ఆకట్టుకున్న కళారూపాలు, నవతరం కమ్యూనిస్టులదే అంటున్న సిపిఎం నాయకులు

 


సామాజిక స్పందన: కాకినాడ జిల్లా, పెద్దాపురం

స్థానిక వరహాలయ్యపేట సెంటర్లో నిర్వహించిన యాసలపు సూర్యా రావు వర్ధంతి సభలో ప్రజానాట్యమండలి పెద్దాపురం మండల కళాకారులు ప్రదర్శించిన అన్ని కళారూపాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేదికపై రావయ్యా రైతన్న, సుందరయ్య జీవిత చరితం, ఆశిఫా, కుర్రాళ్ళు కుర్రాళ్ళు, ఉరిమే ఉత్సాహం, కాలం తదితర కళారూపాలను కళాకారులందరూ స్ఫూర్తిదాయకంగా ప్రదర్శించారు. 


ఈ సభలో కళాకారుల బృందం చైతన్యవంతమైన గీతాలను ఆలపించారు. వీటిని తిలకించిన ప్రజలు కళాకారులను అభినందించారు. ఈ కళారూపాల ప్రదర్శనలో కళాకారులు కేదారినాగు, దారపురెడ్డి సత్యనారాయణ, మంతెన సత్తిబాబు, రొంగల వీర్రాజు, డి కృష్ణ, మహాపాతిన రాంబాబు, అమృత, నమ్రత, బంగార్రాజు, రవికుమార్, నిహారిక, సాహితీ, రొంగల రవి, అరుణ్, సుబ్రహ్మణ్యం, వీరబాబు, పూజిత, గౌస్, అఖిల, మీరాభి, నియాజ్, నిషాద్, మనోజు తదితరులు పాల్గొన్నారు.


@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@

  


సామాజిక స్పందన: కాకినాడ జిల్లా, పెద్దాపురం
రాబోవు నవతరం కమ్యూనిస్టులదేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. పెద్దాపురం పట్టణంలో కామ్రేడ్ యాసలపు సూర్యరావు పదవ వర్ధంతి సందర్భంగా జరిగిన సభకు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా కమ్యూనిస్టు నేత బొమ్మన బసవరాజు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సభవద్ద సూర్యారావు చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సూర్యారావు బహుముఖ ప్రజ్ఞాశాలని కొనియాడారు. నిరంతరం ప్రజల సేవకు తపించిన త్యాగమూర్తి అని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధిగా పనిచేసినా ఏ విధమైన మచ్చ లేకుండా ఎర్రజెండాను సమున్నతంగా నిలబెట్టారని తెలిపారు. పెద్దాపురం పట్టణంలో ప్రజలు కమ్యూనిస్టులను ఆదరిస్తున్న తీరు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇక్కడి కళారంగం, కళాకారులను చూస్తూ ఉంటే నవతరం కమ్యూనిస్టులదేననే విశ్వాసం కలుగుతోందన్నారు. మోడీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు గడిచిందని, ఈ కాలంలో దేశ ప్రజలకు ఒక్క మంచి పని అయినా చేశారా అని ప్రశ్నించారు. నిరంతరం స్వదేశీ, విదేశీ కార్పొరేట్ కంపెనీల సేవలో ఉంటున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాలకులకు సామాన్యుల గోడు పట్టడం లేదన్నారు. అందుకోసమే సిపిఎం పార్టీ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతుందన్నారు. దేశభక్తి గురించి ప్రగల్బాలు పలికే ఈ పాలకులు అగ్నిపథ్ వంటి పథకాలతో దేశానికి తీరని ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలే ఈ పాలకులకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. విగ్రహాల పేరుతో చరిత్రను పక్కదోవ పట్టించే పనులు మానుకోవాలని హెచ్చరించారు. చరిత్రను వెలికి తీయడం కాదని, చరిత్రను నేర్చుకోవాలని హితవు పలికారు.
భారత సమాజాన్ని వెనక్కి నడిపించాలని బిజెపి ప్రయత్నిస్తుందని, ఈ దేశం ముందుకుపోవాలని కమ్యూనిస్టులు కృషి చేస్తున్నారని, ఏది సరైనదో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. కాషాయం గురించి చెబుతున్న ఈ పాలకులు మనదేశంలో తిలకం, మహిళల పారాణి ఏ రంగులో ఉందో గుర్తించాలన్నారు. ఈ దేశానికి ఎర్రజెండా వెలుగుదారి చూపిస్తుందని పేర్కొన్నారు. కేరళలో స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తూ అక్కడి ప్రభుత్వం ధాన్యానికి రూ.2,800 ఇవ్వడంతోపాటు, కార్మికులకు కనీస వేతనాలను అమలు చేస్తున్నారన్నారు. వలస కార్మికులను ఆదుకున్నారని వివరించారు. మన రాష్ట్రంలో రాజన్న రాజ్యం ఇస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ఆచరణలో మోడీ రాజ్యం తీసుకువచ్చారని అని ఎద్దేవా చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, విద్యుత్ చార్జీలు, చెత్త పన్ను, ఆస్తి పన్ను వంటి అనేక భారాలు భారీ ఎత్తున ప్రజలపై మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆదాయాలు ఆ స్థాయిలో పెరగడం లేదన్నారు. ప్రారంభంలో సంక్షేమ పథకాలు, నవరత్నాలు గురించి చెప్పి ఇప్పుడు ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకుంటున్నారని జగన్ పాలనను ఆయన దుయ్యబట్టారు.


విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన బిజెపిపై జగన్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత జగన్ కు లేదా అని ప్రశ్నించారు. అధికార ప్రతిపక్షాలతో సహా జనసేనలు కాకుండా కమ్యూనిస్టు పార్టీ మాత్రమే బీజేపీ విధానాలపై ఎదురొడ్డి పోరాడుతుందన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు మోడీకి వ్యతిరేకంగా జగన్ ఓటు వేస్తారా అని ప్రశ్నించారు. వామపక్షాల పోరాటాలపైన నిర్బంధాలు విధించడం సరికాదన్నారు. అరెస్టులు, బెదిరింపులతో ఉద్యమాలను ఆపలేరని స్పష్టం చేశారు. కమ్యూనిస్టులను చూసి జగన్తో సహా అధికారులు భయపడుతున్నారని, అందుకే ఎక్కడ ధర్నాలు జరిగినా ముందస్తుగా సిపిఎం నాయకులను, ప్రజాసంఘాల నేతలను అరెస్టు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య హక్కులను హరిస్తే చూస్తూ ఊరుకోబోమని భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై పోరాడాలన్నారు. ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా అధికారపక్షాన్ని విమర్శించడం తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా అనకపోవడం శోచనీయమన్నారు.
జనసేన ఇప్పటికే మోడీ మార్గంలో ఉన్నట్లు ప్రకటించిందన్నారు. ఈ నేపథ్యంలో జనం కోసం సిపిఎం పేరుతో ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజలంతా ఐక్యంగా పోరాడడానికి సిపిఎం పిలుపునిస్తోందన్నారు. ప్రజలంతా ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. ప్రజలకు సిపిఎం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. సిపిఎంను ఆదరిస్తున్న పెద్దాపురం పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు శేషబాబ్జి, సిఐటియు ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, పెద్దాపురం, సామర్లకోట పట్టణ కార్యదర్శులు నీలపాల సూరిబాబు, కరణం ప్రసాదరావు, శాఖ కార్యదర్శులు కేదారి నాగు, సిరిపురపు శ్రీనివాస్, డి.క్రాంతి కుమార్ తదితరులు మాట్లాడారు.


@@@@@@@ ప్రచురించిన వార్తలు @@@@@@@



కష్టజీవికి ఇరువైపులా నిలబడిన కవి శ్రీశ్రీ

సామాజిక స్పందన: పెద్దాపురం

కష్టజీవులకు పడుతున్న భాదలను, ఇబ్బందులను తెలుపుతూ తెలుపుతూ, వారు చేయ్యాల్సిన పోరాటానికి పురిగొల్పుతూ మహాప్రస్ధానాన్ని అందించి కష్టజీవులను ఇరువైపుల నిలిచిన కవి శ్రీశ్రీ అని సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు జోస్యుల కృష్ణబాబు అన్నారు. పెద్దాపురం పట్టణం యాసలపు సూర్యారావు భవన్ లో ప్రజానాట్యమండలి ఆద్వర్యంలో శ్రీశ్రీ జయంతి సభ రొంగల వీర్రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 1930 వరకూ తెలుగు కవిత్వం నన్ను నడిపిస్తే, ఆ తరువాత కవిత్వాన్ని నేను నడిపిస్తానని ప్రకటించారని అన్నారు. మానవుడే నా సమాజం, మానవుడే సందేశమంటూ ప్రకటించి శ్రంకు విలువకట్టించడం కోసం తన కవితలను అస్త్రాలుగా సందించారని అన్నారు. మహాప్రస్ధానంలో అనేక కవితలను పదునైన బాణాలతో ప్రజలకు అందించారన్నారు. ఒక్కొ కవితా మానవ ఒక విస్వరూపాన్ని మన కళముందు కదలాడుతుందని అన్నారు. ప్రతి అంశంపైనా ఎంతో స్పష్టత ఉన్న మనిషి కొనియాడారు. తెలుగు కవిత్వంలో శ్రీశ్రీ ఒక చెరిగిపోని సంతకం అన్నారు. ఈ కార్యక్రమంలో చారిత్రక పరిశోదకులు వంగలపూడి శివకృష్ణ, ప్రజానాట్యమండలి నాయకులు డి సత్యనారాయణ, డి.కృష్ణ, ఎమ్.రాంబాబు, గౌస్, ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ నాయకులు చింతల సత్యనారాయణ, శ్రీనివాస్ లు పాల్గోన్నారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.