సేవే మా మార్గం సేవే మా లక్ష్యం:పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘం


సామాజిక స్పందన: అన్నమయ్య జిల్లా

  వత్తలూరు ఈడీగపల్లె గ్రామానికి చెందిన రఘువరన్ పుట్టినరోజు సందర్భంగా నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులను సంఘం ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.పుట్టినరోజు అని పార్టీలకు డబ్బులు వృధా చేస్తున్న నేటి యువత సామాజిక దృక్పథంతో ఆలోచించి పుట్టినరోజు సందర్భంగా రఘువరన్ నిరుపేదలకు సహాయం చేయడం యువతకు స్పూర్తి దాయకం అని సంఘం అధ్యక్షుడు సుబ్బనరసా రెడ్డి ఈ సందర్భంగా తెలియచేసారు. ఈ పంపిణీ కార్యక్రమంలో రంగంపల్లి పంచాయతీ సెక్రెటరీ వేయయ్య,అప్పయ్యరాజుపేట పంచాయతీ వెల్ఫేర్ అసిస్టెంట్ రంగనాథయ్య, సంఘ ఉపాధ్యక్షుడు వాహిద్, సంఘం కోశాధికారి నరసింహులు, ఉపాధ్యక్షుడు వాహిద్ ,సభ్యుడు జ్యోతీశ్వర్,రెడ్డయ్య రెడ్డి ,వాలంటీర్ మురళి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



@@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@


వృద్ధ దంపతులకు నిత్యవసర సరుకుల అందజేత: అధ్యక్షుడు మల్లు సుబ్బనరసారెడ్డి 


సామాజిక స్పందన : అన్నమయ్య జిల్లా

 పుల్లంపేట మండలం మల్లెంవారిపల్లె గ్రామానికి చెందిన పొట్టపేగుల వెంకటయ్య వృద్ధ దంపతులకు సంఘ సభ్యుడు జ్యోతీశ్వర్ నాయుడు సహకారముతో సంఘ అధ్యక్షుడు సుబ్బనరసారెడ్డి చేతులమీదుగా నిత్యవసర సరుకులు అందించడం జరిగింది. అధ్యక్షుడు మల్లు సుబ్బనరసారెడ్డి మాట్లాడుతూ ఎటువంటి పని చేసుకోలేని స్థితిలో ఉన్న వృద్ధులకు నిత్యవసర సరుకులను అందించడం చాలా ఆనందకరంగా ఉందని తెలియచేయడం జరిగింది. ప్రతి ఒక్కరు సేవా దృక్పథంతో మెలగాలని తెలియజేశారు. ఈకార్యక్రమము నందు సంఘ కోశాధికారి నరసింహులు, సంఘ సభ్యుడు రెడ్డయ్య రెడ్డి ,సంఘ వాలంటీర్ మురళి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@


సుప్రీంకోర్టు నిర్ణయం సంచలనాత్మకం, ఎంపీ రఘురామ కృష్ణ రాజు

సామాజిక స్పందన: న్యూఢిల్లీ

దేశంలో ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ రాజకీయ, వ్యక్తిగత స్వార్థం వల్ల బ్రిటిష్ హయంలో అమలులో ఉన్న 124 A నల్ల చట్టం అమలు చేస్తూ వచ్చారని, ఎట్టకేలకు ఈ చట్టం అమలుపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం పట్ల నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు హర్షం వ్యక్తం చేశారు. ఇదొక సంచలనాత్మక నిర్ణయమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ గారితో పాటు ఇతర న్యాయమూర్తులకు ఈ చట్టం ద్వారా బాధింపబడిన బాధితుల పక్షాన తాను పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర అనంతరం సొంతంగా రాజ్యాంగం రాసుకున్నామని, రాజ్యాంగం ద్వారా పౌరులకు ఎన్నో ప్రాథమిక హక్కులను కల్పించడం జరిగిందన్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ వంటి హక్కులను కల్పించినప్పటికీ, ఇంకా బ్రిటిష్ కాలము నాటి 124 A నల్ల చట్టాన్ని కొనసాగించడం వల్ల ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపై రాజ ద్రోహం కింద కేసులు పెట్టి వేధించడం పరిపాటిగా మారిందన్నారు.

బుధవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... బ్రిటిష్ కాలంలో మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్ వంటి వారిపై చట్టంలోని 124 A ఆధారంగా మోపిన రాజద్రోహం కేసును కక్ష్య సాధించేందుకు సింహంగా పిలవబడే జగన్ మోహన్ రెడ్డి గారు, ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ను అడ్డంగా పెట్టుకుని గత ఏడాది మే 14న తనపై కూడా ఈ కేసు మోపిన విషయం గుర్తు చేశారు. రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసి చంపి వేయాలని చూశారన్నారు. అయినా తాను ప్రాణాలతో బతికి బయటపడ్డానని చెప్పు కొచ్చారు. 124 A చట్టం అమలుపై సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు ఇవ్వడం చూసి ఈ కేసులో దెబ్బలు తిన్నప్పటికీ, ఈరోజు ఆనంద పడుతున్నానని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తనపై రాజ ద్రోహం కేసు మోపిన తరువాత ఈ విషయాన్ని తాను అన్ని రాష్ట్రాల గవర్నర్లకు, లోక్ సభ, రాజ్య సభ, శాసన సభ, శాసన మండలి సభ్యుల దృష్టికి తీసుకువచ్చేందుకు లేఖలు రాశానని పేర్కొన్నారు. తనపై 124 A చట్టం కింద రాజకీయంగా తనపై కక్ష సాధించేందుకు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేసు నమోదు చేయగానే, ఈ చట్టాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ గారికి, తన సహచర లోక్ సభ సభ్యులు మోగువా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని రఘురామకృష్ణ రాజు గారు వెల్లడించారు. 124 A చట్టం రద్దులో తాను కూడా కీలకపాత్ర పోషించినందుకు ఆనందంగా ఉందన్నారు. లేకపోతే ఈ నల్ల చట్టంపై మరో నాలుగేళ్ళకో, లేదంటే పదేళ్లకో చర్చ జరిగి ఉండేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేయడం ఖాయమన్న ఆయన, పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు తాను కూడా మాట్లాడతానని చెప్పుకొచ్చారు.

నారాయణ పై 409 కింద కేసు పెట్టడం ఏమిటీ?... బుద్ధుందా?? మాజీ మంత్రి నారాయణ గారిపై 409 కింద కేసు పెట్టడమేమిటని? ఈ కేసు పెట్టిన వ్యక్తికి ఏమైనా బుద్ధి ఉందా అని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. చట్టంలోని ఐపిసి 409 సెక్షన్ కింద  కేసు పెడితే పదేళ్ల జైలు శిక్ష ఆన్న ఆయన ఈ విషయాన్ని ఇంకా చెప్పుకోవడమా అంటూ ఎద్దేవా చేశారు. పనికిరాని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, న్యాయమూర్తిపై ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ ఆమె బెయిల్ మంజూరు చేయడమే కాక, పూచికత్తు దాఖలుకు వారం రోజులు వ్యవధిని కేటాయించటం పట్ల రఘురామకృష్ణ రాజు గారు తన కంటే వయస్సులో చిన్న వారైనా జడ్జి గారికి శుభాభినందనలు తెలియజేశారు. తెల్లవారు వరకు పని చేసి న్యాయ పరిరక్షణ కృషి చేసిన న్యాయమూర్తికి ధన్యవాదాలు తెలిపారు . ఈ మధ్య  ఒకే రోజు రెండు కేసులు నమోదు చేసే విధానానికి తమ పార్టీ వారు తెర లేపారన్నరు. మంగళగిరిలో కాగితం కలంతో ఎల్లప్పుడు సిద్ధంగా ఉండే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు చేయగానే, కేసులు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉండే సునీల్ కుమార్, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గార్లు తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. నారాయణ గారి కేసులో ఎఫ్ఐఆర్ ను కూడా రహస్యంగా ఉంచాలని చూశారన్నారు.  ఎఫ్ ఐ ఆర్ ను కూడా న్యాయస్థానం కొట్టివేయడం ఖాయం అన్నారు. ఎఫ్ఐఆర్ కొట్టివేసిన తర్వాత అయినా పరిపాలనపై దృష్టి పెట్టాలని సూచించారు..

