సామాజిక స్పందన: పెద్దాపురం పట్టణం
ప్రజాపోరాట యెాధుడు, కార్మిక నాయకుడు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, సాహితీ వేత్త కామ్రేడ్ యాసలపు సూర్యారావు దశవ వర్దంతి 4 రోజుల పాటు నిర్వహించినట్టు ప్రజాసంఘాల నాయకులు తెలిపారు. సూర్యారావు భవన్ లో వర్దంతి కార్యక్రమాల కరపత్రాన్ని విడుదల చేసారు. ఈ సందర్బంగా సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు జోస్యుల కృష్ణబాబు మాట్లాడుతూ యాసలపు సూర్యారావు మరణించి ఈ సంవత్సరంతో 10 సంవత్సరాలు అవుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టుగానే ఈ ఏడాది కూడా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామని అన్నారు.
19 వ తేదీన కవితాగోష్టి కార్యక్రమం సాహితీ స్రవంతి, యుటిఎప్, ప్రజానాట్యమండలి సంయుక్తంగా నిర్వహిస్తున్నాసని అన్నారు. ఈ సందర్బంగా కవితా సంకలనాన్ని ఆవిష్కరించుతున్నామని ప్రకటించారు. అలాగే 20 వ తేదీన రక్తదాన శిభిరం ఉదటం 9 గంటలకు ప్రారంభం అవుతుందని రక్తదానం శిభిరంలో అందరూ పాల్గోనాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని సిఐటియు, ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్, మన పెద్దాపురం పేస్ బుక్ టీం, ఎస్.ఎమ్.ఎస్ లు సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని తెలిపారు. 21 వ తేదీన.మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమం యాసలపు సూర్యారావు భవన కమిటీ పేరుతో జరుగుతుందని తెలిపారు. 22 వ తేదీన సూర్యారావు వర్దంతి సందర్బంగా బహిరంగ సభ జరుగుతుందని దీనికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గోంటున్నారని తెలిపారు. ప్రజానాట్యమండలి సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. అందరూ ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేసారు.
ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్.యూనియన్ గౌరవాధ్యక్షులు చింతల సత్యనారాయణ, సిఐటియు అధ్యక్షులు గడిగట్ల సత్తిబాబు, అంగన్ వాడీ యూనియన్ నాయకులు ఉమామహేశ్వరి, యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి వి.శంకరరావు, జెవివి నాయకులు బి.అనంతరావు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కేదారి నాగు, మండల కార్యదర్శి రొంగల వీర్రాజు, మహపాతిన రాంబాబు, సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు, తాడిశెట్టి గంగ, డి.క్రాంతి కుమార్ తదితరులు పాల్గోన్నారు.
@@@@@@ మరిన్ని వార్తలు చదవండి @@@@@@
విద్యార్ధులు సామాజిక స్పృహ అలవరుచుకోవాలి అంటున్న జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు చల్లా రవికుమార్
సామాజిక స్పందన: పెద్దాపురం
విద్యార్ధి దశ నుండే సామాజిక స్పృహను అవర్చుకోవాలని, అప్పుడు మాత్రమే మంచి సమాజాన్ని మనం నిర్మించగలుగుతామని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చల్లా రవికుమార్ అన్నారు. పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ (పిసిసి) ఆధ్వర్యంలో 28 రోజులుగా జరుగుతున్న సమ్మర్ క్యాంప్‌లో ఆయన పాల్గోని విద్యార్దులతో ముచ్చటించారు. నేటి బాలలే రేపటి పౌరులనే మాటను మనం ఎప్పుడు మరిచిపోకూడదని అన్నారు. ఇక్కడి నుండే అనేక మంది డాక్టర్లు ఇంజనీర్‌లు, లాయర్లు, దేశాన్ని కాపాడే సైనికులు, మనల్ని పాలించే రాజకీయ నాయకులు విద్యార్ధి దశనుండే తయారు అవుతారని అన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన యోధుల జీవిత చరిత్రలను చదవాలని కోరారు. విద్యార్దులు సమాజపట్ల అవగాహన, కుటుంబపట్ల అవగాహన, దేశం పట్ల అవగాహన పెంచుకోవాలని కోరారు. ఇలాంటి సమ్మర్ క్యాంప్‌ల ద్వారా విద్యార్ధుల నైపుణ్యం మెరుగుపరచడానికి అవకాశం ఉంటుందని అన్నారు. సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్న కమిటీ వారికి మనందరం కృతజ్ఞతలు తెలపాలని అన్నారు. అనంతరం విద్యార్ధుల తల్లితండ్రులతో మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో మాథ్స్ ను పవన్ కుమార్, డ్రాయింగ్ శ్యామ్ కుమార్ బోదించారు. సమ్మర్ క్యాంప్ కోఆర్డినేటర్ కూనిరెడ్డి అరుణ, డి.కృష్ణ, రొంగల అరుణ్, కె.రవికుమార్, డి. పూజితా, ఆర్.వీర్రాజు, ఆర్.రవి తదితరులు పాల్గోన్నారు.
