తెలంగాణ , సామాజిక స్పందన :
మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్ ఫీజియో థెరపీ పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇందుకోసం కామన్ పాలసీని తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు.
ఈ రోజు డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తు కమిషనర్ కర్ణన్ డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ కమలహాసన్ రెడ్డి సీఈఓ ఆరోగ్యశ్రీ విచలక్షి, తదితర అధికారులు ఈ సమావే శంలో పాల్గొన్నారు.
వరంగల్ ఎల్బీ నగర్ సనత్ నగర్ అల్వాల్ లో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు వైద్యుల కొరత లేకుండా మెడికల్ కాలేజీలను ఆసుపత్రులకు అనుసంధానంగా ఉండేలా చూడాలని అన్నారు.
రాష్ట్రంలో మెడికల్ నర్సింగ్ పారా మెడికల్ కాలేజీల్లో ఇంకా ప్రారంభం కాని వాటి వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు కొడంగల్ లో మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు పరిశీలన జరపాలని అధికారులకు సూచించారు.
బీబీనగర్ ఎయిమ్స్ లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం అన్నారు ఎయిమ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం వరంగల్ నల్లగొండ జిల్లాల ప్రజలకు ప్రయో జనం చేకూరు తుందన్నారు.
దీంతో ఉస్మానియా నిమ్స్ ఆసుపత్రులపై భారం తగ్గుతుందన్నారు ఎయిమ్స్ ను సందర్శించి పూర్తిస్థాయి రిపోర్టు తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు..
కొడంగల్ కు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ మంజూరు చేసిన CM రేవంత్ రెడ్డి..
సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు పరిశీలన జరపాలని అధికారులకు సూచించారు.
వరంగల్, ఎల్బీ నగర్, సనత్ నగర్, అల్వాల్‌లో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
బీబీనగర్ ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.










0 Comments