చీమకుర్తి, సామాజిక స్పందన
వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించాకే ఎన్నికలకు వెళ్తామని ఏపీ సీఎం జగన్ చెప్పారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. 2023 సెప్టెంబరులో వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. ప్రాజెక్టు రెండు టన్నెళ్ల పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. గ్రానైట్ పరిశ్రమలో మళ్లీ 'స్లాబ్ సిస్టమ్' తీసుకొస్తున్నట్లు సీఎం వెల్లడించారు. విద్యుత్ ఛార్జీల్లోనూ రాయితీ ఇచ్చి చిన్న పారిశ్రామికవేత్తలను ఆదుకుంటామని జగన్ చెప్పారు.
############## మరిన్ని వార్తలు #############
శాఖలకు సలహాదారులేంటి? జీవోపై హైకోర్టు స్టే
అమరావతి, సామాజిక స్పందన:
ఏపీ దేవాదాయశాఖకు సలహాదారుగా జె.శ్రీకాంత్ నియామకంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఈ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. శ్రీకాంత్ నియామకాన్ని సవాల్ చేస్తూ ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.''ఇలానే వదిలేస్తే రేపు అడ్వొకేట్ జనరల్‌కు కూడా సలహాదారును నియమిస్తారు. సలహాదారులను నియమించుకునేందుకు ప్రభుత్వంలో అధికారుల కొరత ఉందా? సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులకు సలహాదారులంటే అర్థం ఉంటుంది.. శాఖలకి సలహాదారులేంటి?'' అని ప్రభుత్వ న్యాయవాదిని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అనంతరం జీవో నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.











0 Comments