సామాజిక స్పందన, పెద్దాపురం పట్టణం
పెద్దాపురం పట్టణంలో ఈ నెల 29,30, అక్టోబర్ 11వ తేదీన 3 రోజు పాటు కాకినాడ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని ఎ.పి. బిల్డింగ్ అధర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా అధ్యక్షులు గడిగట్ల సత్తిబాబు పిలుపునిచ్చారు. మహాసభల ఏర్పాట్ల సమిక్ష సమావేశం ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు చింతల సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సత్తిబాబు మాట్లాడుతూ జిల్లాలు విడిపోయిన తరువాత మొదటి సారి మహాసభలు నిర్వహణ చేస్తున్నామని వీటిని జయప్రదం చేయాలని అన్నారు. జిల్లాలో 21 మండలాల నుండి గ్రామాల వారి ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. 29 వ తేదీన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను ప్రతిబింబించే ఫోటో ఎగ్జిబిషన్ మెయిన్‌రోడ్ వినాయకుని గుడి సెంటర్‌లో జరుగుతుందని అన్నారు. ఈ ఎగ్జిబిషన్‌ను సిఐటియు జిల్లా కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ ప్రారంభిస్తారని అన్నారు. 30 వతేదీన కళారూపాల ప్రదర్శన, అక్టొబర్ 1వ తేదీన ప్రతినిధుల సభ యాసలపు సూర్యారావు భవన్‌లో జరుగుతుందని అన్నారు. ఈ మహాసభలకు రాష్ట్ర నాయకులు హాజరువుతన్నారని అన్నారు. 1వ తేదీ ఉదయం ప్రతినిధుల సభ అయిన తరువాత పెద్దాపురం పట్టణంలో ర్యాలీ జరుగుతుందిని తెలిపారు. ఈ సమావేశంలో శ్రీ మరిడమ్మ తల్లి పెయింటింగ్ యూనియన్ నాయకులు తైనాల శ్రీను, గూనూరి రమణ, రాజమంద్రపు రామారావు, పాండవగిరి పెయింటింగ్ యూనియన్ నాయకులు నీలం శ్రీను, కరణం అప్పారావు, గడపా వీరబాబు, సిఐటియు నాయకులు డి.క్రాంతి కుమార్ తదితరలు పాల్గోన్నారు...











0 Comments