తెలంగాణ , సామాజిక స్పందన
గత ప్రభుత్వ పాలనా కాలంలో పెండింగ్ ల మీద పెండింగ్ లు పడిపోయిన కొత్త రేషన్ కార్డుల వ్యవహారంపై ప్రస్తుత సర్కారు తీవ్రస్థాయిలో ఆలోచన చేస్తోంది. ఎలక్షన్లలో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు తోడు కొత్త రేషన్ కార్డులు సైతం భారీగానే ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ కార్డుల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ఈ అంశమే ప్రధానమైనదిగా సర్కారు భావిస్తోంది. మొన్నటివరకు నిర్వహించిన ప్రజాపాలన సదస్సులకు కొత్త రేషన్ కార్డుల అప్లికేష్లన్లు భారీస్థాయిలో వచ్చాయి.
మంత్రుల క్లారిటీ !!
ప్రజాపాలన దరఖాస్తు పత్రాన్ని అభయ హస్తం హామీలకు సంబంధించిన అప్లికేషన్ గా మాత్రమే చూశారు. కానీ రేషన్ కార్డుల కోసం ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడం అందరినీ అయోమయానికి గురిచేసింది. ఇప్పటిదాకా దీనిపై ఎలాంటి స్పష్టత లేకపోగా.. ఎట్టకేలకు దీనిపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డుల విధివిధానాల్ని ప్రకటిస్తామన్నారు.
ఇప్పటిదాకా తెల్ల కాగితంపైనే…
రేషన్ కార్డుల అప్లికేషన్లను తిరస్కరించకూడదన్న ఉద్దేశంతో కేవలం తెల్ల కాగితం పై రాసి ఇచ్చిన దరఖాస్తుల్ని సదస్సుల్లో తీసుకున్నారు. జనవరిలో ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడుతుందన్న ప్రచారం.. రేవంత్ సర్కారు పగ్గాలు చేపట్టిన నాటి నుంచి సాగుతూనే ఉంది. నిజంగానే రేషన్ కార్డుల అప్లికేషన్లు తీసుకుంటున్నారని భావించి పెద్దసంఖ్యలో జనం.. సదస్సుల వద్దకు చేరుకున్నారు. కొత్త రేషన్ కార్డులపై అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి క్లారిటీ లేకపోవడంతో అందరిలోనూ అయోమయం ఏర్పడ్డ వేళ.. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రులు తెలియజేయడంతో ఊరట లభించినట్లయింది.
.jpeg)









0 Comments