సామాజిక స్పందన: పెద్దాపురం పట్టణం
బాటసారులకు దాహం తీర్చేందుకు చలివేంద్రాలు ప్రతి ఒక్కరూ వీధివీధిన ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. ఆదివారం పెద్దాపురం పట్టణంలో పెద్దాపురం జనసేన పార్టీ పట్టణ యువత ఆధ్వర్యంలో సంత మార్కెట్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని తుమ్మల రామస్వామి బాబు చేతులు మీదుగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండుటెండల్లో బాటసారులకు దాహం తీర్చేందుకు ప్రజలకు ఈ చలివేంద్రంలు దోహదపడుతుందని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని దీనిలో భాగంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో పులిమేరు సామర్లకోట పలు ప్రాంతాల్లో జనసేన పార్టీ యువత సహాయ సహకారాలతో ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.కార్యక్రమంలోఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ సహాయ కార్యదర్శులు చిటికెల నారాయణమూర్తి, కంచు మూర్తి రాజన్న, పిట్ట జానకి రామారావు పెద్దాపురం 20 వార్డు కౌన్సిలర్ ఓబిలి శెట్టి వనిత గణేష్ ,పెంకే వెంకట లక్ష్మి, పొలమరశెట్టి సత్తిబాబు, కటారి శ్రీను సహారా కోటి, ధర్మ ,వంగలపూడి సతీష్ గున్ని, భగవాన్, బర్రె స్వామి మంచం సాయి, అత్తిలి కృష్ణ, చిటికెల త్రివేణి,ఎస్. ఎస్ తదితరులు పాల్గొన్నారు.
############## మరిన్ని వార్తలు##########
- గవర్నర్ తన అధికారాలను ఉపయోగించుకోవాలి:రేవంత్ రెడ్డి
సామాజిక స్పందన: హైదరాబాద్:
కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి తప్పించుకునేందుకు సీఎం కేసీఆర్ గవర్నర్ అంశాన్ని సాకుగా చూపుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.తనను సీఎం చేయాలంటూ కేటీఆర్.. కేసీఆర్‌పై ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. గవర్నర్‌తో సఖ్యత లేనప్పుడు.. అది సాధ్యం కాదని కుటుంబ సభ్యులతో సీఎం చెబుతున్నట్లు రేవంత్ పేర్కొన్నారు. ఈ మేరకు గాంధీ భవన్‌లో మీడియా ప్రతినిధులతో రేవంత్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
''రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు ఉన్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారికంగా నివేదిక ఇచ్చారు. వెంటనే రాజ్యాంగం కల్పించిన అధికారాలను ఆమె ఉపయోగించుకోవాలి. విద్య, వైద్యం, శాంతి భద్రతల సమస్యలపై సమీక్ష చేసి చర్యలు చేపట్టవచ్చు. రాష్ట్రంలోని సమస్యలను గవర్నర్ గుర్తించారు.. ఫిర్యాదు చేశారు. సెక్షన్ 8 ప్రకారం సమస్యను పరిష్కరించే అధికారం గవర్నర్‌కు ఉంది. రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఏ రాష్ట్ర గవర్నర్‌కు లేని అధికారాలు తెలంగాణ గవర్నర్‌కు ఉన్నాయి. ఆమె భాజపా నేతలా మాట్లాడుతున్నారని తెరాస నేతలు విమర్శలు చేస్తున్నారు. గతంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు వాళ్ళు భాజపా అని తెలియదా? గవర్నర్ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు నిర్వహించారు. కేవలం సీఎం కేసీఆర్‌కు కోపం వస్తుందనే హైదరాబాద్‌లో ఉండి కూడా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వేడుకలకు హాజరు కాలేదని ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఫిర్యాదు చేయాల్సింది. అప్పుడే ఇక్కడి కుమ్మక్కు రాజకీయాలు బహిర్గతం అయ్యేవి'' అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు...











0 Comments