పంచాయితీ నిధుల కొరత పై గవర్నర్ కు పిర్యాదు చేసిన ఆం.ప్ర. సర్పంచుల సంఘాలు

సామాజిక స్పందన: విజయవాడ

గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారిని ఈరోజు ఉదయం కలిసి గ్రామ పంచాయతీల నిధులు రూ,,7660 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దొంగలించిన దుశ్చర్య పై ఫిర్యాదు చేసిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ! ఆం.ప్ర. సర్పంచుల సంఘాలు - వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్.

 👉🏻 రాష్ట్రంలోని 12918 గ్రామ పంచాయతీల సర్పంచులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది.

 👉🏻 2018 నుంచి 2022 వరకు 14, 15 వ ఆర్థిక సంఘాల నిధులను కేంద్ర ప్రభుత్వం రూ,, 7660 కోట్లను రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు పంపించింది.

👉🏻 సర్పంచులకు తెలియజేయకుండా, చెక్కుల పై సర్పంచుల సంతకాలు తీసుకోకుండా, పంచాయతీ బోర్డు తీర్మానాలు లేకుండా అక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ రూ,, 7660 కోట్ల ను దారి మళ్లించి, తన స్వంత అవసరాలకు, స్వంత పథకాలకు వాడేసుకుంది.

 👉🏻 రాత్రికి రాత్రే అడ్డగోలుగా నిధులు దారి మళ్లించడంతో పంచాయితీ ఖాతాలు జీరో /నిల్ బ్యాలెన్స్ చూపిస్తున్నాయి. దీంతో సర్పంచులు ఖంగుతిన్నారు.

 👉🏻 రాష్ట్రంలోని 12918 గ్రామ సర్పంచులు గ్రామాల అభివృద్ధికి నిధులు లేవని గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వెల్లడి చేస్తున్నారు.

👉🏻 ఇటీవల దీనిపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలకతీతంగా అన్ని పార్టీల సర్పంచులు, మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆం.ప్ర. సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు.

 👉🏻 దీనివలన గ్రామాలలో త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, శానిటేషన్, లైటింగ్ మొ,, లగు సౌకర్యాలను తమ గ్రామాల ప్రజలకు కల్పించడానికి నిధులు లేక సర్పంచులు ఉత్సవ విగ్రహాలు లాగా మిగిలిపోయారు.

👉🏻 రాష్ట్ర ప్రభుత్వం తాను ఇవ్వవలసిన నిధులను ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను హైజాక్ చేయడం దుర్మార్గం.

 👉🏻 ఇది రాజ్యాంగ వ్యతిరేకం, చట్టవిరుద్ధం, ఇది అనైతికం, అన్యాయం, దుర్మార్గం ఒకరకంగా రాష్ట్ర ప్రభుత్వం సైబర్ నేరానికి పాల్పడింది.

 👉🏻 ఇది 73,74 వ రాజ్యాంగ సవరణ చట్టాల స్ఫూర్తికి విఘాతం కలిగించి, మహాత్మా గాంధీ కలలుగన్న "గ్రామ స్వరాజ్యం" కు విఘాతం కలిగిస్తోంది. అని గవర్నర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం పైన ఫిర్యాదు చేసినాము. 

 👉🏻 ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం దొంగలించిన మా గ్రామ పంచాయతీల నిధులు రూ,, 7660 కోట్లను రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగ అధిపతిగా జోక్యం చేసుకొని, మా సర్పంచు లకు తిరిగి ఇప్పించ వలసిందిగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా కోరుతూ గవర్నర్ గారికి ఫిర్యాదు కాపీని సమర్పించినాము.

 ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వాన ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి (కర్నూలు జిల్లా), సర్పంచుల సంఘం నాయకులు అన్నెపు రామకృష్ణ (శ్రీకాకుళం జిల్లా), వానపల్లి ముత్యాల రావు (విశాఖ జిల్లా), మూడే శివ శంకర్ యాదవ్ (కృష్ణా జిల్లా) మొ,, సర్పంచుల సంఘం నాయకులు గవర్నర్ గారిని కలిసిన వారిలో ఉన్నారు.

