మరో చెరువును మింగేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడు అప్పారావు, తమ భూములను కూడా లాక్కున్నాడని పెద్ద మదిన గ్రామం దళితులు.




బుచ్చయ్య పేట అనకాపల్లి జిల్లా, సామాజిక స్పందన:
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పెద్ద మదిన గ్రామంలో ఒక టిడిపి నాయకుడు రెండు మూడు గ్రామాలలో ఉన్న ప్రభుత్వ భూములను బలహీన వర్గాల భూములను కబ్జాలు చేస్తూ లాక్కొని దర్జాగా ప్రజా ప్రతినిధి లాగా చలామణి అవుతున్నాడని పెద్ద మదిన చిన్న మదిన గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిపై తన అనుచరులతో దాడులు చేయిస్తాడని అలాగే గతంలో బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన మహిళ భూమిను కబ్జా చేస్తే ఆ మహిళ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసి వచ్చినప్పటికీ ఆ మహిళపై వారి కుటుంబ సభ్యులపై దాడులు చేయించాడని అయితే బ్రాహ్మణ కుటుంబం సంబంధించిన మహిళ ఈ వ్యక్తిపై ఫిర్యాదు చేసి జిల్లా ఎస్ పి దగ్గర కూర్చోబెట్టిన విషయం అప్పట్లో పత్రికలలో ప్రచురించారని గ్రామస్తులు తెలిపారు. అలాగే గతంలో మరో పత్రికలో అప్పారావు చేస్తున్న కబ్జాలను ఆక్రములను ప్రచురించడంతో అప్పటి తహసిల్దార్ శివ ఈయన కబ్జా చేసిన ప్రభుత్వ భూములకు ఈయన బినామీలకు భూములు ఖాళీ చేయమని నోటీసులు పంపించారని అయితే అప్పారావు నోటీసులు తీసుకోకుండా తిరస్కరించడంతో అధికారులు గ్రామపంచాయతీ కార్యాలయంకు నోటీసులు అతికించి వెళ్లిపోయారని గ్రామస్తులు తెలిపారు.

అయితే ఈయనకు ఉన్న రాజకీయ పలుకుబడితో కప్పిపుచ్చుకున్నాడని ఈ వ్యక్తిపై ఎంతోమంది బాధితులు ఫిర్యాదులు చేసిన స్పందన లేకపోవడంతో నిరాశతో నలిగిపోతున్నారని స్థానికులు తెలుపుతున్నారు అలాగే ఇప్పటికైనా స్థానిక రెవెన్యూ అధికారులు దృష్టి సారించి ఈ వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ భూకబ్జా కేసులు నమోదు చేసి ఈ భూ బకాసురుడు నుండి మమ్మల్ని కాపాడాలని స్థానిక గ్రామ ప్రజలు దళితులు కోరుతున్నారు..

@@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@

కాకినాడ జిల్లాలో అధిక సంఖ్యలో జైభీమ్ భారత్ పార్టీలోకి చేరిన సభ్యులు


కాకినాడ జిల్లా, సామాజిక స్పందన:

జైభీమ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షులు జగ్గారపు మల్లిఖార్జున (న్యాయవాది) ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కార్యాలయం నందు భారీగా యువత పార్టీలోకి చేరడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మల్లిఖార్జున మాట్లాడుతూ జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు, మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా వ్యాప్తంగా పార్టీలోకి ప్రజలని ఆహ్వానిస్తున్నామన్నారు.

జైభీమ్ భారత్ పార్టీ అన్ని కులాలకు, మతాలకు, ప్రాంతాలకు సంబంధించిన పార్టీఅని, ప్రజానాయకుడు శ్రావణ్ కుమార్ గారు స్థాపించిన జైభీమ్ భారత్ పార్టీలోకి ప్రజలందరూ వచ్చి పార్టీని మరింత బలోపేతం చేయాలని అన్నారు. 

జైభీమ్ భారత్ పార్టీ ఏ ఒక్క కులానికో మతానికో సంబంధించింది కాదని కుల మతాలకు అతీతంగా ఈరోజు పార్టీలోకి బ్రాహ్మణలు, వైశ్యులు, కాపులు, పద్మశాలీలు, ఎస్సీ ఎస్టీ వారు అధిక సంఖ్యలో వచ్చారని, వీరిని ఆదర్శంగా తీసుకొని మరింత మందికి ముందుకు రావాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షులుగా పేంకే వెంకటరమణ

జిల్లా కోశాధికారిగా గుగ్గిలపు హరీష్

జిల్లా యూత్ ప్రెసిడెంట్ గా జగ్గారపు గణేష్ స్వామి

జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జిగా గొట్టాల నరేంద్ర కుమార్

పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జిగా చింతలపాటి సురేష్ పెద్దాపురం మండలం ఉపాధ్యక్షులుగా కొప్పర్తి సాయి కృష్ణ గార్లను నియమించడం జరిగింది.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.