ఎస్మాకి భయపడేదిలేదు : జివొ నెం 2 కాఫీల‌ను ద‌గ్దం చేసిన అంగ‌న్‌వాడీలు

   

              

కాకినాడ జిల్లా, పెద్దాపురం, సామాజిక స్పందన

         అంగన్వాడీలు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 27 రోజులుగా చేస్తున్న స‌మ్మెను ఉక్కుపాదంతో అణాచాల‌ని చూస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం అంగ‌న్‌వాడీల‌పై ఎస్మా ప్ర‌యోగిస్తూ తీసుకువ‌చ్చిన జివొ నెం 2 ను ఎ.పి. అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్స్ అండ్ హెల్ప‌ర్స్ యూనియ‌న్ (సిఐటియు) ఆధ్వ‌ర్యంలో దగ్దం చేసారు. పెద్దాపురం మున్సిప‌ల్ సెంట‌ర్‌లో అంగ‌న్‌శాడీల స‌మ్మె 27వ రోజు కొన‌సాగింది. స‌మ్మెకు మున్సిప‌ల్ వ‌ర్క‌ర్స్ యూనియన్ నాయ‌కులు, సామ‌ర్ల‌కోట యుటిఎఫ్ నాయ‌కులు, ప్ర‌జానాట్య‌మండ‌లి క‌ళాకారులు మ‌ద్ద‌తు తెలిపారు. 

    ఈ సంద‌ర్భంగా అంగ‌న్‌వాడీ యూనియ‌న్ నాయ‌కులు దాడి బేబి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన, చట్టబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి పోరాడుతున్న అంగన్వాడీలపై జీవో నెంబర్ 2 ఎస్మా ప్రయోగించిన తీరుచూస్తుంటే ఉద్యమానికి ప్రభుత్వం ఎంతగా భయపడుతుందో అర్థమవుతుందన్నారు. గతంలో ఉద్యోగుల, కార్మికుల పోరాటాలపై ఎస్మాను ప్రయోగించిన ముఖ్యమంత్రులందరూ అధికారాన్ని కోల్పోయారని, జగన్ కూడా ఆ జాబితాలో చేరేందుకు సిద్ధపడాలని హెచ్చరించారు. ఏ ఒక్క అంగన్వాడీ కూడా ప్రభుత్వ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, అంగన్వాడి ఉద్యమానికి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంద‌ని తెలిపారు. రాష్ట్రంలో 6నెలలు సమ్మెలను నిషేధిస్తూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు జగన్ ప్రభుత్వానికి అధికారం రెండునెలలే ఉండగా 6 నెలల ఆదేశాలను ఎలా ఇచ్చారని ఎద్దేవాచేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అంగన్వాడీ డిమాండ్లు పరిష్కరించడం మినహా మరొక మార్గం లేదని స్పష్టం చేశారు. అంగన్వాడీలకు నిత్యావసర ధరలు కనుగుణంగా కనీస వేతనం 26వేలు చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు గ్రాడ్యుటి అంగన్వాడీలకు అమలు చేయాలని, లబ్ధిదారులకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ లుగా మారుస్తూ తక్షణం జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


    సిఐటియు నాయ‌కులు డి. క్రాంతి కుమార్‌, అంగ‌న్‌వాడీ యూనియ‌న్ నాయ‌కులు అమ‌ల‌, నాగ‌మ‌ణి, టిఎల్ ప‌ద్మ‌, తుల‌సి, స్నేహ‌ల‌త‌, ల‌క్ష్మీ, నాగ‌దేవి, జి. మహాలక్ష్మి,జి. లోవకుమారి, ఎన్‌. మంగలక్ష్మీ, డి. రజిని, కాలే దేవి, స‌త్య త‌దిత‌రులు పాల్గోన్నారు.. 


