సామాజిక స్పందన: పెద్దాపురం పట్టణం
ప్రకృతిని, ప్రకృతిలో ప్రాణులను కాపాడుకోవాలని జంతు ప్రేమికుడు నవీన్ నాని విద్యార్దులను కోరారు. పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ల్(పిసిసి) ఆద్వర్యంలో 29వ రోజు జరిగిన సమ్మర్ క్యాంప్ లో నవీన్ నాని విద్యార్దులను ఉద్దేశించి మాట్లాడారు. మనతోపాటు కలిసి పెరిగే జంతువులను కాపాడుకోవాలని అన్నారు. ప్రకృతి ప్రతిజీవికి జీవించే హక్తును ఇచ్చిందని, అలాగే వాటి వల్ల వచ్చే అనార్దాలను కూడా మనకు నిత్యం చెబుతూనే ఉందని అన్నారు. పెంపుడు జంతువులతో విద్యార్దులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.
చెనేత సోసైటి అధ్యక్షులు ముప్పన వీర్రాజు మాట్లాడుతూ విద్యార్దులు ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలని అన్నారు. ఆ లక్ష్యం కోసం కృషి చేయాల్సిన కోరారు. అనంతరం విద్యార్దులకు స్నాక్స్ అందించారు.
ఈ కార్యక్రమంలో మాధ్స్ టీచర్ పవన్ కుమార్, కో ఆర్డినేటర్ కె.అరుణ, కృష్ణ, రొంగల అరుణ, శ్యామ్ కుమార్. కె.రవి కుమార్ తదితరులు పాల్గోన్నారు.











0 Comments