సామాజిక స్పందన: హైదరాబాద్
అమీర్ పేట్‌లోని ప్రజా శాంతి పార్టీ కార్యాలయం వద్ద హైడ్రామ కొనసాగుతోంది. పార్టీ ఆఫీసుకు మళ్లీ పోలీసులు వచ్చారు. డీజీపీ కార్యాలయానికి వెళ్ళేందుకు కేఏ పాల్‌కు అనుమతి లేదని, ఒకవేళ డీజీపీ కార్యాలయానికి వెళ్లేందుకు యత్నిస్తే అరెస్టు చేస్తామని పోలీసులు అన్నారు.
డీజీపీ కార్యాలయానికి బయలుదేరడానికి కేఏ పాల్ సిద్దమయ్యారు. మూడు రోజుల క్రితం తనపై జరిగిన దాడి ఘటనపై డీఎస్పీ, సీఐలపై డీజీపీకి పిర్యాదు చేస్తామన్నారు. డీజీపీ అపాయింట్‌మెంట్ లేకపోవడంతో వెళ్లేందుకు వీల్లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇవాళ డీజీపీ కార్యాలయానికి వెళ్తామని కేఏ పాల్ వర్గీయిలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా శాంతి పార్టీ కార్యాలయం ముందు పోలీసులు భారీగా మోహరించారు.
హైదరాబాద్ లో భారీ వర్షం
సామాజిక స్పందన: హైదరాబాద్
నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, అమీర్‌పేట, పంజాగుట్ట, సికింద్రాబాద్, మారేడ్‌పల్లి, చిలకలగూడ, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, మియాపూర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, కిస్మత్‌పూర్, అల్వాల్, బేగంపేట్, సైదాబాద్, చంపాపేట, సరూర్‌నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, నాగోల్, చైతన్యపురి, వనస్థలిపురం, హయత్ నగర్, తుర్కయంజాల్, పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపుర్‌మెట్, బుద్వేల్, శివరాంపల్లి, కుషాయిగూడ, ఈసీఐఎల్, కాప్రా, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, కంటోన్మెంట్, మల్కాజిగిరి, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.భారీ వర్షానికి నగరంలోని రోడ్లపై వరద పొంగిపొర్లుతోంది. పలు కాలనీలు నీటిమయమయ్యాయి. దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పంజాగుట్ట కూడలి వద్ద భారీగా వర్షపు నీరు నిలిచింది. ఖైరతాబాద్, బంజారాహిల్స్ కూడలి వద్ద మోకాళ్ల లోతులో నీరు చేరింది. యూసఫ్ గూడ మైత్రీవనం రహదారిపై స్టేట్ హోమ్ వద్ద రోడ్డుపై చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. యూసఫ్‌గూడలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షంతో గత కొన్నిరోజులుగా ఎండవేడిమితో అల్లాడుతున్న నగర ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం లభించినట్లైంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భువనగిరి పట్టణంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది.
నేడు శ్రీకాకుళంలో చంద్రబాబు పర్యటన వివరాలివే
సామాజిక స్పందన: శ్రీకాకుళం జిల్లా
టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి జిల్లాల పర్యటనును ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ నియోజకవర్గంలో నేడు చంద్రబాబు పర్యటిస్తారు.
అక్కడ జరిగే బాదుడే బాదుడు ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటారు చంద్రబాబు.
టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. మొదట ఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు మండలంలో గల దల్లవలస గ్రామంలో నుంచే ఈ టూర్ ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలను ప్రజలకి వివరించడమే టీడీపీ ప్రధాన ఎజెండాగా తెలుస్తోంది. పన్నులు, ఛార్జీలు పెంచేసి ప్రజల నడ్డివిరుస్తున్నారని బాదుడే బాదుడు పేరుతో నిరసనలను టీడీపీ చేపడుతోంది. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ఇన్‌చార్జీగా ఉన్న ఆమదాలవలస నియోజకవర్గంలోనే పర్యటించేందుకు నిర్ణయించుకున్నారు చంద్రబాబు.
చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటించి చాలా రోజులైంది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒకట్రెండుసార్లు వచ్చినా శ్రీకాకుళంలో మాత్రం అడుగుపెట్టి చాలా కాలమైంది. అందుకే చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. ప్రజల్లోకి వెళ్లి మళ్లీ పుంజుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
భారత్ లో కొత్తగా 3,205 కరోనా కేసులు నమోదు













0 Comments