సామాజిక స్పందన: అమరావతి
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ -2022 ఫలితాలు వచ్చేశాయ్. బుధవారం మధ్యాహ్నం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు.
ఫస్టియర్‌లో 2,41,591 మంది పాస్ కాగా, ఫస్టియర్‌లో 54 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. సెకండియర్‌లో 2,58,449 మంది పాస్ కాగా, 61 ఉత్తీర్ణత శాతం రికార్డు అయ్యింది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది.
రికార్డు స్థాయిలో 28 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. జవాబు పత్రాల మూల్యాంకనాన్ని వేగంగా, జాగ్రత్తగా పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను ఈ క్రింద ఇచ్చిన లింక్ లో చూడొచ్చు.
Click Here for Results
@@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@
ఏపీ టెన్త్ ఫలితాలు వచ్చేశాయ్, రిజల్ట్స్ తెలుసుకునే వెబ్సైట్ ఇదే !
సామాజిక స్పందన: అమరావతి
ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు.మొత్తం 6,15,908 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. వారిలో 4,14,281 మంది పాసయ్యారని మంత్రి వెల్లడించారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారని చెప్పారు. ఫలితాల్లో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో.. అనంతపురం జిల్లా చివరి స్థానంలో నిలిచినట్లు బొత్స చెప్పారు. కాసేపట్లో ఫలితాలను దిగువ లింక్‌లో చూడొచ్చు.పదో తరగతి పరీక్షల కోసం మొత్తం 6,22,537 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. వారిలో బాలికలు 3,02,474 మంది, బాలురు 3,20,063 మంది ఉన్నారు. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పరీక్షలు నిర్వహించారు. మే 13 నుంచి ప్రశ్నపత్రాల మూల్యాంకనం చేపట్టారు. రెండేళ్ల తర్వాత మొదటిసారిగా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వహించింది. మొదటిసారిగా విద్యార్థుల మార్కులను ప్రకటిస్తున్నారు. ర్యాంకుల ప్రచారంపై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.
Click here for Results











0 Comments