అమరావతి, సామాజిక స్పందన:
భారత 16వ రాష్ట్రపతి ఎన్నికలు 2022లో జరగనున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగియనుంది. నూతన రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జులై 18న నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బరిలో దింపగా.. విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీపడుతున్నారు. ఇక 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఏపీ అసెంబ్లీలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల విధుల నిర్వహణకు 50 మందికి పైగా అసెంబ్లీ సిబ్బందిని కేటాయించారు. అంతకంటే ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది.










0 Comments