సామాజిక స్పందన: పెద్దాపురం
రక్తదానం చేయ్యడం అంటే ప్రాణదానమేనని పెద్దాపురం మున్సిపల్ ఛైర్ పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు అన్నారు. యాసలపు సూర్యారావు 10వ వర్దంతి సందర్బంగా యాసలపు భవన్లో రక్తదాన శిభిరంను తులసి మంగతాయారు ప్రారంభించారు. ఈ సందర్బంగా సిఐటియు నాయకులు డి.క్రాంతి కుమారి అధ్యక్షతన రక్తదాన శిభిరం సభ జరిగింది. ఈ సందర్బంగా తులసి మంగతాయారు మాట్లాడుతూ సూర్యారావు బౌతికంగా మననుండి దూరమైనా ఆయన మనందకి మనస్సులో నిలిచే ఉంటారని అన్నారు. కౌన్సిలర్ గా చేస్తూవార్డులో ఎన్నోపనులు చేసారని, అంతే కాకుండా పట్టణంలో అనేక సమస్యలపై పని చేసారన్నారు. సేవా కార్యక్రామాల రూపకల్పనలో ముందుండేవారని అన్నారు. మున్సిపస్ వైస్ ఛైర్మెన్ నెక్కంటి సాయి ప్రసాద్ మాట్లాడుతూ రక్తదానం చేయ్యడం ద్వారా ఎంతో మందికి ఉపయెాగపడడం చాలా సంతోషం అన్నారు. శిభిరాన్ని ఏర్పాటు చేయ్యడం చాలా సంతోషం అన్నారు. సూర్యారావు ఆశయాలను మరిచిపోకుండా కొనసాగించడం చాలా సంతోషమన్నారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ కనకాల మహాలక్ష్మీ, చేనేత సొసైటి అధ్యక్షులు ముప్పన వీర్రాజు, వార్డు కౌన్సిలర్ లు తాటికొండ.వెంకట లక్ష్మీ, నీలంశెట్టి అమ్మాజీ, విజ్జపు రాజశేఖర్ మన పెద్దాపురం పేస్ బుక్ అడ్మిన్ నరేష్ పెదిరెడ్జి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ లు సభలో పాల్గోన్నారు.
ఈ కార్యక్రమంలో సిరిపురపు శ్రీనివాస్, నీలపాల సూరిబాబు, తైనాల శ్రీను, గూనూరి రమణ, కంచుమర్తి కాటంరాజు, మాగాపు నాగు, రొంగల అరుణ్, కూనిరెడ్డి రవి, సిరిపురపు బంగార్రాజు తదితరులు పాల్గోన్నారు రోటరీ క్లబ్ కాకినాడ డాక్టర్ కామరాజు నేతృత్వంలో రక్తదాన శిభిరానికి సహకారం అందించారు.
@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@@
పోరాటాల్లోనే కాదు, సేవలోనూ ముందుటారు
సామాజిక స్పందన: పెద్దాపురం పట్టణం
కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో యాసలపు సూర్యారావు చలివేంద్రం ప్రారంభించి, మున్సిపల్ ఛైర్మెన్ చేతుల మీదుగా మజ్జిగ పంపిణి చేయడం జరిగింది.ప్రజాపోరాట యోధుడు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, సిపిఎం నాయకులు యాసలపు సూర్యారావు బస్ షెల్టర్ వద్ద యాసలపు సూర్యారావు భవన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలివేంద్రాన్ని పెద్దాపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు మున్సిపల్ వైస్ ఛైర్మెన్ నెక్కంటి సాయి ప్రసాద్. కనకాల మహాలక్ష్మీతో కలసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛైర్మెన్ మాట్లాడుతూ వేసవి తీవ్రత చాలా తీవ్రంగా ఉందని దీని నుండి ప్రజలను ఎంతో కొంత బయటపడేయడానికి అనేక మంది సహాయ సహాకారాలతో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుండడం చాలా సంతోషదాయక మన్నారు. యాసలపు సూర్యారావు పేరుతో చలివేంద్రం నిర్వహించడం, దానిని ప్రారంభించే అవకాశం రావడం జరిగిందని అన్నారు. చలివేంద్రం ద్వారా మజ్జిక, మంచినీరు పంపణి చేయ్యడానికి కార్యకర్తలు ముందుకు రావడం ఆనందంగా ఉందని అన్నారు.
