ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో సైబర్ నేరాలపై అవగాహన: రాష్ట్ర డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి.



  సామాజిక స్పందన: మంగళగిరి 
జూన్ 16వ తేదీ నుంచి 18 తేదీ వరుకు రాష్ట్ర౦లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహంచనున్నట్లు రాష్ట్ర డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి తెలియజేశారు.
  
భారతదేశానికి స్వాతంత్ర్యం ల‌భించి 75 ఏళ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా  నిర్వహిస్తున్న కార్యకమం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, (AKAM)  ఇది భారత స్వాతంత్య్ర దినోత్సవం 2022 ఆగస్టు 15 కు 75 వారాల ముందు ప్రారంభమవుతుంది. 2023 స్వాతంత్ర్య దినోత్సవం వరకు కొనసాగుతుంది. 

ఈ కార్యక్రమంలో భాగంగా MHA (CIS డివిజన్), ఆంధ్రప్రదేశ్‌ సహా 7 రాష్ట్రాలలో సైబర్ సేఫ్టీ & నేషనల్ సెక్యూరిటీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

రాష్ట్ర స్థాయిలో ముఖ్యమైన కార్యక్రమం 16.06.2022 (గురువారం) విశాఖపట్నంలో జరగనుంది. దీనిలో కేంద్ర హోం శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర పోలీస్ ఇతర శాఖల అదికారులు పాల్గొంటారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాల వివరాలు:

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, MHA (CIS డివిజన్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసు శాఖ సంయుక్తంగా సైబర్ సేఫ్టీ & జాతీయ భద్రతపై విశాఖపట్నంలో 16.06.2022 (గురువారం) ఉదయం 10 గంటలకు VUDA చిల్డ్రన్స్ అరెనాలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంగీత నాటక అకాడమీ వారి సాంస్కృతిక ప్రదర్శన,  నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారి ప్రదర్శన,  సైబర్ క్రైమ్‌లపై నిపుణుల చర్చలు,  ఇతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


ఇదికాక రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రదేశాలలో సైబర్ నేరాలపైన జూన్ 16, 17, 18వ తేదీల్లో శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి మరియు అనంతపురం కలెక్టర్ల సమన్వయంతో జిల్లా ఎస్పిలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పై జిల్లా కేంద్రాలలో నిర్వహించే సైబర్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లలో కలెక్టర్ల, SP/CP తోపాటు విద్యార్థులు, సాధారణ ప్రజానీకం, మహిళలు  భాగస్వాములను కావాలని కోరుతున్నాము.

అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టడం జరిగింది. అందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు కూడా సంబంధిత అధికారులకు జారీ చేయడం జరిగింది.

కార్యక్రమంలో భాగంగా సైబర్ క్విజ్, ట్యాగ్‌లైన్ పోటీ, నినాదాల పోటీ వంటి పోటీలు నిర్వహించడంతో పాటు సైబర్ నేరాలు, సైబర్ పరిశుభ్రతపై చర్చలుతో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వర్తించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది.

ఈ సంధర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్  పోలీస్ శ్రీ. రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ అన్ని శాఖల సమన్వయంతో నిర్వహించే ఈ కార్యక్రమలలో ప్రతిఒక్కరు పాల్గొని సమాజం లో రోజు రోజుకు  పెరుగుతున్న కొత్తతరహ సైబర్ నేరాల నుండి తీసుకోవాల్సిన జాగ్రతలపైన అవగాహన కల్పించుకోవాలని కోరారు.

@@@@@@@ మరిన్నివార్తలు @@@@@@@@@

 శరద్ పవార్ తో మమత భేటీ, రాష్ట్రపతి రేసుకు ఒప్పించేందుకేనా?

సామాజిక స్పందన: దిల్లీ
రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తోన్న వేళ దేశ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలను కూడగట్టేందుకు కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ పేరు వినిపిస్తున్నా.. అందుకు ఆయన సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు పవార్‌తో భేటీ అయ్యారు.
రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి అభ్యర్థిపై సంయుక్త వ్యూహాలను రచించేందుకు మమతా బెనర్జీ రేపు దిల్లీలో సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ భేటీలో పాల్గొనాలని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష పార్టీల సీఎంలు, నేతలను ఆహ్వానించారు. బుధవారం(జూన్ 15) మధ్యాహ్నం 3 గంటలకు వీరంతా దిల్లీలోని కాన్ట్సిట్యూషన్ క్లబ్‌లో సమావేశం కానున్నారు. ఇందుకోసం ఈ ఉదయం దీదీ దిల్లీ చేరుకోగా.. పవార్‌ కూడా హస్తినకు వచ్చారు.
కాగా.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్‌ పవార్‌ అయితే బాగుంటుందని కాంగ్రెస్‌ పార్టీ విపక్ష పార్టీలకు సూచించింది. ఆయనకు తమ మద్దతి ఇస్తామని ప్రకటించింది. అయితే దీనికి పవార్‌ సుముఖంగా లేరని ఎన్సీపీ వర్గాలు నేడు వెల్లడించాయి. తాను రాష్ట్రపతి రేసులో లేనని పవార్‌ ఎన్సీపీ నేతలకు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాలు తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టుకోవడంలో సఫలమవుతాయన్న దానిపై శరద్‌ పవార్‌ నమ్మకంగా లేరట. అందుకే ఓడిపోయే పోరులో బరిలోకి దిగేందుకు ఆయన సుముఖంగా లేరని సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ తాజాగా పవార్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు ఆయనను ఒప్పించేందుకు దీదీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

పవార్‌ తిరస్కరించారు: ఏచూరి

అంతకుముందు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, సీపీఐ జనరల్‌ సెక్రటరీ డీకే రాజా కూడా శరద్‌ పవార్‌తో భేటీ అయ్యారు. ''రాష్ట్రపతి ఎన్నికకు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలబడేందుకు పవార్‌ నిరాకరించారు. ఇతర నేతల పేర్లను పరిశీలిస్తున్నాం'' అని సమావేశం అనంతరం ఏచూరీ మీడియాకు తెలిపారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.