సామాజిక స్పందన: పెద్దాపురం పట్టణం
సాయి బోధనలు ప్రజలకు చేరవేసేవిధంగా సాయి సేవ గ్రూప్ నిరంతర కృషి చేస్తుందని పెద్దాపురం సాయి సేవా గ్రూప్ సభ్యులు తెలిపారు. సోమవారం పెద్దాపురం పట్టణం ఆర్యవైశ్య సేవా సంఘం భవనం లో సాయి నామస్మరణ,పల్లకిసేవ 12వ వార్షికోత్సవ మహాసభ అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో కన్నుల వైకుంఠం నిర్వహించారు. ఉదయం కాకడ హారతి నుండి మొదలు పెట్టి బాబా వారి పల్లకి సేవలో నగర సంకీర్తన చేసుకుంటూ పెద్దాపురం పట్టణ పురవీధుల్లో బాబావారి నామస్మరణతో ఊరేగింపుగా సాగి ఆర్యవైశ్య సేవా సంఘం భవనంలో సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు అలాగే గోపూజ కార్యక్రమం, షిరిడి సాయి బాబాకి పంచామృతాలతో అభిషేకం భక్తులు చేతులమీదుగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సాయి సేవ గ్రూప్ సభ్యులు అద్దెపల్లి రమేష్ మాట్లాడుతూ ప్రతి గురువారం సాయిబాబా వారి పల్లకీ సేవ సాయి మరియు నామస్మరణ నిర్వహించడం జరుగుతుందని నేటికి పన్నెండు సంవత్సరాలు దిగ్విజయంగా ముగిసి శుభ సందర్భంలో 12 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. గత రెండేళ్లుగా కరోనా వైరస్ కారణంగా ఈ కార్యక్రమాలు నిర్వహించలేదని తిరిగి సాయిబాబా వారి అనుగ్రహముతో పల్లకి సేవ కార్యక్రమం మొదలు పెట్టడం అలాగే ఈ వార్షికోత్సవ వేడుకలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. అనంతరం బాబా వారికి హారతులు భక్తులకు తీర్థప్రసాదాలు వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య మంత్రపుష్పం అందజేశారు.ఈ కార్యక్రమంలో పలుకురి సోమరాజు, గొల్లపూడి సునీల్ కుమార్, సూరంపూడి రాజేష్ ,సూరి శివ, పసుమర్తి వేణుగోపాలకృష్ణ ఆత్తెం రాజేష్,ఆత్తెం రమేష్,కరెడ్ల రాజా,గుమ్మడి వాసు, కోటా నాగేంద్ర , చక్క రవి, కాపగంటి మూర్తి, బాదం మూర్తి బాబు, చంద్రశేఖర శర్మ తాతారావు,గొల్లపూడి శ్రీనివాస్, కళ్ళ వెంకటేష్,అధిక సంఖ్యలో సాయి భక్తులు పాల్గొన్నారు..
@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@@
రాజధానిపై రాష్ట్రానిదే నిర్ణయమని కేంద్రమే చెప్పింది: సీఎం జగన్
సామాజిక స్పందన: అమరావతి:
రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకే ఉందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ఇవాళ వికేంద్రీకరణపై చర్చ సందర్భంగా.. ఆయన ప్రసంగించారు.
పరిపాలన వికేంద్రీకరణపై శాసన వ్యవస్థకు ఎలాంటి అధికారం లేదని హైకోర్టు చెప్పింది. రాజధానిపై కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏదీ లేదని చెప్పింది కోర్టు. కానీ, కేంద్రం ఏమో రాజధానిపై నిర్ణయం తమదే అని ఎక్కడా చెప్పలేదు. పైగా రాష్ట్రానిదే తుది నిర్ణయమని అఫిడవిట్ కూడా ఫైల్ చేసింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ఓ ప్రశ్నకు పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చింది కేంద్రం. పైగా హైకోర్టు ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అనే వాదనను కూడా కేంద్రం కొట్టిపారేసింది.
అయినా నెలరోజుల్లో లక్ష కోట్ల రూపాయలతో రాజధాని కట్టేయాలని కోర్టులు ఎలా డిక్టేట్ చేస్తాయి? అన్ని వ్యవస్థలు వాటి పరిధిలో ఉండాలి. లేకుంటే సిస్టమ్ మొత్తం కుప్పకూలి పోతుంది. రాజధానిపై వాళ్లంతకు వాళ్లే ఊహించుకుని పెట్టుకున్నారన్నారు.












0 Comments