నరసరావుపేటకి తలమానికంగా జేఎన్టీయూ కళాశాలను తీర్చిదిద్దుతాము : ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

 


నరసరావుపేట, పల్నాడు జిల్లా, సామాజిక స్పందన

నరసరావుపేట మండలం కాకాణి గ్రామం వద్ద నిర్మిస్తున్న జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ(జేఎన్టీయూ) కళాశాల క్యాంపస్ లో బీటెక్ మొదటి సంవత్సరం తరగతులను గౌరవ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ శ్రీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు గారు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ హేమ చంద్రా రెడ్డి గారు, పల్నాడు కలెక్టర్ శ్రీ శివ శంకర్ గారు, యూనివర్సిటీ వైస్ చాన్సలర్ గారి కలిసి ఇవాళ లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. తొలిదశలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతుల నిర్వహణకు వీలుగా భవనాల నిర్మాణం చేపట్టారు. రూ.9.2 కోట్లతో నిర్మించిన అకడమిక్ బ్లాక్-1 దాదాపుగా పూర్తవ్వగా... ఐదు తరగతి గదులు, కంప్యూటర్, ఫిజిక్స్ ల్యాబ్లు, మెకానికల్ వర్క్షాప్, డ్రాయింగ్ హాల్, లైబ్రరీ, సెమినార్ హాల్, అధ్యాపకుల, వైస్ ప్రిన్సిపల్ గదులను ప్రారంభించారు.

యూనివర్శిటీ కళాశాలను యూనివర్సిటీ చేసుకోవడానికి కృషి చేస్తామని హామీ.



పల్నాడు జిల్లాను అభివృద్ధి చేసుకోవడానికి జేఎన్టీయూ కళాశాల ఒక మణిహారంలా ఉంటుందని అభివర్ణన

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నరసరావుపేటలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళా శాలను డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంజూరు చేశారని... నరసరావుపేట మండలం కాకాని వద్ద 85.94 ఎకరాల సువిశాల భూమిని గుర్తించి కళాశాలకు కేటాయించడం జరిగింది అన్నారు. అనంతరం వచ్చిన ప్రభుత్వం యూనివర్సిటీ పట్టించుకోలేదని అన్నారు. కళాశాల నిర్మాణాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. దీంతో అద్దె భవనాల్లో 2016 నుంచి తరగతులు నిర్వహించడమే కాకుండా . గత ప్రభుత్వం ఐదేళ్లలో వైఎస్సార్ కేటాయించిన భూమి చుట్టూ ప్రహరీని కూడా నిర్మించలేకపోయిందన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి అధికారం చేపట్టిన వెంటనే జేఎన్టీయూ కళాశాలకు సొంత భవనాల నిర్మాణం పురోగతిలోకి వచ్చిందన్నారు. 2020 ఆగస్టు 17న వర్చువల్ విధానంలో రూ.150 కోట్ల అంచనాతో నిర్మాణ పనులను సీఎం ప్రారంభించగా. అప్పటి నుంచి పనులు పరుగులు పెట్టాడం జరిగింది అన్నారు. ప్రత్యేక శ్రద్ద తీసుకొని నెల నెల సమీక్షలు నిర్వహించడం జరిగింది అన్నారు.. రూ.10 కోట్లతో ప్రహరీ నిర్మాణం పూర్తి చేశారమన్నరు.. అనంతరం కళాశాల భవన నిర్మాణ పనులు ప్రారంభించామని.. రూ.150 కోట్లతో దశలవారీగా కరోనా లాంటి పరిస్థితులు వచ్చినా వెనకడుగు వేయకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి అన్నారు. తొలి విడతలో రెండు అకడమిక్ బ్లాక్ లు, ఓ అడ్మిస్ట్రేషన్ బ్లాక్ ను రూ.30 కోట్లతో నిర్మిస్తున్నమన్నరు. ఈ పనులు 75 శాతానికిపైగా పూర్తవ్వగా .. రెండో దశలో బాలుర, బాలికల కోసం రెండేసి చొప్పున నాలుగు హాస్టళ్లు రూ.64 కోట్లతో 2 వేల మంది వసతి పొందేలా నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయన్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ సుమారు రూ.16 కోట్లతో ఏర్పాటు చేయబోతున్నం అన్నారు. ఇండోర్ స్టేడియం అందుబాటులోకి రానుంది అన్నారు. జేఎన్టీయూ కళాశాల ప్రాంగణంలో అంతర్గత రహదారుల నిర్మాణానికి రూ.17 కోట్లు, అతిథి గృహానికి రూ.6.5 కోట్లు వెచ్చించనున్నామన్నారు.


రానున్న రోజుల్లో యూనివర్శిటీ కళాశాలను యూనివర్సిటీ చేసుకోవడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లాను అభివృద్ధి చేసుకోవడానికి జేఎన్టీయూ కళాశాల ఒక మణిహారంలా ఉంటుంది అన్నారు. సొంత భవనాలు నిర్మాణ కోసం పూర్తి సహకారం అందించిన సీఎం గారికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం గారు ఫైనల్ చేసిన డిజైన్ లతో ఇవాళ కళాశాల నిర్మించడం జరిగింది అన్నారు.


ఎంపీ గారు మాట్లాడుతూ... కళాశాలలో విద్యార్థుల సామర్థ్యాన్ని 10 వేలకు పెంచాలి అన్నారు. ఒక్కో డిపార్ట్మెంట్ లో 3,4 సెక్షన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలి అని కోరారు. ఎలాంటి అడ్వాన్స్డ్ కోర్సులకు సహకారం కావాలన్నా తన విజ్ఞాన్ యూనివర్సిటీ నుంచి పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. గతంలో ఎవరో శంకుస్థాపన చేస్తే మరెవరో పూర్తి చేసి రిబ్బన్ కట్ చేసి వారని.. కానీ ఒక ప్రభుత్వం హాయంలో పనులు మొదలు పెట్టి... 3 ఏళ్లలో పూర్తి చేసి భవనాల్లో బోధనలు ప్రారంభించిన పరిస్థితి ఇవాళ వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలోనే వచ్చింది అన్నారు. ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి క్లాస్ రూమ్ నిర్మాణం ఎలా ఉండాలో డిజైన్ చేసిన సీఎం గారికి ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో యూనివర్సిటీ కాలేజ్ రిజిస్టర్, రెక్టర్, ప్రిన్సిపల్, చీఫ్ ఇంజినీర్, ఈసి మెంబర్లు, కాంట్రాక్టర్ గారు, నరసరావుపేట ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, కాకాణి గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు.. తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.