కాకినాడ జిల్లా, సామాజిక స్పందన
ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులు అమరావతి నుండి అరసవల్లి వరకు చేపట్టిన మహా పాదయాత్రలో 18వ తారీకు ఆదివారం నాడు వేలాది సభ్యులు, కార్యకర్తలతో పాల్గొంటున్న జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్.
ఈ సందర్భంగా జైభీమ్ భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మరియు న్యాయవాది జగ్గారపు మల్లిఖార్జున మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని రైతులు సుమారు 1000 రోజుల నుండి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పాదయాత్రలు చేయడం అభినందనీయం అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలనీ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా వచ్చే ప్రభుత్వంలో జైభీమ్ భారత్ పార్టీ కీలకపాత్ర పోషిస్తుందనీ, రాజధానిని అమరావతి గానే కొనసాగిస్తామని తెలిపారు.
18 వ తారీకు ఆదివారం నాడు గుంటూరు జిల్లా మీదుగా జరిగే రాజధానిరైతుల పాదయాత్రలో నగరం గ్రామం నుండి రేపల్లె గ్రామం వరకు జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ గారితో అన్ని జిల్లాల నుండి పార్టీ సభ్యులు, కార్యకర్తలు వేలాది సంఖ్యలో పాల్గొనాలని మల్లిఖార్జున పిలుపునిచ్చారు.
########## మరిన్ని వార్తలు చదవండి #######
మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం: మంత్రి గుడివాడ అమర్ నాధ్
విశాఖపట్నం, సామాజిక స్పందన :
విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలన్నది సీఎం జగన్ ఆలోచన అని, మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని మంత్రి గుడివాడ అమర్‌నాధ్ పేర్కొన్నారు.శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అమరావతి వివాదాలు, వాస్తవాలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతిపక్షనేత చంద్రబాబు, పలు రాజకీయ నేతలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని విమర్శించారు. రాష్ట్రంలో 29 గ్రామాలు తప్పితే.. మిగిలిన జిల్లాలు అవసరం లేదా? అని ప్రశ్నించారు.
అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తామని రైతులు అంటున్నారని, విశాఖకు రాజధాని వద్దని చేస్తున్న పాదయాత్ర ఇదని.. ఇది దండయాత్రేనని అన్నారు. ఉత్తరాంధ్రపై దండయాత్ర చేస్తే.. ప్రజలు చూస్తూ ఊరుకోరని మంత్రి గుడివాడ అమర్ నాధ్ అన్నారు.
0 Comments