@@@@@ మరిన్ని వార్తలు చదవండి @@@@@


స‌మ‌స్య ప‌రిష్క‌రించే వ‌ర‌కూ మున్సిపల్ కార్మికులు స‌మ్మె కొన‌సాగుతుంది. 

          


       

కాకినాడ జిల్లా, పెద్దాపురం, సామాజిక స్పందన

       13 రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు సమ్మె టెంట్ కొన‌సాగింది. ఎ.పి. మున్సిప‌ల్ వ‌ర్క‌ర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడ‌రేష‌న్ (సిఐటియు) ఆధ్వ‌ర్యంలో 13వ రోజు సమ్మె మున్సిపల్ సెంటర్ లో సమ్మె నిర్వహించారు. స‌మాన ప‌నికి స‌మాన వేతనం, కాంట్రాక్ట్‌, అవుట్ సోర్సింగ్ కార్మికుల ప‌ర్మినెంట్‌కోసం చేస్తున్న స‌మ్మె 13వ రోజుకు చేరుకుంది. మున్సిపల్ వ‌ర్క‌ర్లుతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నామ‌నే పేరుతో కాలయాప‌న చేయ్య‌డం దారుణంగా ఉంద‌న్నారు. వేత‌నాలు పెంచ‌డం అనేది క‌లా అంటూ మాట్లాడుతున్న స‌జ్జ‌ల‌కు క‌నీస అవ‌గాహ‌న ఉందా అని ప్రశ్నించారు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల‌పేరుతో ల‌క్ష‌ల రూపాయ‌లు వేత‌నాలు తీసుకుంటూ కార్మికుల‌కు వేత‌నాలు ఇవ్వ‌డానికి మాత్రం మ‌న‌సురావ‌డం లేద‌ని ప్రశ్నించారు. వంద‌ల కోట్ల జీతాలు ఇచ్చి స‌ల‌హాదారుల‌ను పెట్టుకున్న ముఖ్య‌మంత్రి ఉచిత స‌ల‌హాలు విన‌డం అల‌వాటుగా మారిందా అని ఎద్దేవ చేసారు. నిన్న‌ సామాజిక సాదికార బ‌స్సుయాత్ర చేసిన‌ పెద్ద‌మ‌నుషుల‌కు మున్సిపాల్టిలో ప‌ని చేస్తున్న‌వారు ద‌ళిత‌, బ‌ల‌హీన వ‌ర్గాల బిడ్డ‌ల‌ని క‌న‌ప‌డ‌డం లేదా అని ప్ర‌శ్నించారు. త‌క్ష‌ణం మున్సిప‌ల్ కార్మికుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని పొర్లుదండాల‌తో కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.  

   కార్య‌క్ర‌మంలో సిఐటియు నాయ‌కులు సిరిపుర‌పు శ్రీ‌నివాస్‌, శివకోట అప్పారావు, సింగంపల్లి సింహాచలం, ద్రౌపతి శ్రీను, వేలాపు శివ, వ‌ర్రే భ‌వానీ, ముత్యాల సత్యనారాయణ, వ‌ర్రే కుమారి, నాగ దుర్గ, మ‌డికి కృష్ణ‌, బంగారు సూరిబాబు తడారి భవాని, సేలం శ్రీను, గంటా రమణ, ఇస్సరపు దుర్గ ప్రసాదు, శ్రీకాంతు, మోహ‌న‌రావు, వర్రీ నాగ దుర్గారావు, వ‌ర్రే రాజేష్చిం, గంపల్లి శివ, వర్రే వెంకటలక్ష్మి. నీలాపు నూకరత్నం. వర్రే కుమారి. ముత్యాల దుర్గ. సింగంపల్లి మరిడమ్మ. వర్రే దేవి. పేడారి భవాని. వరే పెద్ద వెంకటలక్ష్మి. పల్లెవేల సత్యవతి. వర్రే భవాని నారాయణమూర్తి త‌దిత‌రులు పాల్గోన్నారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.