తెలంగాణ, సామాజిక స్పందన
తెలంగాణ ములుగు జిల్లా నియోజకవర్గ శాసన సభ్యురాలు సీతక్క మరొకసారి తన దాతృత్వం చాటుకున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా మూలుగు జిల్లా ప్రజలు అనేక సమస్యలతో విలవిలాడుతున్నారు వారి సమస్యలు తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సీతక్క ములగు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. భారీ వర్షాల కారణంగా కాలువల్లో నీటి ప్రవాహం అధికంగా ఉండటం వల్ల కొండాయి బ్రిడ్జి కూలిపోయే స్థితికి వచ్చింది, దానివల్ల బ్రిడ్జి పై నుండి రాకపోకలు నిలిచిపోయాయి. కొండయ్య బ్రిడ్జిని పరిశీలించిన సీతక్క తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజల కష్టాలను గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మంగపేట రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న బాధితులను పరామర్శించి వారికి కావలసిన వసతులను ఏర్పాటు చేశారు అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. సీతక్క అందించిన సహాయ సహకారాలు అందుకున్న ములుగు జిల్లా ప్రజలు ప్రజా నాయకురాలు అంటే సీతక్క లాగే ఉండాలి అని ఎమ్మెల్యే సీతక్కను స్థానిక ప్రజలు ప్రశంసించారు.










0 Comments