానాలు గెలుపొందారు.











0 Comments