తెలంగాణ, సామాజిక స్పందన
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నలుగురు సలహాదారులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది నలుగురికి కూడా కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాన సలహాదారుగా వేం నరేందర్ రెడ్డిని నియమించారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ వెల్ఫేర్ కోసం ప్రభుత్వ సలహా దారుగా షబ్బీర్ అలీ ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా డా.మల్లు రవిని నియమించారు.
ప్రోటోకాల్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ప్రభుత్వ సలహాదారుగా హెచ్. వేణుగోపాల్ రావును ప్రభుత్వం నియమించింది ఈ సందర్భంగా సాంసృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వారికి శుభాకాంక్షలు తెలిపారు.
వేంనరేందర్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు రేవంత్‌కి సంబంధించిన అన్ని వ్యవహారాల్లోనూ ఈయనే కీలకంగా వ్యవహరి స్తుంటారు ఈ నేపథ్యం లోనే ఆయనకు సలహాదారు పదవి దక్కిందంటున్నాయి పార్టీ వర్గాలు.
నిజామాబాద్‌కి చెందిన మైనార్టీ నేత షబ్బీర్ అలీని కూడా సలహాదారుగా నియమించారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ పోటీ చేయాల్సి ఉన్నా రేవంత్ కోసం నిజామాబాద్ అర్బన్‌కి మారారు. ఓటమి పాలయ్యారు.
ఫలితాల తర్వాత షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ కానీ మరేదైనా పదవి కానీ వస్తుందనే మాట బలంగానే వినిపించింది. ఇప్పుడు ఆయన్ను సలహాదారుగా నియమించారు.. .










0 Comments