పెద్దాపురం, సామాజిక స్పందన
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్దరించే విధంగా, పెండింగ్ క్లైమ్ లు వెంటనే విడుదల చేసే విధంగా చేయ్యాలని, 2500 కోట్లు భవన నిర్మాణ కార్మికుల నిధులు వెంటనే విడుదల చేసే విధంగా ముఖ్యమంత్రి జగన్ మెాహన్ రెడ్డికి జ్ఞానం ప్రసాదించే విధంగా చేయ్యాలని మహాత్మా గాంధీ విగ్రహానికి ఎ.పి.బిల్డింగ్ & అధర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేసారు.
పెద్దాపురం ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్లెకార్డులతో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు డి.క్రాంతి కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ మెాహన్ రెడ్డి పాలన చాలా దుర్మార్గంగా కొనసాగుతుందని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు నిధులు తినేయడం చాలా దుర్మార్గమన్నారు. ఎన్నికల ముందు ప్రజలే నా దేవుళ్ళు అన్న ముఖ్యమంత్రి నేడు ప్రజలను వేధించేస్తున్నారని అన్నారు. ఇసుక సమస్య సృష్టించిసకరోనా పేరుతో తప్పించుకోనే ప్రయత్నం చేసారన్నారు.
తక్షణం పెండింగ్ క్లైమ్ లు విడుదల చేయాలని, సంక్షేమ బోర్డు పునరుద్దరణ చేయ్యాలని డిమాండ్ చేసారు.
కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు గడిగట్ల సచ్తిబాబు, ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు చింతల సత్యనారాయణ, తాడిశెట్టి గంగ, పాండవగిరి పెటింటింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కరణం అప్పారావు, యాసలపు మహేష్, వడ్డి సత్యనారాయణ, సిరిపురపు శ్రీనివాస్, రొంగల వీర్రాజు, ఉల్లి సత్యనారాయణ, డి.సత్యనారాయణ తదితరులు పాల్గోన్నారు.










0 Comments