వైస్ ఛైర్మెన్ నెక్కంటి సాయి ప్రసాద్ మాట్లాడుతూ ఎంత తీవ్రత దృష్ట్యా వృద్దులు, పిల్లలు చాలా జాగ్రత్త ఉండాలని విజ్ఞప్తి చేసారు. పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన భాద్యత మనందరి పైనా ఉందని దానిని కాపాడుకోవడంలో మనందరం చొరవచూపాలన్నారు. ఇంత ఎండలో కూడా పచ్చని చెట్లే మనకు నీడనిస్తాయని తెలిపారు. వాటిని పరిరక్షించాల్సిన భాద్యత మనందరిపైనా ఉందని తెలిపారు. మరో మున్సిపల్ వైస్‌ఛైర్మెన్ కనకాల మహాలక్ష్మీ, 5వ వార్డు కౌన్సిలర్ విడదాసరి రాజా, 7వ వార్డు కౌన్సిలర్ విజ్జపు రాజశేఖర్, సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు జోస్యుల కృష్ణబాబు, బళ్ళమూడి సూర్యనారాయణ, నీలపాల సూరిబాబు ప్రసంగించారు. ప్రజానాట్యమండలి కళాకారులు ఆర్.వీర్రాజు, డి.కృష్ణ, డి.సత్యనారాయణ, ఎమ్.రాంబాబు, స్నేహ లత, కేదారి నాగు, రత్నం అభ్యుదయ గీతాలను ఆలపించారు. జెవివి నాయకులు బి.అనంతరావు, సాహితీ స్రవంతి కార్యదర్శి, కోశాదికారి కొత్త శివ, వంగలపూడి శివకృష్ణ, ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ నాయకులు చింతల సత్యనారాయణ, పాండవగిరి పెయింటింగ్ యూనియన్ నాయకులు నీలం శ్రీను, యాసలపు మహేష్, ప్రకాష్, శ్రీమరిడమ్మ తల్ల పెయింటింగ్ యూనియన్ నాయకులు తైనాల శ్రీను, గూనూరి రమణ, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు ఉమామహేశ్వరి, ఐద్వా నాయకులు అనంతలక్ష్మీ, డి. సత్యవతి, సుబ్బలక్ష్మీ, నెక్కల మంగ , సిరిపురపు వరలక్ష్మీ, సిఐటియు నాయకులు కంచుమర్తి కాటంరాజు, డి.క్రాంతి కుమార్, కూనిరెడ్డి అప్పన్న, నరసింహమూర్తి, ఎస్.మరిడియ్య, విశ్వనాధం, నీలపాల బాబ్జి హనుమంతు డివైఎఫ్‌ఐ నాయకులు రవి, ఎస్ఎప్ఐ నాయకులు అరుణ్, అఖిల రొంగల తాతారావు తదితరలు పాల్గోన్నారు.
