రోడ్లు, తాగునీటి సరఫరాపై సీఎం జగన్ సమీక్ష



సామాజిక స్పందన: తాడేపల్లి

మన రాష్ట్రంలో గ్రామీణ రోడ్లను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.

పంచాయతీరాజ్ శాఖ పరిధిలో జరిగిన సమీక్షలో సీఎం కీలకంగా రోడ్లు, తాగునీటి సరఫరాపై చర్చించారు. అవసరమైన రోడ్ల మరమ్మతులతో పాటు కొత్త రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఆయన ఆదేశించారు. చేపట్టే పనులన్నింటిలో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సీఎం సూచించారు. ఇప్పటికే చాలా రోడ్లను నిర్మించామని, మిగిలిన వాటిని కూడా పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారుఈ నేపథ్యంలో చేపట్టాల్సిన రోడ్లకు వెంటనే శాఖాపరమైన అనుమతులకు సీఎం ఆదేశించారు. టెండర్లు పూర్తి చేసి జూన్ నెలాఖరు లోపు పనులు పూర్తి చేయాలన్నారు. మరో వైపు వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి లేకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని సీఎం అధికారులను ప్రశ్నించారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలుపగా నిధులకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, తాగునీటి సరఫరా పనులకు కీలక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. వీటితో పాటు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నాబార్డ్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాల సహకారం కూడా తీసుకోవాలని ఆయన సూచించారు.

@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@


రేపల్లెలో ఘోరం..రైల్వే ప్లాట్ ఫారంపై భర్త కళ్లెదుటే మహిళపై గ్యాంగ్ రేప్

సామాజిక స్పందన: బాపట్ల

ఆంధ్ర ప్రదేశ్ లో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. ఇటీవల విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం, తుమ్మపూడిలో వివాహిత దారుణ హత్య, శృంగారపురంలో వలస కూలీపై యువకుల అత్యాచారయత్నం ఇలా వరుసగా అఘాయిత్యాలు వెలుగుచూస్తున్నాయి.ఇక ఇటీవల గురజాల రైల్వే స్టేషన్లో వివాహితపై అత్యాచారం ఘటన మరువకముందే తాజాగా బాపట్ల జిల్లాలో అలాంటి దారుణమే చోటుచేసుకుంది.ప్రకాశం జిల్లా నుండి ఎర్రగొండపాలెం వెంకటాద్రిపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబం పనుల కోసం బాపట్ల జిల్లా రేపల్లెకు వెళ్లారు. శనివారం రాత్రి ముగ్గురు పిల్లలతో కలిసి భార్యాభర్తలు రేపల్లె రైల్వేస్టేషన్ లో వుండగా కొందరు దుండగులు వీరిని గమనించారు. ప్లాట్ పారం ఎవ్వరూ లేకుండా నిర్మానుష్యంగా వుండటం... రైల్వే అధికారులు కూడా లేకపోవడంతో దుర్మార్గలు రెచ్చిపోయారు. భర్తను చితకబాదిన ముగ్గరు దుర్మార్గులు రైల్వే స్టేషన్ లోనే వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

తన కళ్లెదుటే భార్యపై అఘాయిత్యం జరుపుతుంటే ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో భర్త వుండిపోయాడు. రైల్వే స్టేషన్ లోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి తలుపుతట్టినప్పటికి ఎవ్వరూ స్పందించలేరని బాధిత మహిళ భర్త తెలిపారు. దీంతో భార్యాపిల్లలను రైల్వే స్టేషన్లోనే వదిలి దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు పరుగున వెళ్ళి ఫిర్యాదు చేసినట్లు... పోలీసులతో కలిసి రైల్వే స్టేషన్ కు చేరుకోగా అప్పటికే అఘాయిత్యం జరిపి దుండగులు పరారయ్యారని బాధితుడు తెలిపాడు.

వెంటనే పోలీసులు బాధిత మహిళను వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం ఆమె భర్త నుండి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వివరాల ఆధారంగా నిందితులకు గుర్తించేపనిలో పడ్డారు.ఇదిలావుంటే పల్నాడు జిల్లా గురుజాల రైల్వేస్టేషన్లో ఇలాగే వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. మూడేళ్ల కొడుకుతో ఒంటరిగా వున్న ఒడిషా మహిళపై గుర్తుతెలియని దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అతి దారుణంగా లైంగికదాడికి పాల్పడటంతో అపస్మారక స్థితిలో పడివున్న మహిళను గుర్తించిన కొందరు హాస్పిటల్ కు తరలించారు.ఇక గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని శృంగారపురం గ్రామానికి ఇతర ప్రాంతాల నుండి కూలీపనుల కోసం వచ్చిన ఓ మహిళ ఆలయంలో నిద్రిస్తుండగా కొందరు యువకులు అఘాయిత్యానికి యత్నించారు. నిద్రిస్తున్న మహిళను దగ్గర్లోని తోటలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ప్రయత్నించగా ఆమె గట్టిగా అరిచింది. దీంతో భయపడిపోయిన యువకులు పరారయ్యారు. యువతి కుటుంబసభ్యుల పిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకులను అరెస్ట్ చేసారు.

ఇక తుమ్మపూడిలో వివాహిత హత్య సంచలనం సృష్టించింది. మహిళపై అత్యాచారం జరిపి హత్య చేసినట్లు ప్రచారం జరగ్గా గుంటూరు ఎస్పీ సంచలన విషయాలు బయటపెట్టాడు. మహిళపై అత్యాచారం జరగలేదని... ఇది వివాహేతర సంబంధం కారణంగా జరిగిన హత్యగా గుంటూరు అర్భన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.