విశాఖ లో జనసేనానికి స్వాగత ర్యాలీ, భారీగా మోహరించిన పోలీసులు..


విశాఖపట్నం, సామాజిక స్పందన

 విశాఖ పర్యటనకు వచ్చిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు జనసైనికులు అపూర్వ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ర్యాలీగా ఆయన బసచేసే నోవాటెల్‌ హోటల్‌కు తరలివెళ్లారు.

పవన్‌ వెళ్లే మార్గంలో జనసేన కార్యకర్తలు అడుగడుగునా గజమాలలతో స్వాగతం పలికారు. అభిమానులు రోడ్డుకు ఇరువైపులా నిల్చొని ఆయన రాకకోసం ఎదురు చూశారు. విశాఖ విమానాశ్రయంలో మంత్రులు, వైకాపా నేతలపై రాళ్లదాడి ఘటన దృష్ట్యా.. పవన్‌ వెళ్లే దారిలోని అన్ని కూడళ్లలో పోలీసులు మోహరించారు. ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తాటిచెట్లపాలెం, రైల్వే న్యూ కాలనీ మీదుగా నోవాటెల్‌కు ర్యాలీ చేరుకుంది. ఆదివారం విశాఖలోని పోర్టు కళావాణి స్టేడియంలో జనవాణి కార్యక్రమం నిర్వహించనున్న పవన్‌ .. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.