@@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించండి: సిఐటియు అఖిల భారత ఉఫాద్యక్షురాలు జి.బేబిరాణి
సామాజిక స్పందన: పెద్దాపురం పట్టణం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని లేదంటే మనల్ని మనల్ని బానిసలుగా మార్చేసే ప్రమాదం ఉందని సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు, అంగన్ వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబిరాణి అన్నారు. మేడే సందర్బంగా సిఐటియు పెద్దాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో బహిరంగసభ మెయిన్ రోడ్ ఆంజనేయస్వామి గుడి సెంటర్ లో మండల కార్యదర్శి దాడి బేబి అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్యఅతిధిగా బేబిరాణి హాజరై ప్రసంగించారు. చికాగో నగరంలో కార్మికుల రక్తంతో పుట్టిన ఎర్రజెండా ఎనిమిది గంటల పోరాట వారలత్వాన్ని ఇచ్చిందని అన్నారు. కార్మికులు ప్రజల సంక్షమమే మా లక్ష్యం అంటూ అధికారంలోకి వచ్చిన నాటి కాంగ్రేస్ గానీ, నేడు బిజెపి గాని కార్మికుల హక్కులు కాలరాసి కార్పేరేట్లకు లాభాలు అందించే పనిలో పడ్డాయని అన్నారు. 136వ మేడేను కార్పోరేట్ దోపిడీకి, మతత్వానికి వ్యతిరేకంగా నిర్వహించాలని నిర్ణయించామని అన్నారు. కార్మిక చట్టాలను కోడ్ లుగా మార్చేసి కార్మికులకు ఉన్న సంఘం పెట్టుకునే హక్కు, యాజమాన్యాలతో బేరసారాలాడే హక్తుని తీసేసారని అన్నారు. సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని, కనీసవేతనాలు అమలు చేయ్యాలని సుప్రీంకోర్టు చెప్పినా అదిమాత్రం అమలు చెయ్యడం లేదన్నారు. స్కీమ్ వర్కర్లుపైన కక్షసాధిపుంలకు పూనుకుంటున్నారని ఇది తగదని హితవు పలికారు. పెద్దాపురం నియెాకవర్గ ఇన్ చార్జ్ వారి తండ్రి మహిళలకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని అన్నారు. మహిళల పట్ల భాద్యత ఉంటామని జగన్ ఒకపక్క చెబుతుంటే ఇక్కడ మాత్రం మహిళలను బూతులు తిట్టడం ఇది వాట్సప్ లలో మీడియాలో రావడం మనందరం చూసామని అన్నారు. చుట్టు పక్కల పరిశ్రమల్లో కార్మికులకు వేతనంతో కూడిన వారాంతపు సెలవులు అమలు చేయ్యాలని, పిఎఫ్ ఇఎస్ఐ కట్టాలని డిమాండ్ చేసారు. కంపెనీల్లో పని చేస్తున్న లారీ డ్రైవర్ లకు భద్రత కల్పించాలని అన్నారు. కార్మిక సమస్యల్లో రాజకీయనాయకులు జోక్యం చేసుకుంటే సమస్య పరిష్కరించాలి తప్ప ఉద్యోగాలనుండి తీయించడం కాదనేది గుర్తించాలని అన్నారు. కనీస వేతనాలు, 8గంటల పని కోసం జరిగే పోరాటానికి కార్మికులందరూ ముందుండాలని పిలుపునిచ్చారు. సిఐటియు మండల అధ్యక్షులు గడిగట్ల సత్తిబాబు, ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు చింతల సత్యనారాయణ, సిఐటియు ఉఫాద్యక్షులు కంచుమర్తి కాటంరాజు, నీలపాల సూరిబాబు, సహాయ కార్యదర్శి ఉమామహేశ్వరి, మాగాపు నాగు, గంగాధర్, బుడతా రవీంద్ర, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు డి.క్రాంతి కుమార్ లు ప్రసంగించారు. యుటిఎఫ్ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, యుటిఎఫ్ పట్టణ అధ్యక్షులు ఎ.ప్రదీప్ లు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిరపురపు శ్రీనివాస్ స్వాగతం పలికారు. ప్రజానాట్యమండలి కళాకారులు డి.కృష్ణ, ఆర్. వీర్రాజు, డి.సత్యనారాయణ, ఎమ్.రాంబాబు,హుస్సేన్, లక్ష్మీ, స్నేహలతా తదితరులు అభ్యుదయ గీతాలను ఆలపించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎన్.నరసింహమూర్తి, కె.అప్పన్న, కరక సుబ్బలక్ష్మీ, గాడి సత్యవతి, వి.ఎల్. పద్మ తదితరులు పాల్గోన్నారు.













0 Comments