సామాజిక స్పందన అమరావతి :
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్ర పర్యటన నిమిత్తం బుధవారం విశాఖపట్నం వెళుతున్నారు. అదేరోజు సాయంత్రం అనకాపల్లి జిల్లా చోడవరంలో జరగనున్న జిల్లాస్థాయి మినీమహానాడుకు హాజరవుతారు. 16వ తేదీన అనకాపల్లిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహిస్తారు.
రెండు రోజులు అనకాపల్లి జిల్లాలో టీడీపీ అధినేత పర్యటన, 15న చోడవరంలో మినీమహానాడుకు హాజరు కానున్నారు, 16న అనకాపల్లిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు
టీడీపీ అధినేత రెండు రోజుల జిల్లా పర్యటన షెడ్యూల్ : చంద్రబాబునాయుడు బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి 1.45 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. రెండు గంటలకు ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 3.30 గంటలకు చోడవరం వెళతారు. శివాలయం గుడి వద్ద ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనుల కోసం గతంలో సీఎం హోదాలో తాను ఆవిష్కరించిన శంకుస్థాపన శిలాఫలకాన్ని సందర్శిస్తారు. అనంతరం మినీమహానాడు సభా వేదిక వద్దకు వస్తారు. సభలో ప్రసంగించిన అనంతరం ఏడు గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి 7.45 గంటలకు అనకాపల్లి చేరుకుంటారు. రాత్రికి చంద్రశేఖర కల్యాణ మండలంలో బస చేస్తారు.
గురువారం ఉదయం 10.30 గంటలకు ఎన్టీఆర్ మార్కెట్ యార్డు రోడ్డులో నూతనంగా నిర్మించిన టీడీపీ అనకాపల్లి పార్లమెంటరీ కార్యాలయానికి చేరుకొని ప్రారంభిస్తారు. 11 గంటలకు తిరిగి చంద్రశేఖర కల్యాణ మండపానికి చేరుకుంటారు. 11.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు అసెంబ్లీ నియోజవర్గాల వారీగా ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులతో సమీక్షలు నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో బయలుదేరి గాజువాక, ఎన్‌ఏడీ జంక్షన్ మీదుగా విజయనగరం వెళతారు.
భారత్ లో కొత్తగా 3,451 కరోనా కేసులు 40 మరణాలు నమోదు
సామాజిక స్పందన: ఢిల్లీ
మన దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమ క్రమంగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 3,451 నమోదయ్యాయి.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,00,643 కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3079 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.04 శాతంగా ఉంది.ఇక దేశంలో తాజాగా 40 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,24,064 కి చేరింది.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 20,635 కు చేరింది. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,25,57495 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,90,20,07,487 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 17. 39,403 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.
@@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@
బలపడిన వాయుగుండం నేడు తుఫానుగా మారే చాన్స్
సామాజిక స్పందన: అమరావతి
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈరోజు అది తుపానుగా మారుతుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ప్రస్తుతం ఇది మరింత వాయువ్యంగా ప్రయాణించి సోమవారం ఉదయానికి కోస్తాంధ్ర-ఒడిశా తీరాలకు దగ్గరగా వస్తుందని స్పష్టం చేసింది. ఈ నెల 10వ తేదీ నాటికి క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చిన అనంతరం ఇది దిశమార్చుకుని ఈశాన్యం వైపు వెళ్లేందుకు అవకాశముందని ఐఎండీతెలిపింది..












0 Comments