పెద్దాపురం, సామాజిక స్పందన
పట్టాభి ఆగ్రోపుడ్స్ (సైరస్)లో తొలగించిన కార్మికులను విధుల్లోంచి తొలగించడాని నిరసిస్తూ, కార్మికుల పట్ల యాజమాన్య వైఖరిని ఖండిస్తూ సిఐటియు పెద్దాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో వాలు తిమ్మాపురం రోడ్‌లో ఉన్న పట్టాభి ఆగ్రోపుడ్స్ కంపెనీ గేటు ముందు కార్మికులు నిరసన తెలియజేసారు. ఈ నిరసనలో తొలగించిన కార్మికులు పాల్గోన్నారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు డి. క్రాంతి కుమార్ ప్రసంగించారు. పట్టాభి ఆగ్రోపుడ్స్ ప్రైవేట్ లిమిడెట్‌లో 16 సంవత్సరాలుగా పని చేస్తున్న కార్మికులను తొలగించడం చాలా అన్యాయం అన్నారు. నిత్యం ప్రమాదాల మయంగా పట్టాభి ఆగ్రోపుడ్స్ తయారైందని అన్నారు. కనీసవేతనాలు అమలు చెయ్యమంటే, పిఎఫ్, ఇఎస్ఐ కట్టమంటే కార్మికులను తొలగించడం సిగ్గుచేటని అన్నారు. పట్టాభి ఆగ్రోపుడ్స్ 2009 లో 100 నుండి 200 కోట్ల టర్నోవర్ ఉంటే నేడు అది 2000 కోట్ల దాకా చేరిందని ఇదంతా కార్మికుల శ్రమవల్లే అని గుర్తించాలని అన్నారు. డ్రైవర్ లు క్లీనర్ లకు లారీలు ఇచ్చేస్తున్నారని చెబుతున్న యాజమాన్యం, అదే క్లీనర్ లతో పోర్టుకి సరకు తరలించింది మరిచిపోయారా అని ప్రశ్నించారు. పిఎఫ్, ఇఎస్ఐ కట్టకుండా కార్మికుల పట్ల పట్టాభి ఆగ్రో యాజమాన్యం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో తేల్చాలని అధికారులను డిమాండ్ చేసారు. ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే అతనికి పిఎఫ్, ఇఎస్ఐ లేక రోడ్డున పడే పరిస్ధితికి యాజమాన్యం తీసుకువచ్చిందని అన్నారు. కంపెనీలో కార్మికుల తొలగింపులపైనా, పిఎఫ్, ఇఎస్ఐ పైనా ఉన్నతాధికారులకు పిర్యాదు చేసామని తెలిపారు. తక్షణం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో గేటు ముందే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్య్రకమంలో ప్రజానాట్యమండలి నాయకులు డి.కృష్ణ, ఆర్.వీర్రాజు మద్దతు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బి.పెదబాబు, రమేష్, వరప్రసాద్, బ్రహ్మనందం, బాలరాజు, పెంకె శ్రీను, సుభాష్, బాబురావు, రాంబాబు, సురేష్, తేజ,అప్పారావు, శివ వెంకటేశ్వరరావు తదితరలు పాల్గోన్నారు.











0 Comments