కాకినాడ జిల్లా, పెద్దాపురం మండలం:
ఈనెల జై భీమ్ భారత పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జి చింతలపాటి సురేష్ నియమితులయ్యా రు కార్యక్రమాన్ని మాజీ న్యాయమూర్తి ప్రముఖ ప్రస్తుత హైకోర్టు న్యాయవాది జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ గారు ఆదేశాలు మేరకు జై భీమ్ భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ జగ్గారపు మల్లికార్జున మరియు కాకినాడ పార్లమెంటు సభ్యులు శ్రీ ఏనుగుపల్లి కృష్ణ గారి చేతుల మీదుగా పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించడం జరిగింది. సురేష్ ని పలువురు ప్రముఖులు అభినందించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ పార్టీ యొక్క విధి విధానాలను అనుసరించి నా వంతు కృషి చేస్తానని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పలువురు పాల్గొని అభినందనలు తెలిపారు
నారా లోకేష్ జూమ్ మీటింగ్ లో కొడాలి నాని, వల్లభనేని వంశీ
సామాజిక స్పందన: అమరావతి
టెన్త్ విద్యార్థులతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహించిన జూమ్ సమావేశంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.వైకాపాకు చెందిన మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జూమ్ మీటింగ్‌లో ప్రత్యక్షమయ్యారు.దీన్ని గమనించిన లోకేశ్.. సమావేశంలో ఆ పార్టీ నేతలు ఉన్నా ఫర్వాలేదని, వైకాపా ప్రభుత్వం ఎలా ఏడ్చిందో వారికీ తెలుస్తుందని వ్యాఖ్యానించారు. విద్యార్థులను ఫెయిల్ చేయడం ప్రభుత్వం చేతగానితనమని.. జూమ్‌లో దొంగ ఐడీలతో సమావేశాన్ని డిస్టర్బ్ చేస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే ఆ సమావేశం నుంచి ఎమ్మెల్యే వంశీ తప్పుకున్నారు. కార్తిక్ కృష్ణ అనే విద్యార్థి పేరుతో కొడాలి నాని పాల్గొన్నారు. ప్రభుత్వ చేతగానితనాన్ని ఎండగడతానంటూ లోకేశ్ ఆ సమావేశాన్ని కొనసాగించారు.











0 Comments