పెద్దాపురం మం, చినబ్రహ్మదేవం, సామాజిక స్పందన
కాకినాడ జిల్లా, పెద్దాపురం మండల రూరల్, చినబ్రహ్మదేవం గ్రామ సరిహద్దులో , మర్రిపూడి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్మిస్తున్న గొదావరి బయో మెడికల్ వేస్టేజ్ ఫ్యాక్టరీని ఆపు చేయలంటు నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలకు మద్దతుగా CPM పార్టీ, కాకినాడ జిల్లా కార్యవర్గ సభ్యులు కారణం ప్రసాద్, పెద్దాపురం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు, కంచుమర్తి కాటమరాజు నిరసన కార్యక్రమాలు చేస్తున్న ప్రాంతానికి వెళ్ళి మద్దతు తెలియచేసారు.
2017 నుండి ఈ ప్రాత ప్రజలు ఈ నిర్మాణాన్ని ఆపుచేయవలిసిందిగా కోరుతున్న అడ్డదారిలో అనుమతులు తెచ్చుకుని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది అని అన్నారు, ప్రజలు అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్మిస్తున్న నిర్మాణానికి వ్యతిరేకంగా మా పార్టీ కట్టుబడి ఉందని అన్నారు,
న్యాయస్థానాలు,ప్రజ ప్రతినిధులు ప్రజలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు,
ఎప్పుడైనా ఎక్కడైనా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు మద్దతుగా మీము పని చేస్తామని తెలిపారు,
ప్రభుత్వం తక్షణమే ఈ ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్మిస్తున్న గొదావరి బయో మెడికల్ వేస్టేజ్ ఫ్యాక్టరీని ఆపు చేయలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం కల్పించుకోకపోతే ప్రజలు చేపట్టిన సమైక్య పోరాటానికి మీము కల్పించుకుని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు..










0 Comments