@@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@
విద్యార్దులు సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలి: జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్
సామాజిక స్పందన : పెద్దాపురం
సమాజం పట్ల విద్యార్దులు మంచి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని, దానికి సమ్మర్ క్యాంప్ లు ఉపయెాగపడతాయని జనవిజ్ఞానవేదిక రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. యాసలపు సూర్యారావు భవన్ లో పెద్దాపురం చిల్డ్రన్స్ (పిసిసి) ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్ 20 రోజుకు చేరుకుంది. ఈ క్యాంప్ లో విద్యార్దులతో ఆయన ముట్టడించారు. సాంకేతిక రంగంలో పురోగతి అంశాలను, సైన్స్ మ్యాజిక్స్ ను విద్యార్దులకు వివరించారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన భాద్యత భవిష్యత్ తరాలపైనే ఎక్కువ ఉందని అన్నారు.
సాంకేతిక రంగం చాలా ఉన్నత స్దితిలో ఉందని దానిని అందిపుచ్చుకొవాలని అన్నారు. ప్రతి అంశాన్ని ప్రశ్నించడం, జవాబు రాబటట్టం విద్యార్ది దశ నుండే అలవర్చుకోవాలని తెలిపారు.
సమ్మర్ క్యాంప్ ను జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్ చెలికాని స్టాలిన్ సందర్శించి నిర్వహకులను అభినందించారు. సమ్మర్ క్యాంప్ నిర్వహణ అనేది చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నదని, సహకారం అందిస్తున్న పెద్దాపురం పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సమ్మర్ క్యాంప్ కో ఆర్డినేటర్ కూనిరెడ్జి అరుణ, డి.కృష్ణ, ఉమామహేశ్వరి, ఆర్.అరుణ్ కుమార్, అమృత, నమ్రత, బాల మురళీకృష్ణ, దుంగల శ్యామ్ కుమార్ తదితరులు పాల్గోన్నారు.
