పెద్దాపురం, సామాజిక స్పందన
విశ్వ నరుడు గుర్రం జాషువా జయంతి పురస్కరించుకుని పెద్దాపురం స్థానిక వరహాలయ్య పేటలోని యాసలపు సూర్యారావు భవనంలో జయంతి సభ ఘనంగా జరిగింది. సాహితీ స్రవంతి కోశాధికారి వంగలపూడి శివకృష్ణ అధ్యక్షతన జరిగిన జయంతి సభలో జాషువా సాహిత్యం మరియు వ్యక్తిత్వం పై సాహితీ స్రవంతి కార్యదర్శి కొత్త శివ, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కె.ఎమ్.ఎమ్.ఆర్. ప్రసాద్, సాహితీ స్రవంతి గౌరవ అధ్యక్షులు చల్లా విశ్వనాధం, వినియోగదారుల సంఘం అధ్యక్షుడు భళ్ళమూడి సూర్య నారాయణ, జనవిజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి వి. శ్రీరామరావు, సాహితీ స్రవంతి సామర్లకోట సభ్యులు కెనెడీ తదితరులు ప్రసంగించారు
ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి కళాకారులు దారపురెడ్డి కృష్ణ, రొంగల వీర్రాజు, మహాపాతిన రాంబాబు, జన విజ్ఞాన వేదిక కార్యదర్శి బుద్దా శ్రీనివాస్, యు,టి.ఎఫ్ సభ్యులు కట్టమూరు సూరిబాబు, ఐద్వా సభ్యురాలు కూనిరెడ్డి అరుణ, సీనియర్ పాఠకులు సీతన్న తదితరులు పాల్గొన్నారు.
@@@@ మరిన్ని వార్తలు చదవండి @@@@
ఎస్.ఎఫ్.ఐ, విద్యార్థులు పోరాట ఫలితంగా కట్టమూరు గ్రామం విద్యార్థులకు బస్ సౌకర్యం.
పెద్దాపురం రూరల్ కట్టమూరు, సామాజిక స్పందన
పెద్దాపురం రూరల్ కట్టమూరు గ్రామానికి బస్ సౌకర్యం కల్పించాలని ఎస్.ఎఫ్.ఐ దశల వారి పోరాట ఫలితంగా కట్టమూరు గ్రామానికి ఏలేశ్వరం డిపో బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ), గ్రామ పెద్దలు, విద్యార్థినీ, విద్యార్థులు పూలమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా కట్టమూరు గ్రామ సర్పంచ్ దిమ్మల పుష్పరత్నం, ఉప సర్పంచ్ బండారు చంటిబాబు, ఎంపీటీసీ నల్ల గోవింద్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి రాము, టి రాజా బస్ కి పూలమాలేసి స్వాగతం పలికారు. గ్రామ సర్పంచ్ జండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా కట్టమూరు గ్రామ సర్పంచ్ దిమ్మల నూక రత్నం మాట్లాడుతూ కట్టమూరు గ్రామం కి బస్సు సౌకర్యం కల్పించాలని అనేక దశల వారి పోరాటం చేసి విజయం సాధించిన ఎస్ఎఫ్ఐ బృందాని ముందుగా మనస్ఫూర్తిగా అభినందించారు. కట్టమూరు గ్రామం విద్యార్థిని, విద్యార్థులు బస్సు సౌకర్యం ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఉప సర్పంచ్ బండారు చంటిబాబు ఎంపీటీసీ నల్ల గోవిందు, ఏలేటి అనంతలక్ష్మి మాట్లాడుతూ కట్టమూరు గ్రామం కు బస్సు సౌకర్యం చాలా అవసరం అన్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులను, పెద్దలను, యువకులను కలుపుకొని గ్రామ సమస్యను కలెక్టర్ కృత్తికా శుక్ల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించిన ఎస్ఎఫ్ఐ బృందం ఈ గ్రామం రుణపడి ఉంటుందన్నారు. కట్టమూరు గ్రామం కు బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులందరిని, విద్యార్థులను ఐక్యం చేసి ఎస్.ఎఫ్.ఐ సహకారంతో పోరాడిన గోపాల్ కృష్ణ ను గ్రామ పెద్దలు అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి రాము, టి రాజా మాట్లాడుతూ కట్టమూరు గ్రామం బస్సు కావాలని విద్యార్థుల కోరిక మేరకు ఎస్ఎఫ్ఐ ముందు బాగా నిలబడి పోరాటం చేసి విజయం సాధించింది అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కువ మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి మండల కేంద్రం జిల్లా కేంద్రాల్లో విద్యను అభ్యసిస్తున్నారు అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి రావడానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ఎక్కువ మంది అమ్మాయిలు చదువుకు