సామాజిక స్పందన : పెద్దాపురం పట్టణం
పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ (పిసిసి) ఆధ్వర్యంలో పెద్దాపురం పట్టణం యాసలపు సూర్యారావు భవన్‌లో నిర్వహించనున్న సమ్మర్ క్యాంప్ ఈ రోజు ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమైంది. దాదాపు 100 మంది పైబడి విధ్యార్ధిని విద్యార్దులు హాజరయ్యారు. స్వాతంత్ర్య పోరాటయోధుడు, రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామ రాజు వర్ధంతి సందర్భంగా సమ్మర్ క్యాంప్ ను ప్రారంభించారు. సోషల్ మీడియా ఫర్ సోసైటీ (ఎస్.ఎమ్.ఎస్ ) జిల్లా అధ్యక్షులు ముక్తార్ ఆలీ, మన పెద్దాపురం ఫేస్ బుక్ అడ్మిన్ నరేష్ పెద్దిరెడ్డిలు ప్రారంభించారు. ముందుగా సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళి అర్పించారు.
ఈ సందర్బంగా సాహితీ స్రవంతి కోశాధికారి, చరిత్రపరిశోదకులు వంగలపూడి శివకృష్ణ మాట్లాడుతూ బ్రిటిషువారికి వ్యతిరేకంగా తెలుగు ప్రజలను కూడగట్టి ఉద్యమించారని అన్నారు. చిన్ననాటినుండే అనేక విద్యలను నేర్చుకున్నారని అన్నారు. చదువుతో పాటు, వైద్యం లాంటివి అనేకం నేర్చుకొని బ్రిటిషువారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారని అన్నారు. దేశస్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన యోధులను మనం స్మరించుకోవాలని అన్నారు. భగత్ సింగ్, ద్వారబందాల చంద్రయ్య, జలియన్‌వాలాబాగ్ ఘటనలు మనం తెలుసుకోవాలని అన్నారు. ముక్తార్ ఆలీ మాట్లాడుతూ విద్యార్దులు దేశభక్తి భావాలను పెంపొందించడానికి ఇలాంటి సమ్మర్ క్యాంప్‌లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. సమ్మర్ క్యాంప్ ను విద్యార్ధులందరూ ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. మన పెద్దాపురం ఫేస్ బుక్ టీమ్, ముక్తార్ ఆలీలు సమ్మర్ క్యాంప్ కు మెటీరియల్ ను అందజేసారు.. ఈ కార్యక్రమంలో క్రాఫ్ట్ ఉపాధ్యాయురాలు రేవతి, హిందీ ఉఫాద్యాయురాలు మల్లీశ్వరి, లెక్కల ఉఫాద్యాయుడు నీలపాల బాలమురళీకృష్ణ, డ్రాయింగ్ టీచర్ దుంగల శ్యామ్ కుమార్‌లు పాల్గోన్నారు. సమ్మర్ క్యాంప్ కోఆర్డినేటర్ కూనిరెడ్డి అరుణ, డి.కృష్ణ, ఉమామహేశ్వరి, రొంగల అరుణ్‌లు మెటీరియల్ అందిచిన వారికి, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు.
@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@@
5వ రోజు మజ్జిగ పంపిణి ప్రారంభించిన సూరిబాబు రాజు












0 Comments