@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@@
కందుకూరి వీరేశలింగం స్ఫూర్తి కొనసాగిద్దాం, చిల్డ్రన్స్ క్లబ్ ఆద్వర్యంలో వర్ధంతి సభ
సామాజిక స్పందన : పెద్దాపురం
కందకూరి వీరేశలింగం స్పూర్తిని మనందరం కొనసాగించాలని సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు జోస్యుల కృష్ణబాబు అన్నారు. పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ (పిసిసి) ఆధ్వర్యంలో యాసలపు సూర్యారావు భవన్‌లో జరుగుతున్న సమ్మర్‌క్యాంప్‌లో విద్యార్ధులందరూ కలసి కందుకూరి వీరేశలింగం 103వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ బాలకల విద్యకు ఎంతగానో కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారని అంతే కాకుండా తన శిష్యులుగా ఉన్న వారితోనే ముందుగా వివాహాలు జరిపించారని అన్నారు. మొట్టమొదటిగా వితంతు వివాహాన్ని జరిపించింది కందుకూరి వీరేశలింగం అని అన్నారు. హితకారిణి సమాజాన్ని ఏర్పాటు చేసారని అన్నారు. పత్రికను నడపడంలోనూ ఎంతో కృషి చేసారని కొనియాడారు. తన యావదాస్దిని బాలికల చదువుకోసం వినియోగించిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. రాజమహేంద్రవరంలో ఉంటూ అనేక మందిని చైతన్యవంతం చేసారని అన్నారు. కందుకూరి ఆశయాలను కొనసాగించాల్సిన భాద్యత మనందరి పైనా ఉందని అన్నారు. నేటి నుండి విద్యార్ధులు సమాజం పట్ల, ప్రజల పట్ల అవగాహన పెంచుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షులు చల్లా విశ్వనాధం, కొత్త శివ, విద్యార్ధులకు శిక్షణ ఇవ్వడానికి వచ్చిన బలరామకృష్ణమూర్తి, సమ్మర్ క్యాంప్ మ్యాధ్స్ ఉపాధ్యాయులు నీలపాల బాలమురళీకృష్ణ, సమ్మర్ క్యాంప్ కో ఆర్డి నేటర్ కూనిరెడ్డి అరుణ, డి.కృష్ణ, రొంగల అరుణ్, సంధ్య, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కేదారి నాగు, బంగార్రాజు, అమృత, నమ్రత గౌస్, శ్రావికా, అఖిల తదితరులు పాల్గోన్నారు.
@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@@
బాటసారులకు దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్
సామాజిక స్పందన: హైదరాబాద్
తెలంగాణా రాష్ట్రం హైదారాబాద్ నగరంలో ఎండ తీవ్రత ఎక్కువగా వుండటం తో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఏ.ఆర్.ఏ) నేషనల్ ప్రెసిడెంట్ బండి సురేంద్రబాబు గొప్ప సామాజిక సేవా కార్యక్రమం చేపట్టారు, ఎన్.ఏ.ఆర్.ఏ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో పోచమ్మ గుడి ఎదురు, క్రిష్ణ నగర్ మెయిన్ రోడ్డు, యూసఫ్ గూడ లో ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు.
ఈ చలివేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ బండి సురేంద్రబాబు, విశిష్ట అతిథిగా యూసఫ్ గూడ డివిజన్ కార్పొరేటర్ జి సంజీవ్ గౌడ్ విచ్చేసినారు.
పోచమ్మ గుడి ఎదురు, క్రిష్ణ నగర్ మెయిన్ రోడ్డు,యూసఫ్ గూడ దగ్గర ఎన్ఏఆర్ఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని కార్పొరేటర్ సంజీవ్ గౌడ్, నేషనల్ ప్రెసిడెంట్ బండి సురేంద్రబాబు లు సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా విశిష్ట అతిధి యూసఫ్ గూడ డివిజన్ కార్పొరేటర్ సంజీవ్ గౌడ్ మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజల దాహర్తిని తీర్చటానికి చలివేంద్రాలు ఏర్పటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే పోచమ్మ గుడి సెంటర్ లో చలివేంద్రం ఏర్పాటు చేయటం వల్ల అసంఘటిత కార్మికులు,రిక్షా కార్మికులు, ఆటో కార్మికులకు చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు.ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన నేషనల్ యాక్టీవ్ రిపోర్టర్స్ అసోసివేషన్ (ఎన్.ఏ.ఆర్.ఏ) వారిని ఆయన అభినందించారు. ఎన్ఏఆర్ఏ ను స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు కూడా ఇటువంటి చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చాలని సంజీవ్ గౌడ్ వారిని కోరారు..
ముఖ్య అతిథిగా వచ్చిన నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్ర బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, వడగాల్పులు వీస్తున్నాయని, ప్రజలు ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని,కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీల సెంటిగ్రేడు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, వృద్దులు, చిన్నపిల్లలు ఇల్లు వదిలి ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని సురేంద్ర బాబు ప్రజలను కోరారు. భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం వల్ల ఎండ వేడిని తట్టుకోలేక ప్రజలు అల్లాడుతున్నారని,ఈ పరిస్థితిలు అధిగమించేందుకు అన్ని జిల్లాల్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయటానికి మా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ శాయశక్తులా కృషి చేస్తుందని తెలియజేశారు.. ఈ బృహత్తర కార్యక్రమంలో జర్నలిస్టు సోదరులందరూ పాలు పంచుకొని మాకు అన్ని విధాలుగా మద్దతు తెలియచేసి మేము చేసే ఈ మంచి పనిలో మీరు కూడా భాగస్వాములు కావాలని జర్నలిస్ట్ సోదరులను సురేంద్రబాబు కోరారు..
