ఆంధ్రప్రదేశ్, సామాజిక స్పందన:
ఎడతెరిపి లేకుండా గత ఆరు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండి కట్టలు తెగిపోయి వరద నీరు గ్రామాల్లోకి వచ్చి చేరుతోంది.అయితే.. ఈ నేపథ్యంలోనే… భారీ వర్షాల కారణంగా.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. భారీగా వరద వస్తుండటంతో ఉదయం 7 గంటలకు 51.20 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. మంగళవారం ఉదయం నుంచి తగ్గుముఖం పట్టిన గోదావరితో వరద మళ్లీ పెరిగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ప్రస్తుతం 13,31,102 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండగా… గోదావరి వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ఇదిలా ఉంటే.. భారీగా వరద పోటెత్తడంతో రామాలయం పడమరమెట్ల వద్ద నీరుచేరింది. ఆలయ దుకాణాలు వరద నీటిలో మునిగాయి. అన్నదాన సత్రంలోకి వరద నీరుచేరడంతో భక్తులకు అన్నదానం నిలిపివేశారు అధికారులు. ఇక భద్రాచలంలోని కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ ప్రాంతాల్లో వరద ప్రవహిస్తుండడంతో అధికారులు కాలనీవాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. అంతేకాకుండా పరిసర గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@
ట్రాఫిక్ నియమాలు పాటించాలి, మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాలు
మెదక్ జిల్లా: సామాజిక స్పందన
మెదక్ జిల్లా యెస్.పి రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ ఆదేశానుసారం రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ నియమాలను గురించి, జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జిల్లా డి.సి.ఆర్.బి సి.ఐ శ్రీ.బి.రవీందర్ మాట్లాడుతూ... చాలా వరకు రోడ్డు ప్రమాదాలు అతివేగం, ట్రాఫిక్ నియమాలను అనుసరించకపోవడం వల్ల జరుగుతున్నాయని అన్నారు. విదిగా ప్రతి వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణలో బాగస్వాములు కావాలని అన్నారు. చేగుంట పోలీసు స్టేషన్ పరిది బొమ్మారం గెట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద కారణాలను తెలియజేస్తూ 06.06.2022 న తెల్లవారుజామున 05:00 గంటలకు దాదాపు 35 సంవత్సరాల వయస్సు గల ఒక వ్యక్తి జాతీయ రహదారి NH-44 పై సమీపంలోని బొమ్మారం గేట్ నుండి మాసాయిపేట వైపు నడుచుకుంటూ వెళుతు రోడ్డు దాటే సమయంలో ఒక గుర్తు తెలియని వాహన డ్రైవర్ తన వాహనాన్ని అజాగ్రత్తగా మరియు నిర్లక్ష్యంగా నడుపుతూ టక్కరు ఇవ్వగా అతడి రెండు మోకాళ్లపై రక్తస్రావమైన గాయాలు అయ్యాయని, చికిత్స పొందుతూ అతడు మరణించాడని అన్నారు. ఈ ప్రమాదాన్ని మరోసారి గమనించినట్లైతే 1) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి రోడ్డున ప్రయాణించే వాహనాలను గమనించకపోవడం. 2). తెల్లవారుజాము, రాత్రిళ్ళు వెలుతురు తక్కువగా ఉండటం. కాబట్టి పాదాచారులు వాహనదారులు రోడ్డుపై వెళ్ళేటప్పుడు తమ చుట్టూ పక్కల ప్రయాణించే వాహనాలను గమనించాలని ఏ వాహనం రానప్పుడు మాత్రమే రోడ్డు దాటే ప్రయత్నం చేయాలని, తెల్లవారుజాము, రాత్రిళ్ళు వెలుతురు తక్కువగా ఉన్నప్పుడే ప్రయాణించాల్సి వస్తే మీ చుట్టూ పక్కల వాహనాలను, పాదాచారులను, జంతువులను గమనిస్తూ నెమ్మదిగా వెళ్లాలని గ్రామాల గుండా ప్రయాణించాల్సి వచ్చినప్పుడు నేమ్మదిగా వెళ్లాలని తమ వాహనాలను నిర్ణీత వేగంలో నడపాలని రోడ్డు పై నడుచుకుంటూ వెళ్లే పదాచారులు రోడ్డున ప్రయాణించే వాహనాలను గమనించనించాలని, అలాగే ప్రతి వాహనదారుడు అతివేగంగా వాహనాలను నడపవద్దని ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యాన్ని చేరాలని అన్నారు
@@@@@@@@ మరిన్ని వార్తలు@@@@@@
ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఘనంగా అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహ ఆవిష్కరణ
భీమవరం, సామాజిక స్పందన
ఏపీ త్యాగవీరులు, మహనీయుడు పుట్టిన పుణ్యభూమి అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భీమవరంలోని ఏఎస్ఆర్ నగర్ లో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లూరి కుటుంబ సభ్యులను ప్రధాని మోడీ సన్మానించారు. పెద్ద అమిరంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ… జాతీయ జెండాను రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు వంటి మహనీయులు ఇక్కడ పుట్టారన్నారు. అల్లూరికి దేశం తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నామన్నారు. మొఘల్లులోని ధ్యాన మందిరం, చింతపల్లి పోలీస్ స్టేషన్ ను డెవలప్ చేస్తామన్నారు.
0 Comments