దూరం అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా ఎక్కువ మంది పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత చదువులు చదవడం అవకాశం ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బస్సు సౌకర్యం లేని గ్రామాలన్నింటికీ బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కట్టమూరు గ్రామం కు బస్సు సౌకర్యం కల్పించాలని స్పందన కార్యక్రమంలో గత మూడు నెలల నుండి వినతి పత్రాలు ఇవ్వగా చివరికి అధికారులు స్పందించి బస్సు సౌకర్యం కల్పించడం పట్ల ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కమిటీ అధికారులకు కలెక్టర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బి శ్రీను, ఆర్. జీవ, జీ. సురేష్, జి. వీరబాబు యువకులు స్వామి, జె. దుర్గాప్రసాద్, ఎస్.ఎఫ్.ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎం. గంగా సూరిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు టీ. మణికంఠ సాయి, పెద్దాపురం మండల అధ్యక్ష, కార్యదర్శిలు ఎస్. లలిత దేవి, రొంగల అరుణ్ కుమార్ నాయకులు గోపాలకృష్ణ, రోజా, రవీంద్ర, సతీష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు..
@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@
మున్సిపాల్టి ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి, మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా.
కాకినాడ జిల్లా, పెద్దాపురం, సామాజిక స్పందన
ఇంజనీరింగ్ విభాగంలో వివిధ కేటగిరీలలో పనిచేస్తున్న 15 వేల మంది కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని, వారు చేస్తున్న ప్రమాదకరమైన పనిని, శ్రమశక్తిని గుర్తించాలని, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల పర్మినెంట్, హెల్త్ రిస్క్ అలవెన్స్ టి.ఎ, డిఎలు ఇవ్వాలని కోరుతూ ఎ.పి. మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐటియు నాయకులు సిరిపురపు శ్రీనివాస్ మాట్లాడుతూ
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతోపాటు కరెంట్, ఆర్టీసి చార్జీలు, చెత్తపన్నుతో సహా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయని, ఇంజనీరింగ్ కార్మికులు చాలీచాలని జీతాలతో, ఇంటి అద్దెలు కూడా కట్టుకోలేక సరైన తిండికి కూడా నోచుకోక అవస్థలు పడుతున్నారన్నారు. ఇలాంటి సమయంలో సంక్షేమ పధకాలు అమలుచేసి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ పనిచెయ్యకుండా ఆపేసిందని అన్నారు. ఇంజనీరింగ్ కార్మికుల శ్రమను గత ప్రభుత్వం లాగే ఇప్పటి ప్రభుత్వం కూడా గుర్తించకుండా అవమానపర్చడం కార్మికులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నదని అన్నారు. శాసన సభ్యులు తమ సమస్యలను శాసన సభలో ప్రస్ధావించాలని, అలాగే ఇన్ చార్జ్ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాలని కోరారు .ఇంజనీరింగ్ కార్మికులందరికీ హెల్త్ అలవెన్స్ చెల్లించాలని, ఇంజనీరింగ్ మరియు పారిశుధ్య కార్మికులను ఆప్కాస్ నుండి మినహాయించి, గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిగారి హామీ మేరకు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని, సంక్షేమ పధకాలు అమలు చేయాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో కోనాల వెంకట రమణ, సుంకర నాగేశ్వరరావు, మహాపాతిన పాపారావు, బాసిన వీరభద్రరావు, నాం సూర్యప్రకాషరావు, ఐ స్వామి, ఎస్ నాగేశ్వరరావు, బి రవి కుమార్, భూపతి శ్రీను, టి సాయి, బి.భదర్రావు, శివకోటి అప్పారావు, వర్రి రాజేష్, ఎస్.కె బాషా, గంటా సూర్యారావు, ఎమ్.అరుణ్ తదితరులు పాల్గోన్నారు..












0 Comments