కాకినాడ జిల్లా , పెద్దాపురం, సామాజిక స్పందన :
అల్లం రాజు చారిటబుల్ ట్రస్ట్ (ACT ) వారి ఆర్థిక సహకారంతో, క్రియా స్వచ్ఛంద సంస్థ అసోసియేషన్ తో బుద్దా శ్రీనివాస్ ఆధ్వర్యంలో గత పది నెలలుగా పెద్దాపురం రామారావు పేట లో గల ACT సైన్స్ సెంటర్ నందు ప్రతీ ఆదివారం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యాంశ ప్రయోగాలను ఉచితంగా నేర్పిస్తున్నందున సైన్స్ సెంటర్ ను చూడడానికి నెదర్లాండ్స్ దేశం, ఎంబస్సే నుండి Mr. యోస్ట్ గైర్ Head of Economic సెక్షన్, Ms. ఇమ్మీ స్మిత్స్ , పాలసీ అడ్వైసర్ మరియు Mr. కిరణ్ మధునాపంతుల , Chief Operating Officer, Xebia, హైదరాబాద్ వారు రావడం జరిగిందని, పిల్లలకు ఉచితంగా ప్రయోగాలు నేర్పించడం అనేది స్ఫూర్తిదాయకంగా ఉందని , సైన్స్ ను చేతులతో చేయడం ద్వారా నేర్చుకోవడం వల్ల పిల్లల శాస్త్రీయ ఆలోచనలకు పదును పెట్టినట్లు అవుతుందని యూరప్ ఖండం నుండి విచ్చేసిన విదేశీయుల ఇద్దరూ అభిప్రాయపడినట్లు నిర్వాహకులు శ్రీనివాస్ తెలియజేశారు. ఇదే సందర్భంగా కాకినాడ జిల్లా, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ పిల్లి రమేష్ గారు, ఉప విద్యాశాఖ అధికారి వారు, డీసీఈ బి సెక్రటరీ వారు, కిర్లంపూడి మండల విద్యాశాఖ అధికారులు T.జోసఫ్ గారు మరియు ఎం చిన్నారావు గారు సైన్స్ సెంటర్ ను సందర్శించారు . ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి వారు మాట్లాడుతూ ఈ సైన్స్ సెంటర్ పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని దీనిని అన్ని పాఠశాలల వారు సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్రియ కార్యదర్శి జగన్నాథం, పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ అధ్యక్షులు కూని రెడ్డి అరుణ గారు, రొంగల అరుణ్ కుమార్, పూజిత సూర్యశ్రీ, శివప్రసాద్ పాల్గొన్నారు.
@@@@@@ మరిన్ని వార్తలు చదవండి@@@@@@
జూన్ 25 సంవిధాన్ హత్యా దివస్: కేంద్రం సంచలన నిర్ణయం
న్యూ ఢిల్లీ, సామాజిక స్పందన
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 25ను 'సంవిధాన్ హత్యా దివాస్'గా ప్రకటించింది.
1975 జూన్ 25న ఎమర్జెన్సీ ప్రకటించింది ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ. అయితే ఎమర్జెన్సీ రోజులకు నిరసనగా 'సంవి ధాన్ హత్యా దివాస్'ను తాజాగా ఈరోజు కేంద్రం ప్రకటించింది.
కేంద్ర నిర్ణయాన్ని ఎక్స్‌లో ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. ఎమర్జెన్సీ ను విధించడం ద్వారాప్రజాస్వామ్య ఆత్మను హత్య చేశారని ఆయన ఎక్స్ వేదికగా ఆరోపించారు.
ఎమర్జెన్సీ సమయంలో లక్షల మందిని జైల్లో పెట్టారని, మీడియా గొంతు నొక్కారని ఆయన గుర్తుచేసుకున్నారు.












0 Comments