రెడ్ క్రాస్ హైదరాబాద్ డిస్టిక్ చైర్మన్ మామిడి భీమిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కటి ప్రభుత్వమే చేస్తుందని ఎదురు చూడకుండా ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశించకుండా, కుటుంబాలను ప్రాణాలు సైతం పణంగా పెట్టి 24 గంటలు ప్రజలకు సేవ చేస్తూ, తమ వంతు సామాజిక బాధ్యతగా ఇటువంటి చలివేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తూ ప్రజల దాహార్తిని తీరుస్తున్న నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ వారికి మరియు జాతీయ అధ్యక్షులు సురేంద్రబాబు కి, గ్రేటర్ హైదరాబాద్ సెక్రటరీ సతీష్ రెడ్డి కు నా ప్రత్యేక అభినందనలు.. ఇటువంటి సామాజిక సేవలో పాల్గొన్న మిగిలిన జర్నలిస్టు మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని మామిడి భీమిరెడ్డి పేర్కొన్నారు..
ఎన్ఏఆర్ఎ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కైలసాని శివప్రసాద్ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి ద్విచక్ర వాహనాల మీద, బస్సులో ప్రయాణం చేసి వచ్చేవారికి చలివేంద్రం అన్నివేళలా ఉపయోగపడుతుందని ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ ఎండలకి జాగ్రత్త వహించాలని ప్రజలను కోరారు..
ఎన్ఏఆర్ఎ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పుట్టా రామకృష్ణ మాట్లాడుతూ నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ కూడా సేవా మార్గంలో ఎప్పుడూ ముందు ఉంటుందని, అదే క్రమంలో రాష్ట్రంలో ఉన్న ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రజల దాహార్తిని తీర్చడానికి జాతీయ అధ్యక్షులు సురేంద్ర బాబు ఇచ్చిన పిలుపు మేరకు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చలివేంద్రాలు ప్రారంభిస్తామని తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్ర ఎన్.ఏ.ఆర్.ఏ నా యకులు చికిలే మధుబాబు మాట్లాడుతూ పాత్రికేయ వృత్తిని ఊపిరిగా భావించి సమసమాజ స్థాపన కోసం కుటుంబాలను, ప్రాణాలు సైతం పణంగా పెట్టి సమసమాజ స్థాపన కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు.ఈ క్రమంలో సమాజ సేవలో భాగంగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జర్నలిస్ట్ లు కనీస బాధ్యతగా గుర్తించి నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ చలివేంద్రాలని ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలియజేశారు..
ఎన్ఏఆర్ఎ గ్రేటర్ హైదరాబాద్ సెక్రటరీ సతీష్ రెడ్డి మాట్లాడుతూ వేసవిలోని ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్రబాబు ఇచ్చిన పిలుపుతో ఈరోజు నా ఆధ్వర్యంలో యూసఫ్ గూడ లో చలివేంద్రం ఏర్పాటు చేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలియచేసారు..
ఎన్.ఏ.ఆర్.ఏ గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ రఫిఉద్దీన్ మాట్లాడుతూ ఎన్.ఏ.ఆర్.ఏ వారు ఉచిత మంచి నీటి చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చటం మంచి సేవ గుణం అని కొనియాడుతూ ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఏఆర్ఏ జాతీయ అధ్యక్షలు బండి సురేంద్రబాబు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి పుట్ట రామకృష్ణ, మధుబాబు, రఫిఉద్దీన్, సందీప్, సతీష్ రెడ్డి, ఫిరోజ్, వినోదలక్ష్మి, పాల్గోన్నారు.

















0 Comments