రెడ్డి తొలగింపు ఎందుకు?

పదవతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఐదు మందికి తొలుత మెసేజ్ వెళ్తే, ఆరోవ వ్యక్తి గిరిధర్ రెడ్డి కి వెళ్లిందని అన్నారు. దానికి ఆయన పేరు చివరన ఉన్న రెడ్డిని తొలగించి గిరిధర్ అంటూ సంబోధించారని పేర్కొన్నారు. సురేష్ విషయంలో అలాగే జరిగిందని, ఒంగోలులో వాహనాన్ని నిలిపి తీసుకు వెళ్ళిన అధికారి తిరుపాల్ విషయంలోనూ అలాగే వ్యవహరించారని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. దేశం కోసం రెడ్లు ఎన్నో త్యాగాలు చేశారని, రెడ్డి పేరు పెట్టుకోవడం తప్పేమీ కాదన్నారు. అన్ని కులాల్లోని కొంతమంది ప్రబుద్ధులు ఉంటారని విమర్శించారు. ఇటీవల రాజేంద్రనాథ్ రెడ్డి గారు రాజేంద్రనాథ్ అయ్యారని, అలాగే జగన్ మోహన్ రెడ్డి గారు కూడా జగన్ మోహన్ అవుతారేమోనని ఎద్దేవా చేశారు.  

గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించా !

రిషికొండను ద్వంసం చేసి పర్యాటక బ్లాక్ ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తాను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్ జీ టి)నీ ఆశ్రయించినట్లు రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. 2006లో రిషికొండను ధ్వంసం చేయకుండా 20 వేల చదరపు గజాలలో కాటేజీలను నిర్మించారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు రిషికొండను ధ్వంసం చేస్తూ రెండు లక్షల చదరపు గజాలలో బ్లాకుల వారీగా కాటేజీలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ప్రకృతి అందాలను ధ్వంసం చేయకుండా ఉండడానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారన్న ఆయన, ఈ కమిటీ ఇచ్చే నివేదికను కూడా కొన్ని దుష్ట శక్తులు తారుమారు చేసే అవకాశం లేకపోలేదని అన్నారు. విశాఖను ప్రేమించే ప్రతి ఒక్కరు కేంద్ర పొల్యూషన్ బోర్డ్ కు ఇచ్చి, రిషికొండ ధ్వంసం అడ్డుకోవాలని కోరారు. 

ప్రజల ప్రశ్నకు సమాధానం చెప్పాలి !

గడపగడపకు వై.యస్.ఆర్ కార్యక్రమాన్ని గడపగడపకు మన ప్రభుత్వంగా మార్చిన ప్రభుత్వ పెద్దలు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని రఘురామకృష్ణ రాజు గారు డిమాండ్ చేశారు. చెత్త పన్ను, పెరిగిన విద్యుత్ చార్జీలు, నిలిచిపోయిన పెన్షన్ లపై తన ఇంటి ముందుకు వచ్చే అధికారులను ప్రజలు నిలదీసే అవకాశం ఉందన్నారు.  ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ప్రజలకు ఉందని దానికి రికార్డులు ఖచ్చితంగా సమాధానం చెప్పాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు గత ఆరు నెలలుగా జీతాలు లేవని, ఇదే పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదన్నారు. కొవ్వూరు లంక గ్రామంలో చెట్లను నరికి 10 కోట్లకు అమ్మకానికి స్థానిక ఎంపిపి నారాయణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిసిందని, ఈ విషయమై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.



Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.