చిన్నారులకు దోమ తెరల పంపిణీ చేసిన మన పెద్దాపురం గ్రూప్



పెద్దాపురం, సామాజిక స్పందన :

కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం లో యువత కొన్ని సంవత్సరాలుగా అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలలో భాగంగా 
ప్రాణాంతక డెంగ్యూ మహమ్మారి నివారణ చర్యల్లో భాగంగా మన పెద్దాపురం గ్రూప్ ఆద్వర్యంలో పాత పెద్దాపురం 3 వ వార్డు కట్టమూరు పుంత వద్ద ఉన్న అంగన్ వాడీ కేంద్రంలో చిన్నారులకు దోమతెరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్స్ k.దేవి, M. మంగయ్యమ్మ మరియు మన పెద్దాపురం గ్రూపు సభ్యులు నరేష్ పెదిరెడ్డి, తోట నవీన్ నానీ, కోరుకొండ సత్య ప్రశాంత్, నెల్లూరి హర్ష, చల్లా జయశ్రీ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ దోమ తెరలను స్పాన్సర్ చేసిన సేవన్ హిల్స్ పేపర్ మిల్ చైర్మన్ పసల పద్మ రాఘవరావు గారికి గ్రూప్ తరుపున ధన్యవాదాలు తెలియచేశారు..

##############  మరిన్ని వార్తలు  ##########


సామర్లకోట పట్నంలో అజాద్ కా అమ్రత్ మహోత్సవ్ కార్యక్రమం 


 కాకినాడ జిల్లా, సామర్లకోట, సామాజిక స్పందన:

సామర్లకోట మెహర కాంప్లెక్స్ వద్ద శనివారం నాడు శ్రీ వివేకానంద్ ఇంగ్లీషు మీడియం స్కూల్, డైరెక్టర్ BA.S. సరోజని వారి ఆధ్వర్యంలో అజాద్ కా అమ్రత్ మహోత్సవ్ కార్యక్రమములో "భాగంగా, సామర్లకోట పట్నం లో శ్రీ వివేకనంద ఇంగ్లీషు మీడియం స్కూల్ విద్యార్థులు ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు సత్తమ్మ తల్లి గుడి సెంటర్లో మనోహర నిర్వహించి ఎండిఓ ఆఫీస్ వరకు భారి ర్యాలి నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు స్వాతంత్య్ర గోప్ప త్యాగ ఫలితాన్ని గూర్చి స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థినిలు విద్యార్థులు ద్వారా వివరించడం జరిగింది.


@@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@


మున్సిపల్ వర్కర్స్ కి రైన్ కోట్ లు ఇవ్వండి అంటూ  మున్సిపల్ కమిషనర్ కి సిఐటియు వినతి

పెద్దాపురం, సామాజిక స్పందన:

     పెద్దాపురం పురపాలక సంఘంలో శానిటేషన్, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్ లో దాదాపు 100 మంది పైబడి పని చేస్తున్నారని  పురపాల సంఘం అప్పగించిన పనిని ఎండనకా, వాననకా, చలిని తట్టుకుంటూ పని చేస్తున్నారని వీరికి వెంటనే రెయిన్ కోట్ లు మున్సిపాల్టి పంపిణి చేయాలని ఎ.పి మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు) ఆద్వర్యంలో మున్సిపల్ కమిషనర్ జె.సురేంద్రకు వినతిపత్రం అందజేసారు. ఈ సందర్బంగా శివకోటి అప్పారావు, వెంకటరమణ మాట్లాడుతూ ఇప్పుడు వర్షాకాలం జరుగుతుందని, ఇప్పటికే వర్షాలు తీవ్రంగా పడుతున్నాయని, వర్షంలో తడిస్తే అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. కానీ పెద్దాపురం మున్సిపాల్టిలో పని చేస్తున్న వర్కర్లు ఎవరికి కూడా రెయిన్ కోట్ లు ఇవ్వడం లేదని అన్నారు.  వర్షం పడుతున్నా పని పూర్తికావాలి గనుక తడుస్తూనే పని చేస్తున్నారని అన్నారు. మున్సిపాల్టి నుండి తక్షణం రెయిన్ కోట్ లు శానిటేషన్, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ విభాగాల్లో పని చేస్తున్న వర్కర్స్ కి ఇవ్వాలని డిమాండ్ చేసారు. మున్సిపాల్టిలో పని చేస్తున్న వర్కర్స్ ఆరోగ్యంగా ఉంటేనే పురపాలక సంఘం పనులు బాగా జరుగుతాయని గుర్తించాలని కోరారు. 

   ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు డి.క్రాంతి కుమార్, బాసిన భధర్రావు, వర్రే నాగ దుర్గారావు, దుర్గా ప్రసాద్, దొండపాటి సురేష్ తదితరులు పాల్గోన్నారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.