@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@


పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ల ఖరారుపై కేంద్ర జల్‌శక్తి శాఖ సమావేశం


 సామాజిక స్పందన:న్యూఢిల్లీ

పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ల ఖరారుపై మంగళవారం మధ్యాహ్నం.3 గంటలకు జల్‌శక్తి శాఖలో సమావేశం నిర్వహించారు. కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. నిధుల మంజూరుపై రేపు ఆ శాఖ కార్యదర్శి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసారు. గోదావరి వరద ఉధృతికి పోలవరం ప్రధాన డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చటం, కొంత భాగం దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ను పటిష్ఠం చేయడంపై చర్చించేందుకు సమావేశాన్ని నిర్వహించారు.

కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌ (డీడీఆర్పీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారులతోపాటు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈనెల 11న సీడబ్ల్యూసీ డైరెక్టర్‌ ఖయ్యూం అహ్మద్‌ నేతృత్వంలోని అధికారుల బృందం పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధ్యయనం చేస్తారు.




 సామాజిక స్పందన: అమరావతి

 ఆంధ్రప్రదేశ్‌లో పదిహేను మంది ఐపీఎస్‌ ఆఫీసర్ల బదిలీ ప్రక్రియ జరిగింది. మంగళవారం ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ పేరు మీదుగా ప్రభుత్వ జీవో విడుదల అయ్యింది. 


ఎల్‌కేవీ రంగారావు, ఎస్వీ రాజశేఖర బాబు, పీహెచ్‌డీ రామకృష్ణ, కేవీ మోహన్‌ రావు, ఎస్‌ హరికృష్ణ, గోపినాథ్‌ జట్టి, కోయ ప్రవీణ్‌, విశాల్‌ గున్నీ, రవీంద్ర బాబు, అజిత వెజెండ్ల, జీ కృష్ణకాంత్‌, పీ జగదీశ్‌, తుహిన్‌ సిన్హా, బిందు మాధవ్‌ గరికపాటి, పీవీ రవికుమార్‌ బదిలీ జాబితాలో ఉన్నారు. విజయవాడ రైల్వే ఎస్పీగా విశాల్‌ గున్నీకి అదనపు బాధ్యతలు అప్పగించగా, శాంతి భద్రతల డీఐజీగా రాజశేఖర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. 


కోస్టల్‌ సెక్యూరిటీ డీఐజీగా ఎస్‌ హరికృష్ణకు, న్యాయవ్యవహారాల ఐజీపీగా గోపీనాథ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. గుంతకల్లు రైల్వే పోలీస్‌ సూపరింటెండెంట్‌గా అజిత వేజెండ్లకు అదనపు బాధ్యతలు అప్పగించగా, పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు డీఎన్‌ మహేష్‌ను బదిలీ చేశారు. ఐజీపీ స్పోర్ట్స్‌, సంక్షేమ బాధ్యతలు ఎల్‌ కె వి రంగారావుకు, గ్రేహౌండ్స్‌ డీఐజీగా గోపీనాథ్‌ శెట్టికి బాధ్యతలు అప్పగించారు. 


ఇక ప్రస్తుతం కాకినాడ ఎస్పీగా ఉన్న రవీంద్రనాథ్‌ బాబుకు కాకినాడ థర్డ్‌ బెటాలియన్‌ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏసీబీ డీఐజీగా పీహెచ్‌డీ రామకృష్ణ బదిలీ కాగా, 16వ బెటాలియన్‌ కమాండెంట్‌గా కోయ ప్రవీణ్‌ను బదిలీ చేశారు. పల్నాడు అదనపు ఎస్పీ అడ్మిన్‌గా బిందు మాధవ్‌ బాధ్యతలు తీసుకోనున్నారు. తాజా బదిలీలు, పోస్టింగ్‌లు తక్షణమే అమలులోకి వస్తాయని సీఎస్‌ తాజా జీవోలో పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.