వ్యక్తికి రూ.వెయ్యి కుటుంబానికి రూ.2 వేలు:జగన్


సామాజిక స్పందన: అమరావతి

'అసని' తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమని సీఎం జగన్‌ అన్నారు. తుపాను ప్రభావిత కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఆదేశాలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలి.. ఇప్పటికే నిధులిచ్చామని చెప్పారు. తీర ప్రాంతాల్లో అప్రమత్తం అవసరమని తెలిపారు. ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.అవసరమైన చోట సహాయ, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. సహాయ శిబిరాలకు తరలించిన వ్యక్తికి రూ.1000, కుటుంబానికి రూ.2వేలు చొప్పున ఇవ్వండని జగన్‌ అధికారులకు చెప్పారు. సహాయ శిబిరాల్లో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. జనరేటర్లు, జేసీబీలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.


@@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@



నేడు అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం

సామాజిక స్పందన ప్రత్యేక కథనం

ఆఫ్రికాలోని చాలా దేశాల్లో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు ఉండేవి. వాటికి నిరసనగా ఆఫ్రికన్‌ జర్నలిస్టులు 1991, ఏప్రిల్ 29 నుండి మే 3వ తేదీవరకు ఆఫ్రికాలోని నమీబియా దేశపు విండ్ హాక్ నగరంలో సమావేశం ఏర్పాటుచేసి, పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన అనేక తీర్మానాలు చేశారు.

ఆఫ్రికన్‌ జర్నలిస్టుల నిరసనకు గుర్తుగా మే 3వ తేదీని ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా జరపాలని 1993, డిసెంబరు నెలలో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం నిర్ణయించింది.

కొలంబియన్‌లోని ఒక పత్రికకు ఎడిటర్‌ గా పనిచేస్తున్న గుల్లెర్మోకేనో అనే వ్యక్తిని 1986 డిసెంబర్‌ 17న డ్రగ్‌ మాఫియా హత్య చేసింది. పత్రికా స్వేచ్ఛకు స్ఫూర్తిగా ఆయన పేరుమీద యునెస్కో 1997 నుంచి ప్రతి సంవత్సరం మే 3వ తేదీన గుల్లెర్మోకేనో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ అవార్డులను ఇస్తుంది.

పత్రికా స్వేచ్ఛ, నానాటికీ తీసికట్టు

రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ తాజా నివేదిక ప్రకారం పత్రికా స్వేచ్ఛ సూచిలో మన దేశం ఏమాత్రం మెరుగ్గా లేదు. నానాటికీ తీసికట్టుగా పరిస్థితి తయారైందని తాజా అధ్యయనం వెల్లడించింది. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్(ఆర్‌ఎస్‌ఎఫ్‌) తాజాగా ప్రకటించిన దేశాల జాబితాలో మన దేశం 150వ స్థానంలో నిలిచింది. గతేడాది భారత్ ర్యాంక్ 142.

ప్రతి దేశంలో పాత్రికేయులు, వార్తా సంస్థలు, నెటిజన్‌లకు ఉన్న స్వేచ్ఛను.. అలాంటి స్వేచ్ఛను గౌరవించే ప్రభుత్వ ప్రయత్నాలను వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ హైలైట్ చేస్తుంది. జర్నలిజానికి ‘చెడు’గా పరిగణించబడే దేశాల జాబితాలో భారత్‌ గతేడాది చేర్చబడింది. 

జర్నలిస్టులపై జరుగుతున్న హింస, రాజకీయంగా పక్షపాత మీడియా, కేంద్రీకృత మీడియా యాజమాన్యం ఇవన్నీ భారత్‌లో పత్రికా స్వేచ్ఛకు ముప్పుగా పరిణమించాయని ఆర్‌ఎస్‌ఎఫ్‌ నివేదిక పేర్కొంది. 

‘ఇండియా స్పెండ్’ నివేదిక ప్రకారం.. ఇంటర్నెట్ షట్‌డౌన్‌, తప్పుడు సమాచారం విస్త్రృత వ్యాప్తి కూడా గత ఐదేళ్లలో పత్రికా స్వేచ్ఛ సూచికలో భారతదేశం ర్యాంక్ పడిపోవడానికి కారణమని వెల్లడించింది.


Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.