సామాజిక స్పందన: కాకినాడ జిల్లా
వినియోగదారుల సంఘాలు తరచుగా సమావేశాలు నిర్వహించి రాజ్యాంగం కల్పించిన రక్షణచట్టాల పట్ల యువతరానికి సమగ్ర అవగాహన కల్పించాలని మానవ హక్కుల కమీషన్ చైర్మన్ మాంధాత సీతారామ మూర్తి పేర్కొన్నారు. శనివారం ఉదయం రామారావు పేటలోని చైర్మన్ స్వగృహంలో కలిసిన రాష్ట్ర వినియోగదారుల సమాఖ్య కార్యదర్శి హెచ్ ఎస్ రామకృష్ణ పుష్పగుచ్చం అందజేసి కేంద్రం సవరించిన 2019 వినియోగదారుల రక్షణ చట్టంప్రయోజనా ల నూతన పుస్తక ప్రతులను మాంధాత చేతుల మీదుగా ఆవిష్కరించారు. వినియోగదారుల రక్షణ చట్టం ప్రతులను ఆవిష్కరించిన మానవ హక్కుల కమీషన్ చైర్మన్ మాంధాత సీతారామ మూర్తి.
తూర్పు గోదావరి,కోనసీమ కాకినాడ జిల్లాలకు చెందిన 60 మండల కేంద్రాలలో ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణ రాజు ఆధ్వర్యాన చైతన్య ర్యాలీ ప్రచార జాతా నిర్వహించి కన్స్యూమర్స్ ఫెడరేషన్ నూతన కార్యవర్గ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని రామకృష్ణ తెలిపారు. సంఘం చేపట్టిన చైతన్య సమావేశాల పట్ల చైర్మన్ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమం లో స్మార్ట్ సిటీ కన్స్యూ మర్స్ ఫెడరేషన్ కార్యదర్శి కొమ్మూరి శ్రీనివాసరావు, కోన సీమ జిల్లా వినియోగ దారుల చైర్మన్ అరిగెల బలరామ్మూర్తి, కార్యద ర్శి ఆదిత్య కిరణ్, షేక్ సందాని పాల్గొన్నారు.
@@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@
పీకే కొత్త ప్రయాణం త్వరలో రాజకీయ పార్టీ?
సామాజిక స్పందన: దిల్లీ:
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ (Prashant Kishor) కిశోర్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సోమవారం ట్విటర్ వేదికగా తన భవిష్యత్ ప్రణాళికకు సంబంధించి కీలక ప్రకటన చేశారు.ప్రజల కోసం నేరుగా పనిచేయాల్సిన సమయం వచ్చిందంటూ పేర్కొన్నారు. దీంతో పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు పీకే త్వరలోనే సొంతంగా రాజకీయ పార్టీ పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
''ప్రజల పక్షాన విధివిధానాలను రూపొందించేందుకు, అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేసేందుకు 10 ఏళ్లుగా ఒడుదొడుకుల ప్రయాణం చేశాను. ఇప్పుడు ఈ ప్రయాణంలో కొత్త పేజీ తిప్పుతున్నాను. నిజమైన మాస్టర్లయిన ప్రజల సమస్యలను మరింత అర్థం చేసుకునేలా వారి వద్దకు నేరుగా వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఆ మార్గమే 'జన్ సురాజ్ - ప్రజా సుపరిపాలన'. ఈ ప్రయాణాన్ని బిహార్ నుంచి ఆరంభిస్తాను'' అని పీకే ట్వీట్ చేశారు.
దీంతో ఈ ట్వీట్ కాస్తా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో పీకే కొత్త పార్టీ ప్రారంభించే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'జన్ సురాజ్' అని ఆయన పార్టీ పేరునే ప్రకటించి ఉంటారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పీకే బిహార్‌లో పోటీకి దిగే అవకాశాలున్నాయి.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇక వ్యూహకర్తగా పనిచేయబోనంటూ పీకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలకు దూరంగా మాత్రం ఉండబోనంటూ సస్పెన్స్ క్రియేట్ చేశారు. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి చేరనున్నట్లు వార్తలు వినిపించాయి. అందుకు తగ్గట్లుగానే ఇటీవల కాంగ్రెస్ తమ పార్టీలో చేరాలంటూ పీకేను ఆహ్వానించింది. అయితే దీన్ని ఆయన తిరస్కరించారు. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు హైకమాండ్ నిరాకరించడంతోనే పీకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా.. గతంలో పీకే రాజకీయ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూలో చేరి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్ష బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే 16 నెలలకే పీకే - నీతీశ్ బంధం ముగిసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయనను జేడీయూ నుంచి బహిష్కరించారు...
@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@
బురద రాజకీయాలు చేయటం జనసేనకు చేతకాదు: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
సామాజిక స్పందన: అమరావతి
సాగు నష్టాలు, రుణ భారంతో రైతులు మానసికంగా కుంగిపోతున్నారని.. వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు.ఇందుకు రైతుల ఆత్మహత్యలే నిదర్శనమనన్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేశారు. నష్టాలు, అప్పుల బాధతో ప్రకాశం, కర్నూలు జిల్లాలో రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి దిగ్భ్రాంతికి లోనైనట్లు చెప్పారు. బలవన్మరణానికి ఒడిగట్టాల్సిన పరిస్థితులు రైతుల ముందు ఉన్నాయంటే..
వ్యవసాయ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం లేదనే విషయం అర్థమవుతోందన్నారు. బాధ్యతగల పార్టీగా జనసేన.. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న వారి గురించి మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వరం మాత్రం దీన్ని రాజకీయ కోణంలోనే చూస్తోందని అసహనం వ్యక్తం చేశారు. రైతులకు అండగా నిలవడం ఒక బాధ్యతగా తీసుకున్నామని.. జనసేనకు బురద రాజకీయాలు చేయడం చేతకాదన్నారు. ఆత్మహత్యలపై రాజకీయాలు చేయడం మానేసి అన్నదాతలకు ఎలా సాయం చేయాలో బాధ్యతగల పదవుల్లో ఉన్నవారు ఆలోచించాలని పవన్ సూచించారు.












0 Comments