ఆశ వర్కర్ల సమస్యలు తీరేది ఏప్పుడు : తహశీల్దారుకి వినతిపత్రం ఇచ్చిన ఆశ వర్కర్లు.



  కాకినాడ జిల్లా, సామాజిక స్పందన

       రాష్ట్రం లో జగన్ మెాహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలను కోరుతూ ఎ.పి. ఆశ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం తహశీల్దారుకి వినతిపత్రం అందజేసారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా మహిళలపట్ల వ్యవహరించడాని నిరసిస్తూ నోటికి నల్ల రిబ్బన్ లు కట్టుకొని ధర్నా చేసారు.  ఆశ వర్కర్ల కు ఎన్నికల ముందు జగన్ మెాహన్ రెడ్డి హామీల వర్షం కురిపించారని, ఇప్పుడు లాఠీల వర్షం కురిపిస్తున్నారని అన్నారు. మహిళలే నా దేవతలు అక్క చెల్లెమ్మలు అని ప్రగల్బలు పలికే జగన్ కి ఆశలు మహిళలుగా కవపడలేదా అని ప్రశ్నించారు. నిత్యం ప్రజల ఆరోగ్య సమస్యలపై సర్వేలు నిర్వహించి, వారిని హాస్పటల్ కి తీసుకువెళ్ళి వైద్యపరిక్షలు చేయించే ఆశాల ఆరోగ్యం అగమ్యగోచరంగా మారిపోయిందన్నారు.  కనీసం మెడికల్ లీవులు కూడా లేకపోవడం దారుణమన్నారు. తక్షణం ఆశ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కలిపించాలని, ప్రమాధభీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేసారు. 
      యూనియన్ నాయకులు లోవకుమారి, వరలక్ష్మీ,.నాగరత్నం, సలోమణి, జాలామణి, రామలక్ష్మీ, తులసి, లావణ్య, సీత, లక్ష్మీ దుర్గ, శ్యామల తదితరులు పాల్గోన్నారు. 


@@@@@ మరిన్ని వార్తలు @@@@@


పెద్దాపురం పట్టణంలో సాయి సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం.


కాకినాడ జిల్లా, పెద్దాపురం, సామాజిక స్పందన

  పెద్దాపురం పట్టణం తాళ్లూరు వారి సత్రంలో సోమవారం సాయి సేవ గ్రూప్ రోటరీ సంస్థ అనుసంధానంతో 9వ సారి మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఆ సంస్థ ప్రధాన కారకులు అద్దేపల్లి రమేష్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రక్తధన శివరంలో 150 మంది సుమారు స్వచ్ఛందంగా విచ్చేసి రక్తం దానం చేయడం జరిగిందని తెలిపారు రక్తదానం ప్రతి ఒక్కరి సేవ బాధ్యతగా తీసుకొని ఒక రక్తదానం చేస్తే మరొక ప్రాణానికి కాపాడినవారవుతారని ప్రతి ఒక్కరి బాధ్యత గా రక్తదానం చేయాలని ప్రాణాల్లో ఉండే ప్రతి ఒక్కరిని కాపాడాలని తెలిపారు సాయి సేవా సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు సంవత్సరంలో దుప్పట్లో పంపిణీ గోసేన ఇతర సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ నిరంతరం కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు సహక శాఖ సైకిల్ అందిస్తున్నారని అలాగే మరి ముందు మా సంస్థ ద్వారా ప్రతి పేదవాళ్ళకి ఉపయోగపడే విధంగానే మా సంస్థ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాకినాడ రోటరీ డాక్టర్ కామరాజు గారు,పెద్దాపురం రోటరీ క్లబ్ డాక్టర్, గొల్లపూడి సునీల్,పాలకురి సోమరాజు,చెక్క రవి,ఆత్తెం రాజేష్,రమేష్, అద్దెపల్లి గోళ్లబాబు,పసుమర్తి కృష్ణ,తాతారావు,సత్యనారాయణ, హనుమంతు వారుజుల చంద్రశేఖర్ శర్మ, సూరి శివ,తరుణ్,రాజా కరెడ్ల,పాబోలు ప్రసాద్, బొడ్డెటి బుజ్జి,నాగేంద్ర,మూర్తి,నానజీ సాయి సేవ బృందం పాల్గొన్నారు.. 

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.