సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ లో మాల మహానాడు సమావేశం సుప్రీంకోర్టు కొట్టివేసిన వర్గీకరణ అంశం పై చర్చ


సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సామాజిక స్పందన:
 సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ ప్రెస్ క్లబ్ నందు మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు జంజిరపు ఎల్లేష్ గారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మల మహానాడు జాతీయ అధ్యక్షులు శ్రీ జి చెన్నయ్య గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నే శ్రీధర్ రావు గారు హాజరయ్యారు. ఈ సందర్బంగా చెన్నయ్య గారు మాట్లాడుతూ కాలం చెల్లిన, సుప్రీంకోర్ట్ కొట్టేసిన వర్గీకరణ అంశంపై మందకృష్ణ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మాలల జోలికి వస్తే గతంలో చంద్రబాబు నాయుడు గతి ఏమైందో అందరికి తెలిసిన విషయమే, తమ స్వార్థ రాజకీయాల కోసం మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టి రాజ్యాధికారానికి దూరం చేయడమే అని సుప్రీంకోర్టు కొట్టివేసిన వర్గీకరణ అంశం అని అన్నారు. అదే విధంగా దళితబంధు పథకంలో మాలలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం గజ్వెల్ డివిజన్ అధ్యక్షునిగా మన్నే శేఖర్, దుబ్బాక నియోజక వర్గ అధ్యక్షునిగా మానేరు నాగరాజు గారిని నియమించి నియామక పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా యువత ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా మాల మహానాడు కమిటీలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు చెన్నయ్య గారిని మరియు మన్నే శ్రీధర్ గారిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిద్ధిపేట డివిజన్ ప్రధాన కార్యదర్శి అల్లం పరమేష్, బెజ్జంకి మండల్ అధ్యక్షులు రూపేష్, కొండపాక యువత అధ్యక్షులు అమ్ముల వంశీ, మధు, అమర్, చంద్రం, నరేష్, పవన్, రాజేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




నా రాజీనామాతో ఉప ఎన్నిక వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అంటున్న నల్గొండ జిల్లా, మునుగోడు ఎమ్మెల్యే 




నల్గొండ జిల్లా, మునుగోడు, సామాజిక స్పందన : 
శాసనసభాపతిని కలిసి సోమవారం తన రాజీనామా లేఖను సమర్పించనున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా చండూరులో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. స్పీకర్‌ను కలిసే అవకాశం ఇవ్వకుంటే కొన్ని రోజులు వేచి చూసి నేరుగా అసెంబ్లీ కార్యదర్శితో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి తన రాజీనామా పత్రాన్ని పంపిస్తానని చెప్పారు. ‘‘మూడున్నర ఏళ్లుగా నా నియోజకవర్గానికి నిధులు ఇవ్వకపోవటంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదు. అందుకే రాజీనామా చేస్తున్నా. నియోజకవర్గంలోని చండూరు, చౌటుప్పల్‌ పురపాలికల్లో కనీస సౌకర్యాలు కరవయ్యాయి. అదే సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌ పురపాలికలను అయితే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు. అది ఇక్కడి ప్రజలకు అర్థం కావటానికి త్వరలో బస్సులు ఏర్పాటు చేసి అక్కడికి తీసుకెళ్తా. నా రాజీనామాతో ఉప ఎన్నిక వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది’’ అని అన్నారు.

@@@@@@@@మరిన్ని వార్తలు@@@@@@@

సినీ ప్రముఖుల ఇళ్లల్లో ఐటీ సోదాలు, రూ.200కోట్ల 'నల్లధనం' గుర్తింపు

తమిళనాడు, సామాజిక స్పందన :

ఇటీవల తమిళనాడు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్ల ఇళ్లలో ఆదాయపు పన్నుశాఖ సోదాలు (IT Raids) నిర్వహించింది.ఈ సోదాల్లో పెద్ద ఎత్తున 'నల్లధనం' గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ CBDT) శనివారం వెల్లడించింది. ఈ సోదాల్లో రూ.200 కోట్లకు పైనే 'లెక్కల్లో వెల్లడించని' ఆదాయాన్ని గుర్తించినట్లు సీబీడీటీ తెలిపింది.

ప్రముఖ సినీ నిర్మాతలు కలైపులి ఎస్‌.థాను, అన్బుసెళియన్‌, ఎస్‌ఆర్‌ ప్రభు, జ్ఞానవేల్‌ రాజా తదితరుల కార్యాలయాల్లో గత మంగళవారం (ఆగస్టు 2) నుంచి మూడు రోజుల పాటు ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. చెన్నై, మదురై, కొయంబత్తూర్‌లోని మొత్తం 40 చోట్ల ఈ తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని రూ.26కోట్ల నగదు రూ.3కోట్ల విలువైన బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

దీంతో పాటు రూ.200కోట్లకు పైగా అప్రకటిత ఆదాయాన్ని గుర్తించినట్లు సీబీడీటీ తెలిపింది. లెక్కల్లో వెల్లడించని ఈ ఆదాయానికి సంబంధించిన కీలక పత్రాలు, డిజిటల్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. నిర్మాతల ఇళ్లల్లో చేసిన తనిఖీల్లో సినిమాల విడుదల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తక్కువగా చూపించినట్లు అధికారులు గుర్తించారు. అంతేగాక, సినిమా డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి ఆ మొత్తాన్ని లెక్కల్లో చూపించలేదని వెల్లడించారు.

ముఖ్యంగా నిర్మాత అన్బుసెళియన్‌కు చెందిన చాలా ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. అతని బంధువులు, సన్నిహితుల నివాసాలు, మదురై, చెన్నైలోని అతని కార్యాలయాలు, సినిమా థియేటరు తదితర ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరిపారు. అన్బుసెళియన్‌ నిర్మాత, పంపిణీదారుడు, ఫైనాన్షియర్‌, సినిమా హాల్స్‌ తదితర పలు వ్యాపారాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన లెజెండ్‌ సినిమాను అన్బుసెళియన్‌ పంపిణీ చేసినట్లు సమాచారం. గతంలో రెండేళ్ల క్రితం ఆయన ఇళ్లు తదితర చోట్ల ఐటీ సోదాలు నిర్వహించారు. అప్పుడు రూ.70 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక, కలైపులి ఎస్‌.థాను నిర్మించిన కబాలి, అసురన్‌, కర్ణన్‌ సినిమాలు మంచి వసూళ్లు సాధించారు. ప్రముఖ నటుడు సూర్య బంధువు అయిన ఎస్‌ఆర్‌ ప్రభు గతంలో కార్తి నటించిన ఖైదీ, సూర్య నటించిన ఎన్‌జీకే సినిమాలను నిర్మించారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.