అమరావతి, సామాజిక స్పందన
టీడీపీ పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.''పిల్లలను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే మహత్కార్యాన్ని నిర్వర్తిస్తోన్న గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. గురువును దైవంగా భావించే సమాజం మనది. తలెత్తుకు జీవించే గౌరవ స్థానంలో ఉండే ఉపాధ్యాయులు ఏపీలో నేడు ప్రభుత్వ కక్ష సాధింపుకు గురవుతుండటం దురదృష్టకరం'' అని అన్నారు.గురుపూజోత్సవం వేళ గురువులకు జీతాల చెల్లింపు చేయక పోవడమే ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవమా? అని ప్రశ్నించారు. ''సీపీఎస్ రద్దు కోసం అడగకూడదు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీని అప్పుకోసం తాకట్టు పెట్టినా నోరెత్తకూడదా'' అంటూ ధ్వజమెత్తారు. విద్యాశాఖలో సంస్కరణల పేరుతో తెచ్చిన సంక్షోభానికి ప్రభుత్వం తెరదించాలని, విద్యా వ్యవస్థపై బాధ్యతగా, విద్యను అందించే గురువులపై గౌరవంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు..










0 Comments