పాఠశాల మార్గం సరిచేయ్యండి అంటూ సచివాలయంలో ఎస్.ఎఫ్.ఐ వినతి

 


కాకినాడజిల్లా,పెద్దాపురం పట్టణం, సామాజిక స్పందన:

పెద్దాపురం 24వ వార్డులోని రాజీవ్ గాంధీ మున్సిపల్ అప్పరై ప్రైమరీ పాఠశాల మార్గం లో బురద మయంగా ఉండడంతో విద్యార్దులు వెళ్ళలేని పరిస్దితి ఏర్పడుతుందని వెంటనే మార్గాన్ని సరిచేయ్యాలని కోరుతూ పాఠశాల విద్యార్దులతో కలిసి ఎస్.ఎఫ్.ఐ ఆధవర్యంలో సచివాలయంలో వినతిపత్రం అందజేసారు. 


ఈ సందర్బంగా ఎస్.ఎఫ్.ఐ మండల కార్యదర్శి రొంగల అరుణ్ మాట్లాడుతూ నాడు నేడు లో భాగంగా పాషశాలలను అభివృద్ది చేస్తున్నామని ఒకపక్క చెబుతూనే మరో పక్క పాఠశాలల్లోకి విద్యార్దులు వచ్చే మార్గాలు సరిచేయ్యడం లేదన్నారు. 24వ వార్డు పాఠశాలకు ఇరువైపులా కాలువలు మూసుకుపోయి నీరు వెళ్ళకుండా దారి మార్గం మూసుకుపోయిందని అన్నారు. విద్యార్దులతో పాటు తల్లి తండ్రులు, ఉఫాద్యాయులు కూడా వెళ్ళలేని దుస్ధితి ఏర్పడిందని అన్నారు. మున్సిపల్ అధికారులు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. విద్యార్దుల దారి మార్గం సరిచేయ్యకుంటే విద్యార్దులతో మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రోజా, మనోహర్ తదితరులు పాల్గోన్నారు.


@@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@


ప్లాస్టిక్ కవర్లు నిషేధిస్తూ, పెద్దాపురం పురపాలక సంఘం పబ్లిక్ నోటీసు


సామాజిక స్పందన: పెద్దాపురం

కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో ప్లాస్టిక్ కవర్లు నిషేధిస్తూ పెద్దాపురం పురపాలక సంఘం అధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాస్టిక్ వేస్ట్ నిర్వహణ రూల్స్ 2016 అనుసరించి జారీ చేసిన మినిస్టరీ ఆప్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ మరియు క్లైమేట్ చేంజ్ న్యూ ఢిల్లీ ఇండియా వారి గెజిట్ నోటిఫికేషన్ నెం.GSR no.571(E), తేదీ: 12-08-2021 ప్రకారం మరియు పురపాలక సంచాలకులు గుంటూరు వారి సర్క్యులర్ మరియు మున్సిపల్ కౌన్సిల్ పెద్దాపురం పురపాలక సంఘం వారి తీర్మానం ప్రకారం పెద్దాపురం పట్టణంలో 01-09-2021 నుండి 75 మైక్రోనుల లోపు మందం కలిగిన అన్నీ రకాల ప్లాస్టిక్ కవర్లు నిషేధించడం జరిగింది. అదేవిధంగా 31.12.2022 తేదీ నుంచి 125 లోపు మిక్రోనులు మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లు కూడా నిషేదించబడినది అని సమాచారం.

అదేవిధంగా గా ఈ ఉత్తర్వుల ప్రకారం 75 మరియు 125 మిక్రొనులు లోపు మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లు ఆయా తేదీ నుండి పూర్తిస్థాయిలో నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్రింద ఉపయోగించే వస్తువులు అనగా ప్లాస్టిక్ ఎయిర్ బర్డ్స్ ప్లాస్టిక్ జెండాలు, ప్లాస్టిక్ తీపి పదార్థాలకు ఉపయోగించే ప్లాస్టిక్ స్టిక్స్ , స్పూన్స్, మొదలైనవి జూన్ 1వ తేదీ 2022 నుండి ఇ పూర్తిగా నిషేధించడమైనది అని పెద్దాపురం సంఘం అధికారులు తెలియజేశారు అదేవిధంగా ఈ ఆదేశాల ప్రకారం షాపులలో ఉన్నటువంటి నిషేధించబడిన ప్లాస్టిక్ను తొలగించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా పురపాలక సంఘం సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిషేధించబడిన ప్లాస్టిక్ కొనడం వాడడం మరియు నిర్వహించడం జరుగుతున్నట్లు కనుగొనబడినచో జరిమానా విధించి చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని పెద్దాపురం పురపాలక సంఘం అధికారులు తెలియజేశారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.